• డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో అపార ఉద్యోగ అవకాశాలు
  • చదువుతో పాటు నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు
  • స్కిల్ తో పాటు విల్ కూడా ఉండాలి
Suresh Katta Addressing the Students and Faculty on Data Analytics at VIT-AP University.

రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ఉండబోతున్నాయని అమెరికాలోని ప్రముఖ సంస్థ  సామా టెక్నాలజీస్ వ్యవస్థాపక సిఈవో సురేష్ కట్టా చెప్పారు, విఐటీ-ఎపి యూనివర్సిటీలో “టాక్ ఆన్ డేటా ఏనలటిక్స్ మరియు ట్రెండ్స్ ఇన్ సాప్ట్ వేర్ “లో జరిగిన వర్క్ షాప్ లో మాట్లాడిన సురేష్ కట్టా విద్యార్ధులు ప్రసుతం విద్యతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకుని , సాంకేతిక పరిజ్ఞాన్నాని అందిపుచ్చుకోవాలని అప్పుడే  ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని అన్నారు.

విద్యార్ధులకి స్కిల్ తో పాటు విల్ కూడా ఉండాలని, అప్పుడే రాణిస్తారని , ప్రస్తుత మార్కెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ,మెషిన్ లెర్నింగ్ ,డీప్ లెర్నింగ్ లో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయని తెలిపారు. విఐటీ-ఎపి విశ్వవిద్యాలయంలో పరిశ్రమ అనుగుణంగా కరిక్యులం బోధించటం పట్ల విఐటీ-ఎపి  వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాధన్ మరియు వైస్ చాన్సలర్ డాక్టర్ డి.శుభకర్ లను ప్రశంసించారు.

News Reporter
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *