ఫైల్స్ క‌న్వ‌ర్ట్ చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డే టూల్స్ – Part 1

ఆన్‌లైన్‌లో అనేక ఫైల్స్ ఉంటాయి. ఇవి ఒక్కొక్క‌టి ఒక్కో మీడియా ఫార్మాట్‌లో ఉంటాయి. అడియో, వీడియో, ఇమేజ్‌, టెక్స్‌ట్‌,
యానిమేష‌న్‌, జిఫ్ .. ఇలా ప‌లు ర‌కాల ఫార్మాట్స్ ఉంటాయి. ఇంటర్నెట్‌ వాడకం మొదలైన తర్వాత ప‌లు రకాల మీడియా ఫైల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో రకం మీడియా ఫైల్ దానికి కంపాట‌బుల్‌గా ఉన్న మీడియా ఫార్మాట్స్‌లో ల‌బిస్తుంది. ఉదాహరణకు ఒక అడియో ఫైల్‌నే తీసుకుంటే ప‌లు రకాల‌ ఫార్మాట్స్‌లో మనకు కన్పిస్తూ ఉంటుంది. అడియో, వీడియో,ఇమేజ్‌, యానిమేష‌న్‌, జిఫ్‌ .. వంటి పలు ర‌కాల ఫైల్స్‌ను … కన్వర్ట్‌ చేయడం గురించి తెలుసుకుందాం.
అందుబాటులో అనేక ర‌కాల ఫైల్స్
ఆడియో ఫైల్స్‌ అనేకం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. మనకు నచ్చిన ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వింటూ
ఉంటాం. ఆడియో ఫైల్స్‌లో ఫార్మాట్‌ను బట్టి వాటి సామర్ద్యం, ప్లే అయ్యే విదానం ఉంటుంది. ఆడియో ఫైల్స్‌ కూడా ప‌లు రకాల‌ ఫార్మాట్స్‌ను కలిగి ఉంటుంది. అత్యదిక శాతం ఉపయోగించే ఫార్మాట్‌ ఎంపి3 ఫార్మాట్‌. మీకు నచ్చిన ఆడియో ఫైల్స్‌ను ఈ ఫార్మాట్‌లోకి మీరు కన్వర్ట్‌ చేసుకోవచ్చు.

ఆడియో ఫైల్స్‌ కన్వర్షన్‌ ..
MP3,WAV,WMA .. వంటి ఫార్మాట్స్‌లో ఉన్న ఆడియో ఫైల్స్‌ను ఎంపి3 (MP3) ఫార్మాట్‌లోకి కన్వర్ట్‌ చేయడం చాలా సులువు.
ఇంటర్నెట్‌లో మన అవసరాల కోసం పలు రకాల‌ సాఫ్ట్‌వేర్స్‌ కోసం వెతుకుతూ ఉంటాం. కానీ సరైన సాఫ్ట్‌వేర్ ల‌బించడం కష్టమే.
ముఖ్యంగా కన్వర్షన్‌ కోసం ల‌బించే ఉచిత సాఫ్ట్‌వేర్స్‌లో అనేకం సరిగ్గా పనిచేయవు. పైగా వీటితో పాటుగా ఇతర సాఫ్ట్‌వేర్స్‌ కూడా డౌన్‌లోడ్‌ అవుతూ సతాయిస్తుంటాయి.
ఎంపి3 కన్వర్షన్‌ కోసం ఇక్కడ చెప్పుకునే Free WMA MP3 Converter అనే సాఫ్ట్‌వేర్‌ MP3,WAV,WMA .. వంటి
ఫార్మాట్స్‌ను ఎంపి3 ఫార్మాట్‌లోకి కన్వర్ట్‌ చేస్తుంది. చాలా తక్కువ సైజ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ వేగంగా ఫైల్‌ కన్వర్షన్‌ చేస్తుంది.
విఎల్‌సి సాఫ్ట్‌వేర్‌ గురించి ..
FLAC, MP3, MP4, OGG … ఆడియో, వీడియో ఫైల్స్‌తో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి తెలిసే ఉంటుంది. తక్కువ సైజ్‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌ అనేక ఆడియో, వీడియో ఫార్మాట్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. మల్టీమీడియా ఫైల్స్‌ను సపోర్ట్‌ చేయడమే కాకుండా వాటిని కన్వర్ట్‌ చేయడంలో కూడా మనకు ఉపయోగపడుతుంది. విఎల్‌సి సాఫ్ట్‌వేర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత మెనూ బార్‌లో
Media > Convert/Save ను సెలెక్ట్‌ చేసుకోవాలి. డిస్‌ప్లే డయలాగ్‌ బాక్స్‌ను కన్వర్ట్‌ సేవ్‌ చేయవచ్చు.FLAC, MP3, MP4, OGG .. వంటి ఫైల్‌ ఫార్మాట్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఫైల్‌ కన్వర్ట్‌ చేయడం కోసం Convert/Save సేవ్‌ డయలాగ్‌ బాక్స్‌లో యాడ్‌ను క్లిక్‌ చేసి ఎంపి4 ఫైల్‌ను యాడ్‌ చేయండి. దీని ఎక్కడ సేవ్‌ చేయాలి అలాగే ఏ ఫార్మాట్‌లోకి కన్వర్ట్‌ చేయాలో కూడా మనమే ఎంచుకోవాలి. అంతా సెలెక్ట్‌ చేసుకున్న తర్వాత సేవ్‌ అనే బటన్‌ను ప్రెస్‌ చేస్తే సరిపోతుంది.


