గ్లోబల్‌గా ఉచిత వైఫై సేవలను అందించ‌నున్న చైనా టెక్నాల‌జీ సంస్థ‌

December 2, 2018 Digital For You 0

టెక్నాలజీ రంగంలోనూతన ఆవిష్కరణలకు సంబంధించి చైనా టెక్నాలజీ సంస్థ  మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. గ్లోబల్‌గా ఉచిత వైఫై సేవలను ను అందించేందుకు  ప్రణాళికలు సిద్ధం  చేసింది.  ప్రత్యర్థి టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, స్పేస్‌ఎక్స్‌లాంటి  సంస్థల మాదిరిగా ప్రపంచవ్యాపితంగా ఉచిత వైఫై సేవలను అందించేందుకు తొలి అడుగు వేసింది. ప్రణాళికలో  భాగంగా చైనాకు చెందిన  కంపెనీ లింక్‌స్యూర్‌ నెట్‌వర్క్‌  తన మొదటి శాటిలైట్‌ను […]

డిజిటల్‌ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా ఫేస్‌బుక్‌

November 25, 2018 Digital For You 0

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ దేశంలో 5మిలియన్లు( 50లక్షలమంది) మందికి డిజిటల్‌ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో  నైపుణ్యాలు మెరుగు  పరుచుకునేలా, బిజినెస్‌ చేసే విధంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రతినిథి శనివారం తెలిపారు. తమ మార్కెట్‌ షేర్‌ ఇండియాలో ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇప్పటికే దాదాపు 10లక్షల మందికి ఈ తరహా శిక్షణ […]

ఫ్లిప్‌కార్ట్ ద్వారా 19 నుంచి 22 వ‌ర‌కు మొబైల్స్ పై అనేక ఆఫ‌ర్స్‌

November 20, 2018 Digital For You 0

నవంబరు 19-22వరకు బొనాంజా సేల్‌ ఆపిల్‌, శాంసంగ్‌, షావోమి, గూగుల్‌, ఫోన్లపై ఆఫర్లు ఫ్లిప్‌​కార్ట్‌ బొనాంజా సేల్‌ : బెస్ట్‌ డీల్స్‌ ఏవి? ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ను మరోసారి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ బొనాంజా సేల్‌ పేరుతో ఈ స్పెషల్‌ సేల్‌ను ప్రకటించింది. నవంబర్ 19 అర్థరాత్రి నుంచి ప్రారంభమై 22వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై ప్రధానంగా […]

మొబైల్స్ ద్వారా డేటా షేరింగ్ సులువుగా ఇలా చేసి చూడండి…!

November 18, 2018 Digital For You 0

• నేటి డిజిటల్‌ యుగంలో, మనం ఒక ఫోన్‌ నుంచి మరొక ఫోన్‌ లేదా డివైస్‌కి డేటాను పంపించాల్సి వస్తుంది. అందుకోసం, మీరు త్వరలో ఎటువంటి వైర్‌ లేకుండా ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్లకు, ఫైళ్లను, ఫొటోలను, వీడియోలను ఇతర డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. 1. ఎయిర్‌ డ్రాయిడ్‌  (AirDroid)  : ఈ అప్లికేషన్‌ ఇంటర్నెట్‌ బేస్‌గా పనిచేస్తుంది. ముందుగా ప్లేస్టోర్‌ నుంచి ఈ అప్లికేషన్‌ని […]

ఆగస్టులో రికార్డు స్థాయి డిజిటల్ లావాదేవీలు

November 12, 2018 Digital For You 0

31 రోజుల్లో రూ.204.86 లక్షల కోట్లు పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ ద్వారా జరిపే లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. గత ఆగస్టులో దేశవ్యాప్తంగా 244.81 కోట్ల డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిపారని కేంద్ర ఐటీ శాఖ మంత్రి వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 2016లో నమోదైన లావాదేవీలతో పోలిస్తే మూడు రెట్లు అధికం. గడిచిన రెండేండ్లకాలంలో దేశీయంగా డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిపేవారి […]

వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికల ప‌ర్య‌వేక్ష‌ణ‌ : ఎన్నికల సంఘం

November 6, 2018 Digital For You 0

హైదరాబాద్‌, న‌వంబ‌రు 6, 2018  :  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ సదుపాయం కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్, జిల్లా కేంద్రాల నుంచి జిల్లా కలెక్టర్లు వచ్చే నెల 7న జరగనున్న పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌ […]

స్మార్ట్‌ఫోన్లుతో ఒత్తిడే త‌ప్ప ఆనందం ఉండ‌దు..!

November 4, 2018 Digital For You 0

‘ఆధునిక ప్రపంచానికి టెక్నాలజీ అద్భుత వరం..కానీ ఆనందానికి మాత్రం హానికరం!’అని అంటున్నారు పరిశోధకులు. దీనికి వారు చేపట్టిన అధ్యయనాన్నే రుజువుగా చూపుతున్నారు. విపరీతంగా స్మార్ట్‌ఫోన్‌ వాడకం మనుషుల్ని పక్కదారి పట్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి రెండు అధ్యయనాలు చేపట్టారు. మొద ట 300 మంది వర్సిటీ విద్యార్థులను ఎంచు కుని రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. స్నేహితులను […]

డేటాను దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియే డేటా లోకలైజేషన్‌

November 3, 2018 Digital For You 0

డేటా లోకలైజేషన్‌.. వినియోగదారుల సమాచారమంతా దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియ.. ఇందుకు పేమెంట్‌ కంపెనీలకు ఆర్‌బీఐ విధించిన గడువు ఇటీవ‌ల‌నే పూర్తయింది. ఈ గడువును డిసెంబర్‌ వరకు పొడిగించాలని బహుళ జాతి సంస్థలు కోరినా కేంద్రం మాత్రం తిరస్కరించింది. దీంతో అంతర్జాతీయ కంపెనీల్లో గుబులు పెరిగిపోయింది. ఇక మీదట దేశ పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా భారత్‌ భూభాగంలోని సర్వర్లలోనే నిల్వ చేయాల్సి […]

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎద‌గ‌నున్న ఇండియా : ముకేశ్‌ అంబానీ

October 27, 2018 Digital For You 0

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్‌ త్వరలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. రిలయన్స్‌ జియో ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ఇందుకు తోడ్పడగలవని తెలిపారు. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో 155వ స్థానంలో ఉన్న భారత్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జియో అగ్రస్థానంలో నిలబెట్టిందని గురువారం ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2018 (ఐఎంసీ) […]

హైదరాబాద్‌లో క్వాల్కామ్‌ ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రం

October 7, 2018 Digital For You 0

ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ క్వాల్కామ్‌ హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో తన ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కోకాపేటలో ఈ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. 400 మిలి యన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌లో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొంది. దశల వారీగా ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌ […]