సోష‌ల్ మీడియా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు…

సోషల్‌ మీడియాతో ఆప్రమత్తంగా ఉండాలి … సోషల్‌ మీడియా పదాన్ని తరుచుగా వింటున్నాం. ఇటీవల కాలంలో అనేక మంది ఈ వెబ్‌సైట్స్‌లో అక్కౌంట్స్‌ని ఓపెన్‌ చేసుకుంటున్నారు. కొత్తగా సోషల్‌ మీడియా సైట్స్‌ను ఉపయోగించే వారు కానీ, ఇది వరకు ఉపయోగిస్తున్న వారిలో కానీ అత్యధికశాతం మందికి సోషల్‌ మీడియాను ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. అనేక మంది అక్కౌంట్‌ క్రియేట్‌ చేసుకున్న తర్వాత ఇబ్బంది పడుతున్నవారే. తెలియని అనేక లింక్స్‌ను ఓపెన్‌ చేయడం, సిస్టమ్‌లోకి స్పామ్‌ని తెచ్చుకోవడం, ఇతరును ఇబ్బంది పెట్టడం లేదా ఇతరుల‌ ట్రాప్‌లో పడటం, అనవసరంగా విలువైన సమయాన్ని వృదా చేయడం ఇలా  ప‌లు ర‌కాలుగా  ఇబ్బంది పడుతున్నవారే. సోషల్‌ మీడియా అనేది కెరీర్‌ లేదా వ్యాపార అభివృద్దికి కాకుండా  విలువైన జీవితాన్ని ఇబ్బందుల్లో నెట్టడం కోసమే అనే విధంగా ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియాను చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. కంప్యూటర్స్‌ ఫర్ యు మ్యాగ‌జైన్‌లో  సైబర్‌ క్రైమ్స్ అనే శీర్షిక ద్వారా అనేక విషయాల‌ గురించి క్షుణ్ణంగా సైబ‌ర్ నేరాల గురించిన అనేక విష‌యాల‌ను కూడా ఇదే వెబ్‌సైట్‌లో అనేక  వ్యాసాలు అందుబాటులోకి రానున్నాయి. సోషల్‌మీడియా అక్కౌంట్‌ను మంచి కోసం ఉపయోగిస్తే మంచి గుర్తింపును పొందుతారు. అదే చెడు కోసం ఉప‌యోగిస్తే జీవితం కూడా నాశ‌నం అవుతుంది. తాగుడు, జూదం .. వంటి వ్యసనాల‌ మాదిరిగానే ఇది కూడా ఒక వ్యసనంగానే మారుతుంది.

75 శాతం మంది సోషల్‌ మీడియాలోనే … సోషల్‌ మీడియాకు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల‌ను ఇక్కడ  తెలుసుకుందాం. ఈ విషయాల‌ను గమనిస్తే సోషల్‌ మీడియాకు ఇంత శక్తి ఉందా అనిపిస్తుంది. ప్రస్తుతం మొత్తం ఇంటర్నెట్‌ను ఉపయోగించే యూసర్స్‌లో 75 శాతం మంది యూసర్స్‌ సోషల్‌ మీడియా సైట్స్‌ను యాక్సస్‌ చేయడం, వాటిలోనే నిరంతరం గడపడం చేస్తున్నారు. నెటిజన్స్‌ అంతా ఎక్కడున్నారంటే సోషల్‌ మీడియాలోనే కాల‌క్షేపం చేస్తున్నారు. మంచికి ఉపయోగించండి ఎన్నో మంచి పనులు జరుగుతాయి. అందులోని చెడు తీసుకుంటే మాత్రం జీవితం నరకప్రాయం అవుతుంది.

యువత ఇన్‌స్టాగ్రామ్‌ వైపే … సోషల్‌ మీడియాలో మనం తరుచుగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ ప్లస్‌, యుట్యూబ్‌ … వంటి వెబ్‌సైట్స్‌ పేర్లనే వింటూ ఉంటాం. ఇవి కాకుండా ఇంకా అనేక వెబ్‌సైట్స్‌ వాడుకలో ఉన్నాయి. కంప్యూటర్స్‌ ఫర్‌ యు గత సంచికలో 50కి పైగా సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌ గురించి చెప్పుకున్నాం. ఇటీవ కాంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ కాకుండా అత్యధిక శాతం యువత “instagram”  సోషల్‌ మీడియా సైట్‌ని ఉపయోగిస్తున్నారు. ఒక అమెరికాలోనే 77 మిలియన్‌కు పైగానే ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. 2018 కల్లా 100 మిలియన్‌కు పైగానే యూసర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించనున్నారు.

ప్రొఫెషనల్స్‌ లింక్‌డ్‌ ఇన్‌లో … లింక్‌డ్‌ఇన్‌ వెబ్‌సైట్‌ కూడా బాగా ప్రాచుర్యాన్ని పొందింది. అయితే ఇందులో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో మాదిరిగా ప్రతి ఒక్కరు అక్కౌంట్‌ ఓపెన్‌ చేయడం లేదు.  కేవం ప్రొఫెషనల్స్‌ మాత్రమే అక్కౌంట్‌ ఓపెన్‌ చేస్తున్నారు. ఏదేని బిజినెస్‌లో కానీ, ఉద్యోగంలో కానీ ఉన్నవారు, ప్రత్యేక స్కిల్స్‌ కలిగిన వారు తమ గురించి తెలియచేస్తూ అక్కౌంట్‌ను ఓపెన్‌ చేస్తున్నారు. ఇలా అనేక రంగాకు చెందిన నిపుణు లింక్‌డ్‌ఇన్‌లో ఉంటున్నారు. ప్రొఫెషనల్స్ ను కల‌పడంలో ఈ వెబ్‌సైట్‌ చక్కగా ఉపయోగపడుతుంది.

ఫిమేల్స్ , మేల్స్‌ సమానంగా … సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌ అన్నింటిలోను ఫిమేల్స్‌, మేల్స్‌ నిష్పత్తి సమానంగా ఉంటుంది. ఒక్క “pinterest” లో మాత్రం ఫిమేల్స్‌ 43 శాతం ఉండగా 13 శాతం మేల్స్‌ ఉంటున్నారు. మిగతా అన్నింటిలోను వీరి నిష్పత్తి సమానంగానే ఉంటుంది.

కేబుల్‌ నెట్‌వర్క్‌ కంటే యూట్యూబే …యుట్యూబ్‌ వెబ్‌సైట్‌ అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌. దీన్ని సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌గానే చెప్పవచ్చు. ఇందులో కూడా అనేక మంది చానల్స్‌ ద్వారా స‌మాచారాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. 18 నుంచి 49 వయస్సుక వారిలో అత్యధిక శాతం మంది యుట్యూబ్‌ని చూస్తున్నారు. ప్రతి ఇంట్లో టివి దానికి కేబుల్‌ కనెక్షన్‌ ఉంటుంది .. కానీ కేబుల్‌ టివి కంటే ఎక్కువగా యుట్యూబ్‌నే ఎంచుకుంటున్నారు. అంటే భవిష్యత్‌లో టెలివిజన్స్‌ చానల్స్‌ను యుట్యూబ్‌లాంటి వీడియో స్ట్రీమింగ్‌ సైట్స్‌ వెనక్కి నెట్టేస్తాయి. ఒక విధంగా ఇంటర్నెట్‌ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌ టివిని కనుమరుగు చేయవచ్చు.

ఫేస్‌బుక్‌నే అత్యధికంగా …ప్రస్తుతం సోషల్‌ మీడియా సైట్స్‌లో అత్యధిక శాతం మంది ఫేస్‌బుక్‌లోనే ఉంటున్నారు. సోషల్‌ మీడియా సైట్‌ అంటే ఫేస్‌బుక్‌ అనే అర్థం రావడం వ్లనే ఇది జరుగుతుంది. అనేక మంది నెటిజన్స్‌ ఇతర సైట్స్‌లో కూడా ఉంటున్నారు. అక్కడ కూడా ఒకరినొకరు కల‌వచ్చు. యుట్యూబ్‌, గూగుల్‌ను కాదని కూడా కొన్ని సందర్బాల్లో ఫేస్‌బుక్‌ నెంబర్‌ వన్‌ స్థానంలోకి వస్తుంది.

అసక్తికరంగా ఉండే మరికొన్ని విషయాలు… సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌లోకే ఆన్‌లైన్‌ డేటింగ్‌ వెబ్‌సైట్స్‌ కూడా వస్తాయి. ఆన్‌లైన్‌లో డేటింగ్‌కు Adult FriendFinder, Ok Cupid, Ashley Madison, Tinder, and Badoo  …. వంటి పలు  సైట్స్‌ ఉన్నప్పటికి Badoo  సైట్‌ బాగా వాడుకలో ఉంది. పెద్ద స్థాయిలో ఉండే కమ్యూనిటీస్‌ కోసం బెస్ట్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌గా  “Reddit”  ప్రాచుర్యాన్ని పొందింది. 36 మిలియన్‌కు పైగానే యూసర్స్‌ ఇందులో ఉన్నారు. కేవలం ఇందులో కమ్యూనిటీస్‌గా ఉండే సంఖ్య 8 ల‌క్షకు పైగానే. సోషల్‌ మీడియాలో ఉన్న పవర్‌ ఏమిటంటే ఎండ్‌ యూసర్‌కు పూర్తి స్వేచ్చనిస్తుంది. అయితే ఇది చాలా ప్రమాదకరం కూడా. చేతిలో కీబోర్డ్‌ ఉందని ఏదంటే అది రాస్తే కూడా ఇబ్బందులో పడవచ్చు. అలాగే మన పోస్ట్‌లు  కూడా ఇతరు మన్నల‌ను పొందేలా ఉండాలి. మన అసహనాన్ని ప్రదర్శించకుండా, చెప్పాల‌నుకున్నది చక్కగా వివరించాలి లేదంటే ఎటువంటి పోస్ట్‌లు  చేయకూడదు.యువతకు సోషల్‌ మీడియాను సెక్యూర్డ్‌గా ఉపయోగించడం తెలియక ఇబ్బందుల్లో పడుతున్నారు. పాస్‌వర్డ్‌ మొదుకుని ప్రతి దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మీ అక్కౌంట్‌ని నిర్వహించాలి.  సోషల్‌ మీడియాలో అనేక మంది యూసర్స్‌ ఉంటున్న కారణంగా అక్కడ విపరీతమైన స్పామ్‌ పోస్ట్‌ అవుతుంది. అనేక మంది అవేవో లింక్స్‌ అనుకుని క్లిక్‌ చేస్తుంటారు. దీంతో వీరు క్లిక్‌ చేసిన స్పామ్‌ వారి స్నేహితుల‌ లిస్ట్‌లో ఉన్న వారికి కూడా వెళ్లుతుంది. సోషల్‌ మీడియాను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*