మరో ఆడియో కన్వర్టర్‌ ..
MediaHuman Audio Converter .. అనే సాఫ్ట్‌వేర్‌ ఆడియో కన్వర్ష్‌న్‌లో చక్కగా పనిచేసే మరో సాఫ్ట్‌వేర్‌. AAC, AIFF, ALAC, FLAC, MP3, OGG WMA, WAV .. వంటి అనేక ఫార్మాట్స్‌ను ఇది సపోర్ట్‌ చేస్తుంది. మన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌, ఐపోడ్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌.. వంటి వాటిలో మెమోరీ తక్కువగానే ఉంటుంది. సేకరించే ఆడియో ట్రాక్స్‌ అనేకం ఉంటాయి. వీటిని అన్నింటిని కంప్రెస్‌ చేయడం, ప‌లు ఫార్మాట్స్‌లోకి కన్వర్ట్‌ చేయడం .. వంటివన్నీ కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా సుల‌వుగా చేయగలం. తక్కువ మెమోరీలోకి కంప్రెష్‌ చేయడం (క్వాలిటీ తగ్గకుండా), వేగంగా కన్వర్షన్‌ చేయడంలో ఈ టూల్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ డయలాగ్‌ బాక్స్‌ను ఒకసారి గమనించండి. ఇతర కన్వర్టర్స్‌లాగానే ఆడియో ఫైల్స్‌ను ఇన్‌పుట్‌గా తీసుకుని వాటిని మీకు కావాల్సిన ఫార్మాట్‌లోకి కన్వర్ట్‌ చేసి ఇస్తుంది. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కన్వర్షన్‌ను చేయగం. ఇది సోషల్‌ మీడియా ప్లగ్‌ఇన్స్‌ను కూడా కలిగి ఉంది.
ఐ ట్యూన్స్‌ ..
iTunes .. అనే ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి తెలియని వారుండరు. AAC, AIFF, ALAC, MP3, WAV … వంటి పు ఫార్మాట్స్‌ను ఇది
సపోర్ట్‌ చేస్తుంది.AAC, MP3 .. వంటి ఫార్మాట్స్‌ ఇది వరకు కంప్రెస్‌ అయి ఉన్న ఫార్మాట్స్‌. మళ్లీ వీటిని కంప్రెస్‌ చేయడం ద్వారా ఆడియో క్వాలిటీని కొల్పోవాల్సి వస్తుంది. ఐ ట్యూన్స్‌ స్టోర్‌ మన ఫైల్స్‌ను Advanced Audio Coding (AAC) ఫార్మాట్‌లో ఇస్తుంది. ఐ పోడ్‌తో పాటుగా అనేక డివైజ్‌ల‌లో అత్యదికంగా ఎంపి3 ఫార్మాట్‌నే ఉపయోగిస్తున్నారు. దీని దృష్టిలో పెట్టుకుని ఒక AAC ఫార్మాట్‌నే కాకుండా ఎంపి3 ఫార్మాట్‌లోకి ఫైల్స్‌ను ఇంపోర్ట్‌ చేసుకోవడానికి సహకరిస్తుంది.
ఐ ట్యూన్స్‌ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్‌ చేసిన తర్వాత Preferences >Import settings ఎంచుకోవాలి. ఇక్కడ ప‌లు ర‌కాల సెట్టింగ్స్‌ కన్పిస్తూ ఉంటాయి. ఇక్కడ MP3 , AAC encoding… కి సంబందించిన అప్షన్స్‌ కన్పిస్తూ ఉంటాయి. ఇక్కడ తక్కువ బిట్‌ రేట్‌లో
కన్వర్ట్‌ చేయకుండా ఉండాలి. లేదంటే క్వాలిటీని లాస్‌ కావాల్సి వస్తుంది.  ఇప్పుడు తిరిగి ఐట్యూన్స్‌ మ్యూజిక్‌ కలెక్షన్‌లోకి వ్లెండి. వేటిని కన్వర్ట్‌ చేయాలో వాటిని సెలెక్ట్‌ చేసుకోవాలి. వాటిపై రైట్‌ క్లిక్‌ చేసి Create MP3 Version ని సెలెక్ట్‌ చేసుకోవాలి. వెంటనే కన్వర్షన్‌ మెదవుతుంది. కన్వర్షన్‌ పూర్తయిన వెంటనే రెండు ట్రాక్స్‌  వస్తాయి. వీటిలో ఏ ట్రాక్‌ అడియో క్వాలిటీ మెరుగ్గా ఉందో దాన్నే ఉంచుకొండి.

మ‌రికొన్ని ఫైల్ ఫార్మాట్ క‌న్వ‌ర్ట‌ర్స్ గురించి రెండ‌వ పార్ట్‌లో చూడండి.

News Reporter
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *