ఆన్‌లైన్ ఎర్నింగ్స్‌కు అనేక మార్గాలు – పార్ట్ 1

ఆన్‌లైన్‌లో జరిగే ప్రతి విషయం గురించి నాలెడ్జి వుంటే మీరే సొంతంగా ఆన్‌లైన్‌లో ఉండే పలు రకాల మార్గాల ద్వారా సులువుగా డబ్బులు సంపాదించుకునే వీలుంది. అంటే ఇక్కడ కూడా కష్టపడితేనే (మానసికంగాను అలాగే ఓపికతోను అనేది గుర్తు పెట్టుకోవాలి) డబ్బులు వస్తాయి. ఊరికే డబ్బులు వస్తాయి … మా సిడిలు కొనండి లేదా ప్రొడక్టులు కొనండి అనే వారిని నమ్మవద్దు. ఆన్‌లైన్‌ ఎర్నింగ్‌ గురించిన ముఖ్యమైన పలు రకాల పద్దతుల గురించి తెలుసుకుందాం. మీలో స్కిల్స్ ఉంటే మీరే సొంతంగా మీకు న‌చ్చిన ప‌ద్ద‌తిలో డ‌బ్బులు సంపాదించుకునే వీలుంది.

ఆన్‌లైన్‌లో మనకు కన్పించే పద్దతులు ప్రదానంగా 10 లేదా 12 మాత్రమే ఉంటాయి. కానీ ఈ పద్దతుల ద్వారానే మనం కనీసం అంటే 200 రకాల టూల్స్‌ను ఎంచుకుని ఎర్నింగ్స్‌ చేసే వీలుంది.
ఫీల్రాన్సింగ్‌ … అర్టికల్ రైటింగ్, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, ప్రొగ్రామింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌, ఇంటర్నెట్ మార్కెటింగ్‌, ట్రాన్స్ లేటింగ్ … ఇలా పలు రకాల పద్దతులలో మనం ఆన్‌లైన్‌లో లబించే వర్క్‌లను తీసుకుని చేయడం ద్వారా డబ్బులు సంపాదించే వీలుంది. దీని కోసం “Elance, peopleper hour, text broker, freelance switch, behance jobs 99 designs, O desk, guru, fiverr, freelancer” … వంటి ప‌లు వెబ్‌సైట్స్ ఉపయోగపడతాయి. స్కిల్స్‌ను బ‌ట్టి ఆన్‌లైన్‌లో ప్రాజెక్ట్‌లు ఇచ్చే వెబ్‌సైట్స్ ఉన్నాయి. పైన చెప్పుకున్న వెబ్‌సైట్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో ప్రాజెక్ట్‌లు ఇస్తుంటాయి. వీటిలో ఇలాన్స్‌, పీపుల్‌ ఫర్‌ అవర్‌ .. వంటి వెబ్‌సైట్స్ బాగా ప్రాచుర్యాన్ని పొందాయి.

అఫ్లియేట్ మార్కెటింగ్ …
ఇంటర్నెట్‌ను ఆధారం చేసుకుని అనేక మంది తమ ఉత్పత్తులను సేల్‌ చేస్తున్నారు. కొన్ని అయితే పూర్తిగా ఆన్‌లైన్‌లోనే (ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు ఉండవు) అన్ని రకాల ఉత్పత్తులను అమ్ముతున్నాయి. ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌, స్నాప్ డీల్‌, ఇబే… వంటి వెబ్‌సైట్స్‌ను ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అవసరమున్న వాటిని కొనుగోలు చేయడానికి ఇండియాలో కూడా ఆసక్తి చూపిస్తున్నారు. క్రెడి్ కార్డు వినియోగం కూడా పెరిగినందున ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అనేక మంది ఇష్టపడుతున్నారు. ఈ విధంగా ఆన్‌లైన్‌ ద్వారా అనేక సంస్థలు తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్ల‌యింట్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ విధంగా అనేక సంస్థలు తమ వెబ్‌సైట్స్‌ను నెలకొల్పాయి. అయితే వీటికి ట్రాఫిక్ రావాలి. అంటే సిటిజన్స్‌ ఈ వెబ్‌సైట్స్‌ను దర్శించాలి. అందులో ఉండే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఈ ప్రాసెస్‌ జరగాలంటే ఆ వెబ్‌సైట్స్ ఉన్నట్టు అందరికీ తెలియాలి కదా. అంటే తప్పకుండా సంస్థ గురించి ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లో తమకు సంబందించిన క్ల‌యింట్స్‌ ఎక్కడ ఉన్నారో వెతకాలి వారికి చేరే విధంగా తమ ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను సిద్దం చేసుకోవాలి. ఈ క్రమంలో గూగుల్‌ ద్వారా యాడ్స్‌ను ఈ సంస్థలు ఇస్తుంటాయి. దీన్నే గూగుల్‌ యాడ్‌సెన్స్‌ అని పిలుస్తారు. ఏదేని వెబ్‌సైట్ గూగుల్‌తో టై అప్‌ కావడం వలన గూగుల్‌ నుంచి యాడ్స్‌ పొందవచ్చు. అ యాడ్స్‌కు గూగుల్‌ సంస్థ పే చేస్తుంది. మన వెబ్‌సైట్స్‌కు వచ్చే ట్రాఫిక్‌ను బట్టే మనకు ఎంత డబ్బులు ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. యాడ్‌సెన్స్‌ ద్వారానే కాకుండా ఆన్‌లైన్‌లో మరోలా కూడా సంస్థను ప్రమోట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అనేక సంస్థలు తమ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలు తమ గురించి ప్రమోట్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లోని ఇతర వెబ్‌సైట్స్‌తో టైఅప్‌ అవుతుంటాయి.

సూక్ష్మంగా చెప్పాలంటే మీ వద్ద ఒక వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్‌ను నిత్యం అనేక మంది నెటిజన్స్‌ క్లిక్‌ చేస్తున్నారు. మీరు ఆ వెబ్‌సైట్‌లో వేరొక వెబ్‌సైట్ యాడ్‌ను ఉంచి ప్ర‌మోట్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌ అని పిలుస్తారు. మార్కెటింగ్ చేసే వారిని అఫ్లియేట్స్ అని పిలుస్తారు. వెబ్‌సైట్‌ను ప్ర‌మోట్ చేసుకోవడం అఫ్లియేట్ కోడ్‌ లేదా యాడ్‌ని ఇచ్చే వారిని అడ్వర్టయిజర్స్‌ అని పిలుస్తారు. వెబ్‌సైట్‌లోని అఫ్లియేట్‌ యాడ్‌ద్వారా లీడ్‌ కానీ సేల్‌ కానీ అడ్వర్టయిజర్‌కి వెళ్లితే కమీషన్‌ రూపంలో డబ్బులు వస్తాయి.

అఫ్లియేట్   మార్కెట్‌కు సంబందించి Commission junction, click bank, amazon associates, ebay , promote things you love , apple affiliate program , bluehost … వంటి పలు రకాల వెబ్‌సైట్స్ అఫ్లియేట్ మార్కిెంగ్‌ను సపోర్ట్‌ చేస్తున్నాయి.

ఆన్‌లైన్‌ సెల్లింగ్‌ మేడ్‌ ఈజీ …

అఫ్లియేట్ మార్కిెంగ్‌లో మన ద్వారా లీడ్‌ వెళ్లితే మనకు అదాయం వస్తుంది. అలాగే ఆన్‌లైన్‌లో మన వద్ద వుండే ఉత్పత్తులను అమ్మి కూడా డబ్బులు సంపాదించే వీలుంది. దీని కోసం ఆన్‌లైన్‌లో పలు మార్గాలు ఉన్నాయి. మీరు వేసిన పెయింటింగ్‌, తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ లేదా మొబైల్‌ యాప్‌, చేతితో తయారు చేసిన అందమైన వస్తువులు… ఇలా వేటినైనా అమ్మే వీలుంది. దీని కోసం ఆన్‌లైన్‌లో ebay, Etsy, amazone india, criagslist, cafe press, spread shirt … వంటి ప‌లు వెబ్‌సైట్స్ సపోర్ట్‌ చేస్తున్నాయి.

కంటెంట్ రెవిన్యూ షేరింగ్‌ …
మీ వద్ద ఉన్న కంటెంట్‌ను సరిగ్గా మార్కెట్ చేసుకోలేని పక్షంలో ఆన్‌లైన్‌లో పలు వెబ్‌సైట్స్ ఈ పని చేసి పెడుతున్నాయి. ప్రతిఫలంగా మనం డబ్బులను పొందగలం. మనకంటూ ఒక బ్లాగ్‌, వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా కూడా అందులో కంటెంట్ వుంచుతూ డబ్బులు ఎర్నింగ్‌ చేయగలం. అయితే మన వెబ్‌సైట్‌కు వచ్చే ట్రాఫిక్ చాలా తక్కువగా వుంటుంది. అదే ట్రాఫిక్‌ బాగా వచ్చే కంటెంట్ వెబ్‌సైట్స్‌లో మన కంటెంట్‌ను ఉంచి అదాయాన్ని షేరింగ్‌ చేసుకునే వీలుంది. Squidoo, hubpages, digital journal, youtube partner program, best reviewer, yahoo contribution network, infor barrel … వంటి ప‌లు వెబ్‌సైట్స్ ఉపయోగపడతాయి. మనం ఉంచే కంటెంట్ ద్వారా మంచి పబ్లిసిీటి లబించడంతో పాటుగా, డబ్బులు కూడా పొందే వీలుంది.

వీడియో మార్కెటింగ్‌…
ఆన్‌లైన్‌లో వీడియోలకు ఉన్న డిమాండ్‌ ఇతర కంటెంట్‌కు ఉండదు. ఈ విధంగా 2004లో వచ్చిన యుట్యూబ్‌ ఎంతగా ప్రాచుర్యాన్ని పొందిందో మనందరికి తెలిసిన విషయమే. యుట్యూబ్‌తో పాటుగా నేడు ఆన్‌లైన్‌లో పలు వీడియో వెబ్‌సైట్స్ బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. మీరు నెటిజన్స్‌ మెచ్చే వీడియోలను తయారు చేస్తుంటే వాటి ద్వారా ఆదాయం పొందగలరు. ఇటీవల కాలంలో అనేక మంది ఈ విధంగా వీడియోలను పోస్ట్‌ చేసి డబ్బులు, పేరు రెండు పొందినవారే. కాలేజీ విద్యార్థులు షార్ట్‌ఫిల్మ్‌లను తయారు చేసి పోస్ట్‌ చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. వీడియో మార్కెటింగ్ సపోర్ట్‌ చేయడంలో outube, aol, metacafe, camtasia studio, vimeo, instructables, screen cast … వంటి వెబ్‌సైట్స్ బాగా ప్రాచుర్యాన్ని పొందాయి.

వెబ్‌సైట్స్ ఫ్లిప్పింగ్‌ …
రియల్ ఎస్టేట్ సంస్థ‌లు ఎలా స్థలాలు కొని అమ్ముతాయో.. అలాగే ఆన్‌లైన్‌లో కూడా వెబ్‌సైట్స్ కొనడం , అమ్మడం వంటివి చేయవచ్చు. మీరే సొంతంగా ఒక వెబ్‌సైట్‌ను తయారు చేసారు. అందులో మంచిగా కంటెంట్‌ను పోస్ట్‌ చేస్తున్నారు. ఈ కంటెంట్ ద్వారా వెబ్‌సైట్‌కు మంచి గుర్తింపు వచ్చి ఉంటుంది. అలాగే మనం తయారు చేసే ఎటువంటి వెబ్‌సైట్‌నైనా ఒక గుర్తింపు వచ్చిన తర్వాత మనం ఎక్కువ ధరకు అమ్మాలంటే అమ్మవచ్చు. కొన్ని రకాల స్స్‌ైను మార్క్‌ె వేల్యూ కంటే తక్కువగా కొని తర్వాత ఎక్కువ దరకు కూడా అమ్మవచ్చు. ఇలా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ఫ్లిప్పింగ్‌ ద్వారా కూడా డబ్బులను సంపాదించే వీలుంది. దీని కోసం Flippa, digital point, sedo, website broker … వంటి ప‌లు వెబ్‌సైట్స్ ఉపయోగపడతాయి.

నోట్ : ఆన్‌లైన్‌లో ఇది వ‌ర‌కు చెప్ప‌కున్న‌ట్టు మీ తెలివితేట‌లే పెట్టుబ‌డి. ఎక్క‌డే కానీ డబ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌వేళ మీకు ప్ర‌త్యేకంగా వెబ్‌సైట్ అవ‌స‌ర‌మైతే దాని త‌యారీకి మీకు ఖ‌ర్చు అవుతుంది. అంటే వెబ్‌సైట్ డొమైన్  Registration, hosting, design … వంటి ఖ‌ర్చులు ఉంటాయి.
ఎవ‌ర‌కే కానీ డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. మీకు ఆన్‌లైన్ ఎర్నింగ్‌కు గురించిన ప్ర‌తి ప‌ద్ద‌తి గురించి తెలిసి ఉండాలి.

రెండ‌వ బాగంలో మిగ‌తా ఆన్‌లైన్ ఎర్నింగ్ మార్గాల గురించి తెలుసుకుందాం.

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*