Computers For You has been changed to Technology For You. Please log into new website : www.technologyforyou.org
అందమైన లోకమా…? మాయదారి ప్రపంచమా..?

నిత్యం మీ పిల్ల‌లు స్మార్ట్ ఫోన్స్‌ను వినియోగిస్తూ అందులోనే లీన‌మ‌వుతున్నారు. స్మార్ట్‌ఫోన్స్ వ‌ల‌న పిల్ల‌ల‌కు
క‌లిగే చెడు ప‌రిమాణాలు ఎలా ఉంటాయ‌నే ప‌లు విష‌యాల‌ను ప్ర‌ముఖ విద్యావేత్త, స్లేట్ స్కూల్ అధినేత
వాసిరెడ్డి అమ‌ర్‌నాథ్ గారు ఈ వ్యాసంలో చ‌క్క‌గా వివ‌రించారు.

వాసిరెడ్డి అమ‌ర్‌నాథ్ – విశిష్ఠ విద్యావేత్త – స్లేట్ స్కూల్స్ – డైరెక్ట‌ర్‌

పిల్లల పై స్మార్ట్ ఫోన్ ఫోన్ ప్రభావం గురించి చర్చ జరుగుతోంది . టీనేజ్ పిల్లలైతే పోర్న్ ఇంకా violent వీడియో లు చూసి సైకో లక్షణాలు అలవరుచుకొంటున్నారని నేను అనేక సార్లు చెప్పాను. మరి చంటి పిల్లల పై స్మార్ట్ ఫోన్ ప్రభావం ఏంటి ?

నేడు భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళుతున్నారు. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఇంటి పని, వంట పని చెయ్యాల్సి ఉంటుంది. డే కేర్ సెంటర్ నుండి తమతో పాటె చంటి బాబు / పాప ను తెచ్చారు . ఊరక ఆలా కూర్చొమ్మంటే పిల్లలు కూర్చోరు . వారితో కూర్చొంటే ఇక ఇంటి పని ఎలా చెయ్యాలి ? సో స్మార్ట్ ఫోన్ చేతికి ఇచ్చేస్తే కాసేపు పిల్లలు బిజీ గా వుంటారు. ఈ లోగా తాము వంటి అవి ముగించుకోవచ్చు . ఇది నేడు చాల కుటుంబాల్లో స్థితి .

ఉద్యోగం లేక పోయినా ఎన్నో పనులు. సాయంకాలం టీవీ సీరియల్స్ చూడాలి .  Whatsaap లో ఫ్రెండ్స్ కు మెసేజ్ లు పెట్టాలి. వాళ్ళు పంపిన వీడియో లు చూడాలి. అబ్బో ఎంత పని ? పిల్లలు ఊరికే డిస్టర్బ్ చేస్తుంటే మహా చిరాకు .

ఈ కాలం పిల్లలు గతం లోగా కాదు. మహా హైపర్ ఆక్టివ్. చందమామ కథలు చేబితే వినే రకం కాదు . అవన్నీ అమ్మమ్మ కాలం outdated మాటలు . వాళ్లదంతా ఇప్పుడు లేటెస్ట్ . స్మార్ట్ జనరేషన్ కదా ? సెల్ ఫోన్ ఇచ్చేస్తే… “అబ్బో నాకే తెలియని ఎన్నో వీడియో గేమ్స్ మా మూడేళ్ళ నాని ఆడేస్తాడు . వాడేంత స్మార్ట్ !” ఇది నేడు సగటు తల్లితండ్రుల ఆలోచన !

బాగానే వుంది. పిల్లలు స్మార్ట్ ఫోన్ పై ఆడక పొతే బంక మట్టి లో ఆడుతారా? ఈయన ఏదో తన మానాన స్కూల్ నడుపుకోక స్మార్ట్ ఫోన్ ల పై పడ్డాడు ఎందుకో అనుకొంటున్నారా ? అయితే చదవండి .

1. అయిదు ఏళ్ళ లోపు పిల్లల్లో బుద్ధి వికాసం ఒక మహా అద్భుత ప్రక్రియ . ఐదేళ్లు అంటే సుమారుగా 1800 రోజులు . ఇంత తక్కువ సమయం లోనే మొత్తం ప్రపంచం వ్యక్తికీ పరిచయం అయిపోతుంది. ప్రపంచం గురించిన ప్రాథమిక అవగాహన ఇంత తక్కువ కాలం లోనే జరిగిపోతుంది .
ఈ దశ లో ఉన్నంత పరిశీలన, గ్రహణ, జ్ఞాపక శక్తి …వ్యక్తికీ జీవితాం లో మరి ఏ ఇతర ఇతర దశ లో ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఈ దశ లోనే వ్యక్తి భాషను నేర్చుకొంటారు. మన ఇండియా లో అయితే రెండు లేదా మూడు భాష లు పిల్లలు నేర్చుకొంటారు .

2 . అంటే ఈ దశ లో జరగాల్సింది ఏంటి అంటే పిల్లలు తమ చుట్టూరా వున్నా ప్రపంచాన్ని చూడాలి . పెద్దలు వారికీ ప్రపంచాన్ని పరిచయం చెయ్యాలి . “అదిగో అది చూడు .. అది పిల్లి .. చెప్పు పిల్లి .. పిల్లి మ్యాప్ అంటుంది . చెప్పు ఏమంటుంది ?” అని మీ అమ్మగారు చెప్పడం గుర్తు చేసుకోండి . మీరేమో నిన్న ఆమె చెప్పిన పాఠాన్ని గుర్తు చేసుకొని భౌ అంటారు.” ఛీ… భౌ కాదు నాన్న . అది కుక్క . కుక్క భౌ అంటుంది . కుక్క అను ” అని ఆమె అన్నప్పుడు మీరు తుక్క అని అనివుంటారు . ” అయ్యో తుక్క కాదురా  తిక్క సన్నాసి .మా బంగారు కొండకు ఇంకా క పలకదు అమ్మా కోడలు పిల్ల కాస్త వస నూరి ఇస్తాను  కాస్త పట్టిద్దాం” అని ఉంటుంది మీ నాన్నమ్మ !

ఇది పిల్లలకు ప్రపంచాన్ని, భాష ను నేర్పే పద్దతి . మీరు తుక్క ను తాకి ని అదే నండీ కుక్క ను కాకి ని మొదలుకొని పెద్దలో ఎలా వ్యవహరించాలో అన్నీ ఇంట్లో నేర్చుకొన్నారు . దీన్నే సామాజీకరణ లేదా సంసకృతీకరణ అంటారు . ఇప్పుడు అది కాస్త ఏట్లో కి పొయ్యింది .

3 . ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు ? పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు . అందులో వాడు / ఆమె వీడియో గేమ్ ఆడుతున్నారు .

అక్కడి మాయదారి ప్రపంచం లో పిల్లి మ్యాప్ అని కాకి కా కా అని అరవవు . అవి ఇంగ్లీష్ లో తెగ వాగుతాయి . చెట్లు ఒక్క చోటున వుండవు . లేచి పరిగెడుతాయి . టేబుల్ కు రెక్కలొస్తాయి . అది అరుస్తుంది . అబ్బా ఏమండీ .. ఇలాంటి వి మా చిన్నపుడు కూడా ఉండేవి కదా ? మేము వాటిని చూసాము కాదా ? మరేంటి ప్రాబ్లెమ్ అనుకొంటున్నారా ? అక్కడికే వస్తున్నా ?

మొత్తం సమయం అంతా వాస్తవిక ప్రపంచాన్ని చూసి కాసేపు టీవీ పై వీడియో చుస్తే అది ఎంటెర్టైనేమేంట్ . నిజమే . కానీ పొద్దునుంచి రాత్రి పడుకొనే దాకా నేటి పిల్లలు చూసేది టీవీ లో ఇంకా స్మార్ట్ ఫోన్ లో ఇలాంటి దిక్కుమాలిన మాయదారి ప్రపంచం . అసలైన ప్రపంచం వారికీ పరిచయం కాక ముందే ఏది ప్రాణం లేని జీవులు , ఏది చెట్లు , ఏది జంతువులు , దేని అరుపులు ఎలా వుంటాయో తెలియక ముందే మాయదారి ప్రపంచం వారిని పూర్తిగా కమ్మేస్తే ? ఇక వారికీ ప్రపంచం ఎలా అర్థం అవుతుంది ?

4 . పిల్లలో ఈ దశ లో eye హ్యాండ్ కోఆర్డినేషన్ , Nuero ముస్క్యూలర్ డెవలప్మెంట్ లాంటి అనేక శారీరక అభివృద్ధి జరుగుతుంది . నేను సివిల్స్ కు కోచింగ్ ఇచ్చేట‌ప్పుడు  ఇలాంటి విషయాల పై నాకు పెద్దగా అవగాహన లేదు . స్కూల్ సార్ట్ చేసాక ఈ విషయాలపై అవగాహనా ఏర్పర్చుకొనే క్రమం లో మన పెద్దలు మనల్ని పెంచిన విధానం మనం చిన్నపుడు ఆడిన ఆటలు ఇవన్నీ చూసి dung అయ్యాను. క్లుప్తంగా చేబుతాను .

మాంటిసోరి పధ్ధతి అంటారు . మనం చిన్నప్పుడు మనకు తెలియకుండానే ఊళ్లలో ఇవన్నీ పాటించాం. గోళీలు బిల్లం గోడు ఆడడం .. అబ్బా … కాన్సంట్రేషన్ .. eye హ్యాండ్ కోఆర్డినేషన్ … నిజంగా ఈ గేమ్స్ కనిపెట్టిన వారికీ నోబెల్ బహుమతి కూడా తక్కువే . బంకమట్టి ఆటలు , ఇసుకలో గుజ్జన గూళ్ళు.. చేతి వేళ్ళ ముస్క్యూలర్ అభివృద్ధికి ఇంతకు మించింది ఇప్పటి దాకా కానీ పెట్టలేదు. ఇవన్నీ మనకు ఫ్రీగా వచ్చాయి.

5 . మరి ఇప్పుడు ? చేతిలో స్మార్ట్ ఫోన్ . రేడియేషన్ వల్ల మెదడు , చేతులు నాశనం .. చిన్న స్క్రీన్ కావడం వల్ల కళ్ళు నాశనం … కేవలం చూపుడు వేలినే ఉపయోగించడం వల్ల మరిన్ని సమస్యలు . దీనికి తోడు మాట్లాడే పిల్లి .. కాకి .. ఇక కాకి కావు కావు మనేది ఎప్పుడు ? ఇది కాకుండా పిల్లల వీడియో గేమ్స్ లో కూడా ఇప్పుడు పగ ప్రతీకారం వచ్చిచేరుతోంది .

మనం ఏమో చందమామ బాల మిత్ర నీతి కథలు చదివాం. ఇప్పుడు పిలలకేమో దిక్కు మాలిన ప్రపంచాన్ని తలా కిందులు గా చూపే వీడియోలు.

ఏమి పాపం చేసారు వారు ? పెట్టేది జంక్ ఫుడ్ . ఆడేది సోఫా లో కూర్చొని వీడియో గేమ్స్ . ఇక వ్యాయామం ఎక్కడ ? అసలు ప్రపంచం పరిచయం అయ్యేది ఎక్కడ ? భాష నేర్చుకునేది ఎక్కడ ?

మరి టైం ఎక్కడ అంటారా ? ప్రపంచం లో ఎవ్వరు బిజీ కాదు . సమయం మన చేతిలో కీలు బొమ్మ . ప్లాన్ చేసుకొంటే మనం ఏమైనా చేయొచ్చు . పోస్ట్ లెంగ్త్ ఎక్కువ అవుతోంది . క్లుప్తంగా చెబుతాను .

మీరు వంట చేస్తున్నప్పుడు పిల్లల్ని కిచెన్ లో కి తీసుకొని వెళ్ళండి . చపాతి చేస్తున్నప్పుడు కాస్త పిండి వారికీ ఇవ్వండి . వారి కోసం ఒక బుల్లి చపాతీ పీట , కర్ర కొనండి . చపాతి రుద్దమనండి . శ్రీలంక షేప్ లో చేసాడు . ఎంత Nuero ముస్క్యూలర్ డెవలప్మెంట్ అయ్యిందో మీకేమి తెలుసు ? ఈ చపాతి మీ శ్రీవారికి / శ్రీమతి కి పెట్టండి . దానికి ఒక పేరు పెట్టండి .

పాత న్యూస్ పేపర్ ఇచ్చి చిన్న చిన్న ముక్కలుగా చించమనండి . కింద్ పడెయ్యమనండీ . వాటిని ఒక్కొక్కటి వేళ్ళ తో ఏరి చెత్త బుట్టలో వేయమనండీ . ఫింగర్ గ్రిప్ అద్భుతంగా వస్తుంది .

ఇంకా చాల వున్నాయండి . పోస్ట్ లెంగ్త్ ఎక్కువ అయితే జనాలు చదవరు . నా ప్రయత్నం వృధా అవుతుంది . లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కటి చెప్పనా ?

వాళ్ళు వున్నారు కదండీ .. అదే నండీ .. మిమ్మల్ని కన్న వారు .. వారెక్కడ? వూళ్ళోనా ? వృద్ధాశ్రమం లోనా ? ఇంటికి పిలిపించండి . వారికి అప్ప చెప్పండి .

ఆబ్బె ముసలాళ్ళు! వాళ్ల కేమి తెలుసు పిల్లని చెడకొడుతారు అంటున్నారా ? మీలాగా పిల్లకు చేతికి మాయదారి స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఆడుకోమనడం వారికీ రాదు. వారి పెంపకం అద్భుతంగా ఉందండి. నమ్మకం లేదా .. ఒక్క సారి అద్దం లో చూసుకోండి . మీ పెంపకం ఎలా తగలడిందో ఒక్క సారి మీ మూడేళ్ళ బాబు / పాపను మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్లి సైకాలజీ అస్సెస్స్ చేయమనండి ప‌లితం చూసాక  తెలుస్తుంది .

News Reporter
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out this magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *