ఫైల్ క‌న్వ‌ర్ట్ గురించి ప‌లు విశేషాలు .. Part 3

అడియో, వీడియో క‌న్వ‌ర్ట‌ర్స్ గురించి తెలుసుకున్నాం. ప‌లు ఉచిత టూల్స్‌ను వాటి ఉప‌యోగాల‌ను తెలుసుకున్నాం. మ‌రికొన్ని
ఫైల్ క‌న్వ‌ర్ష‌న్‌కు సంబందించిన టూల్స్ గురించి తెలుస‌కుందాం.
Video2 MP3 / Anything2 MP3
ఆడియో, వీడియో ఫైల్స్‌ ఇంటర్నెట్‌లో ల‌క్ష‌ల‌ కొద్ది ఉంటాయి. ముఖ్యంగా YouTube, SoundCloud, online media … వంటి ఆన్‌లైన్‌ సోర్సెస్‌ అనేక మల్టీమీడియా ఫైల్స్‌ను అందిస్తుంటాయి. ఇక్కడ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న వీడియోల‌ను ఎంపి3 గా మార్చడానికి  అలాగే ఏదేని ఆడియో, వీడియోను ఎంపి3గా మార్చడానికి Video2MP3 / Anything2MP3 … ఈ రెండు టూల్స్‌ ఉపయోగపడతాయి.
VLC
విఎల్‌సి మీడియా ప్లేయర్‌ ద్వారా ఇది వరకు చెప్పుకున్నట్టు ఎంపి4 నుంచి ఎంపి3గా మార్చడానికే కాకుండా వీడియో ఫార్మాట్స్‌ను కూడా కన్వర్ట్‌ చేయడంలో ఉపయోగపడుతుంది. H.264, MP4, MPEG-2, WMV … వంటి ఫైల్స్‌ను ఇది సపోర్ట్‌ చేస్తుంది.
Hand Brake
హ్యాండ్‌ బ్రేక్‌ సాఫ్ట్‌వేర్‌ ఉచితంగా ల‌బించే టూల్‌. ఇది చాలా బెస్ట్‌ టూల్‌. కొన్ని రకాల వీడియో ఫార్మాట్స్‌ను వేరొక ఫార్మాట్‌లోకి
మార్చడంలో ఉపయోగపడుతుంది. వీడియోను బాగా కంప్రెస్‌ (క్వాలీటి తగ్గకుండా) చేయడంలో ఈ టూల్‌ను ఉపయోగిస్తారు.
H.264, MKV, MP4, MPEG-2, WMV … వంటి ఫార్మాట్స్‌ను ఇది సపోర్ట్‌ చేస్తుంది.
Any Video Converter
వీడియో ఫార్మాట్స్‌లో అనేక ఫార్మాట్స్‌ అందుబాటులో ఉంటాయి. మన అవసరాన్ని బట్టి వేరొక ఫార్మాట్‌లోకి మార్చాల్సి రావచ్చు.
AVI, MP4, MKV, MOV, FLV, and MP3, OGG, AAC, WMA, WAV, FLAC … అనేక వీడియో ఫార్మాట్స్‌ను కన్వర్ట్‌ చేయడంలో ఈ టూల్‌ ఉపయోగపడుతుంది.
Avi2Dvd
AVI, OGM, MKV, MP4, WMV, DVD … వంటి ఫార్మాట్స్‌ను కన్వర్ట్‌ చేస్తుంది.చాలా పాతకాం సాఫ్ట్‌వేర్‌. కానీ ఇప్పటికీ చక్కగా
పనిచేస్తుంది. ఒక ఎవిఐ కాకుండా కొన్ని రకాల‌ ఇతర ఫార్మాట్స్‌ను కూడా కన్వర్ట్‌ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
Free Studio
ముఖ్యమైన అన్ని రకాల ఆడియో, వీడియో, ఇమేజ్‌ ఫార్మాట్స్‌ను కన్వర్ట్‌ చేయడంలో ఈ టూల్‌ ఉపయోగపడుతుంది.
ప‌లు రకాల ఫార్మాట్స్‌ను కన్వర్ట్‌ చేయడంతో పాటుగా ఇందులో డౌన్‌లోడ్‌ మేనేజర్‌ కూడా ఉంది.దీని ద్వారా YouTube, Dailymotion,
and Instagram … వంటి ఆన్‌లైన్‌సోర్సెస్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేయగం.
Freemake Video Converter
ఈ టూల్‌ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 300కి పైగానే ఆడియో, వీడియో, ఇమేజ్‌ ఫార్మాట్స్‌ను ఇది సపోర్ట్‌ చేస్తుంది. యాపిల్‌, అండ్రాయిడ్‌, ఎక్స్‌బాక్స్‌, పిఎస్‌పి .. ఇలా ఎ ఫ్లాట్‌ఫాంపైన అయినా ఫైల్స్‌ కన్వర్ట్‌ కావాంటే ఈ ఉచిత టూల్‌ను ఉపయోగించండి.
Format factory
అన్ని రకా ఆడియో, వీడియో, ఇమేజ్‌ ఫార్మాట్స్‌ను కన్వర్ట్‌ చేయడంలో ఉపయోగపడే మరో టూల్‌ ఇది.
ఇమేజ్‌ను కన్వర్ట్‌ చేసే టూల్స్‌ …అనేక రకా ఇమేజ్‌ల‌తో మనం పనిచేస్తుంటాం. ఇమేజ్‌లోని ప‌లు ఫార్మాట్స్‌ను ఒక ఫార్మాట్‌ నుంచి వేరొక ఫార్మాట్‌కు కన్వర్ట్‌ చేయడంలో ప‌లు రకాల టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. సాదారణంగా సాఫ్ట్‌వేర్‌లోనే ఒక ఇమేజ్‌ ఫార్మాట్‌ను ఓపెన్‌ చేసి వేరొక ఇమేజ్‌ ఫార్మాట్‌లోకి కన్వర్ట్‌ చేయవచ్చు. పోటోషాప్‌లో ఒక ఇమేజ్‌ను ఓపెన్‌ చేస్తే , దాన్నే సేవ్ యాజ్‌గా సెలెక్ట్‌ చేసుకుని అక్కడ ఉండే ఇమేజ్‌ ఫార్మాట్స్‌ను ఎంచుకుని వేరొక ఇమేజ్‌ ఫార్మాట్‌లోకి మార్చగలం. ఇలా మార్చడం కోసం ఉచితంగా ల‌బించే ప‌లు టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి … వాటి గురించి …
IrfanView … దీని ద్వారా ఇమేజ్‌ను ఎడిటింగ్‌ చేయడంతో పాటుగా వేరొక ఇమేజ్‌ ఫార్మాట్‌లోకి మార్చగలం. ImageMagick అనే
ఈ టూల్‌ ద్వారా 100 రకాల ఇమేజ్‌ ఫార్మాట్స్‌ను ఒకదాని నుంచి వేరొక దానిలోకి మార్చగలం.
Zamzar, Xncovert, NEF to JPG … వంటి టూల్స్‌ అన్నీ కూడా అనేక ఇమేజ్‌ ఫార్మాట్స్‌ను కన్వర్ట్‌ చేసి అందించడంలో సపోర్ట్‌ చేస్తాయి.

News Reporter
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *