ఆన్‌లైన్ ఎర్నింగ్స్‌కు అనేక మార్గాలు – పార్ట్ 2

బ్లాగింగ్‌ …
బ్లాగింగ్‌ అనే పదం ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అనేక మంది బ్లాగ్స్‌ క్రియ్‌ట్ చేస్తుంటారు. కానీ అందులో కంటెంట్ సరిగ్గా ఉండదు. ఎదో ఒక పోస్ట్‌ చేయాలని నిరంత‌రం పోస్ట్ చేస్తుంటారు. మ‌నం పోస్ట్ చేసే వ్యాసాలు మ‌న బ్లాగ్ రీడ‌ర్స్‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఉండాలి. బ్లాగ్‌ అంటే ఏదేని ఒక అంశంపై నెటిజన్స్‌ మెచ్చుకునేలా, సంతృప్తి చెందేలా కంటెంట్‌ను పోస్ట్‌ చేయాలి. ఉదాహరణకు అమిత్‌ అగర్వాల్‌ నిర్వహించే టెక్నాలజీ బ్లాగ్‌లో నిత్యం అనేక టెక్నాలజీ అంశాలను పోస్ట్‌ చేస్తుంటాడు .. దీని వలన అ బ్లాగ్ టాప్ 5 బ్లాగ్స్‌లో ఒకటిగా నిలిచింది. తద్వారా అదాయం కూడా లక్షలలోనే ఉంది. బ్లాగ్స్‌ అంటే సింపుల్‌గా బ్లాగర్‌ లేదా వర్డ్‌ప్రెస్‌లో క్రియేట్ చేయడం కాదు.. ఒక అంశం గురించి వెబ్‌సైట్ తయారు చేసుకుని అదే అంశంపై పూర్తి స్థాయిలో డెవలప్‌ చేయడమే. ప్రపంచవ్యాప్తంగా అనేక బ్లాగ్స్‌ గుర్తింపు పొంది తయారీదారులకు మంచి అదాయాన్ని ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seth Godin , Perez Hilton” అనే ఇద్దరు బ్లాగర్స్‌ను అదర్శంగా తీసుకుని మీ వంతు కృషి చేయండి. కానీ కంటెంటే కింగ్‌ అనే విషయం మర్చిపోరాదు. మంచి పరిజ్ఞానాన్ని అందిస్తే తప్పకుండా గుర్తింపును పొందగలరన్న విషయం మరిచిపోరాదు.

క్వశ్చన్‌ & ఆన్సర్స్‌ …
సెర్చిఇంజన్స్‌ ద్వారానే పూర్తి సమాచారాన్ని పొందలేం. అందుకే ప్రత్యేక “Q & A” ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. అయితే వెబ్‌సైట్స్‌లో ఎవరేని తమకు తెలియని విషయాలను ప్రశ్నల రూపంలో పోస్ట్‌ చేస్తూ, వాటికి అన్సర్స్‌ను పొందవచ్చు. మీరు ఏదేని రంగంలో బాగా ప్రావీణ్యాన్ని పొంది వుంటే ఈ వెబ్‌సైట్స్ ద్వారా మీ నాలెడ్జిని షేర్‌ చేసుకోవచ్చు… తద్వారా అదాయాన్ని పొందవచ్చు. “Liveperson, web answers.com, just answer, ether … వంటి వెబ్‌సైట్స్ ఈ  “Q & A” సర్వీస్‌లను అందిస్తున్నాయి.

పెయిడ్‌ సర్వేస్‌ …
ఆన్‌లైన్‌లో సులువుగా డబ్బులు సంపాదించుకోవడంలో ఉపయోగపడే పద్దతులలో ఇది ఒక‌టి. ఆన్‌లైన్‌లో నేడు అనేక సంస్థలు తమ గురించి తమ ఉత్పత్తుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో సర్వేలు నిర్వహించడానికి ఆన్‌లైన్‌నే ఎంచుకుంటున్నాయి. అనేక వెబ్‌సైట్స్ పెయిడ్‌ సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్స్‌కు మనం కావాల్సిన సర్వీస్‌లను అందించి డబ్బులు పొందవచ్చు. “Mysurvey, i-say, Global test market, tell wut, my view.. వంటి … ప‌లు వెబ్‌సైట్స్ పెయిడ్‌ సర్వీస్‌ల ద్వారా డబ్బులు పొందాలనుకునే వారికి ఉపయోగపడతాయి.

గూగుల్‌ యాడ్‌ వర్డ్స్‌ …
గూగుల్‌, యాహూ, బింగ్‌ .. వంటి ప‌లు సెర్చ్‌ ఇంజన్స్‌ ద్వారా ఏదేని వెబ్‌సైట్ కోసం, డేటా కోసం సెర్చింగ్‌ చేస్తూ ఉంటాం. కీవర్డ్స్‌ అదారంగా ఈ సెర్చింగ్‌ను చేస్తూ ఉంటాం. మనం ఉపయోగించే కీవర్డ్‌ను బ‌ట్టి పలితాలు ఉంటాయి. సెర్చింగ్‌ చేసినప్పుడు టాప్‌లో లేదా మొద‌టి పేజీలో డిస్‌ప్లే అయితే వెబ్‌సైట్‌కు ట్రాఫిక్‌ పెరుగుతుంది. అలాగే సెర్చ్‌ పలితాల్లో కొన్ని కనిపిస్తే మరికొన్ని సెర్చింగ్‌ పేజీలకు పక్కగా కన్పిస్తూ ఉంటాయి. ఒక వెబ్‌సైట్ ట్రాఫిక్ కోసం మనం ఆన్‌లైన్‌లో యాడ్ ఇస్తుంటాం. ఈ విధంగా యాడ్‌ ఇచ్చినప్పుడు ఈ యాడ్స్‌ కూడా మొద‌టి పేజీలో డిస్‌ప్లే అయితే అయా వెబ్‌సైట్స్‌కు కూడా ట్రాఫిక్‌ వస్తుంది. మనం గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌ ద్వారా కానీ బింగ్‌ ద్వారా కానీ ఫేస్‌బుక్‌లో కానీ , అమోజాన్‌ ప్రొడక్ట్‌ యాడ్స్‌లో కానీ .. ఇలా ఎక్కడైనా మనం యాడ్‌ ఇస్తున్నప్పుడు ఈ యాడ్‌ మొదటి ప్రాదాన్యత వుండాలంటే దీనికి కూడా మనం టెక్నికల్‌గా వర్క్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబందించి కూడా ఆన్‌లైన్‌లో మనకు వర్క్‌ లబించే అవకాశం ఉంది. “google adwords, facebook ads, bing, 7search.com, amazon product ads, info links … వంటి వాటికి పిపిసి మార్కెటింగ్ చేసే వీలుంది.

గూగుల్‌ యాడ్‌ సెన్స్‌ …
ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్స్‌, బ్లాగ్స్‌కు మంచి ట్రాఫిక్‌ వస్తుంటే ఇందులో యాడ్స్‌ పెట్టడానికి అవకాశం ఉంది. మన వెబ్‌సైట్స్‌కు వచ్చే ట్రాఫిక్‌ను బ‌ట్టి గూగుల్‌ యాడ్స్‌ను ఇస్తుంది. దీన్నే యాడ్‌సెన్స్ అంటారు. యాడ్‌సెన్స్‌ ద్వారా మన వెబ్‌సైట్‌ను గూగుల్‌కి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. దీని వలన గూగుల్‌ నుంచి వచ్చే యాడ్స్‌ను వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతుంది. వెబ్‌సైట్‌కి వచ్చే ట్రాఫిక్‌ను బ‌ట్టి అదాయం వస్తుంది.

ఇ మెయిల్ మార్కెటింగ్‌ …
ఇటీవల కాలంలో మొబైల్‌ ద్వారా, సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నప్ప‌టికీ ఇ మెయిల్‌ ద్వారా మార్కెటింగ్ కూడా ఉత్తమమైన పద్దతి. పాత పద్దతి అయినప్పిటికీ ఇప్పిటికే అనేక మంది తమ సంస్థ ఉత్పత్తులను ఈ పద్దతిలో మార్కెటింగ్ చేస్తున్నారు. పలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్స్ అనేక మందితో నెట్‌వర్కింగ్‌ అయి ఉంటుంది. వీటి ద్వారా ఒక సంస్థకు చెందిన సర్వీసుల గురించి మార్కెటింగ్ చేసే వీలుంది. ఈ పద్దతిలో కూడా మనం ఆన్‌లైన్‌లో ఉండే ఈ సంస్థలకు పనిచేసి డబ్బులు సంపాదించే వీలుంది.  Mail chimp, Aweber, vertical response, constant contact, get response …వంటి  పలు టూల్స్‌ ఇందుకు ఉపయోగపడతాయి. ప్ర‌స్తుతం ఉన్న ఇమెయిల్ టూల్స్ ద్వారా మ‌నం ఇమెయిల్ పంపిన త‌ర్వాత అవ‌త‌లి వ్య‌క్తి మ‌న ఇమెయిల్‌ను ఓపెన్ చేసారో లేదో కూడా తెలిసిపోతుంది.

క్రియేట్ మెంబర్‌షిప్ సైట్ …
ఆన్‌లైన్‌లో నిత్యం అనేక వెబ్‌సైట్స్ వస్తుంటాయి … కొన్ని వెబ్‌సైట్స్‌కు మంచి ట్రాఫిక్‌ వస్తుంది. మీరు తయారు చేసిన వెబ్‌సైట్ కానీ, బ్లాగ్‌కి కానీ మంచి ట్రాఫిక్ వస్తుంటే వెంటనే అ సైట్‌ని మెంబర్‌షిప్ సైట్‌గా మార్చుకునే వీలుంది. ఇలా చేయడం ద్వారా మీ సైట్‌ని విజిట్ చేసేవారు నుంచి నామ మాత్రపు డబ్బులు తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ బ్లాగ్‌ని మెంబర్‌షిప్ సైట్‌గా మార్చాలంటే “Wishlist” అనే చిన్న వర్డ్‌ప్రెస్‌ ప్లగిఇన్‌ ద్వారా సైట్‌ లేదా బ్లాగ్‌ మెంబర్‌షిప్‌ ఫంక్షన్‌ యాడ్‌ అవుతుంది.

వెబ్‌సైట్స్ ద్వారా పేమెంట్స్ రావాలంటే ప్రత్యేకంగా పేపాల్ అక్కౌంట్ తీసుకోవాలి. పే పాల్‌ అంటే ఆన్‌లైన్‌లో మనకు ఒక బ్యాంక్ అక్కౌంట్‌ ఉందని అర్థం. ఆన్‌లైన్‌లో పేపాల్ అక్కౌంట్ తీసుకున్న తర్వాత క్రెడిట్ కార్డు ద్వారా కానీ బ్యాంక్‌ ద్వారా కానీ పే పాల్‌ బ్యాలెన్స్‌ ద్వారా కానీ డబ్బులను పొందవచ్చు. ఇప్ప‌టికే ఉన్న వెబ్‌సైట్స్‌ను ఇలా తయారు చేయడం కోసం ఆన్‌లైన్‌లో పలు టూల్స్ ఉంటాయి. సిఎంఎస్‌ టూల్స్‌ను ఉపయోగిస్తుంటే … మెంబర్‌షిప్ సైట్‌గా కన్వర్ట్‌ చేయాలంటే కొన్ని రకాల ప్లగ్‌ఇన్స్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. మెంబర్‌షిప్ డేటాబేస్‌ నిర్వహించడానికి డేటాబేస్‌ సపోర్ట్‌ ఉండాలి.

సెర్చి ఇంజన్‌ అప్టిమైజేషన్‌ …
ఆన్‌లైన్‌ గురించి బాగా అవగాహన ఉండి అలాగే “Search engine optimization (SEO)” నేర్చుకున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. వెబ్‌సైట్స్‌, బ్లాగ్స్‌ను ప్రమోట్ చేయడం, సోషల్‌ మీడియాలో మనం ప్రొఫైల్ లేదా కంపెనీ పేజీని బాగా బూస్టింగ్‌ చేయడం వంటి పలు పనులను చేస్తూ కూడా మంచి అదాయం పొందవచ్చు. నేడు ఎస్‌ఈఓ సర్వీస్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఆన్‌లైన్‌లో బ్లాగ్స్‌, వెబ్‌సైట్స్ పెరిగే కొద్ది, ఆన్‌లైన్‌ వాడకం పెరిగే కొద్దీ ఈ సర్వీస్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. కానీ ఎస్‌ఈఓ గురించి మంచి పట్టు ఉండాలి.

పేమెంట్ విషయాలు ఏలా ఉంటాయి…
ఇక్కడ ఇచ్చిన వెబ్‌సైట్స్‌లో ఎక్కడే కానీ మీరు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. మీ స్కిల్సే మీ పెట్టుబడి. మీరు చేసిన వర్క్‌లను పేమెంట్స్ తీసుకోవాలంటే మీకు తప్పనిసరిగా బ్యాంక్ అక్కౌంట్‌తో పాటుగా ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో ఉండే పేపాల్‌ అనే అక్కౌంట్‌ను తీసుకోవాలి. మనం ఎలా నిజజీవితంలో బ్యాంక్ అక్కౌంట్ తీసుకుంటామో… అలాగే ఆన్‌లైన్‌లో కూడా మనకు పేమెంట్స్ రావడానికి పేపాల్‌లో (“paypal.com”) అక్కౌంట్‌ క్రియేట్ చేసుకోవాలి. క్లయంట్స్ నుంచి వచ్చే డబ్బులు ముందుగా పేపాల్‌కు చేరి అక్కడి నుంచి మన బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి. పేపాల్‌ కమీషన్‌ కింద కొంత క‌ట్‌ చేసుకుని ఈ డబ్బులను పంపుతుంది. ఇందులో ఎటువంటి మోసం ఉండదు.

నోట్ : ఆన్‌లైన్‌లో సంపాదనకు పలు మార్గాలు ఉన్నాయి. అయితే ఎవరో ఎదో చేస్తారని మోసపోయి డబ్బులు కట్టవద్దు. మీ వద్ద తగినన్ని స్కిల్స్‌ ఉంటే ఆన్‌లైన్‌ ద్వారా ఇంటిలో కూర్చొని ఎటువంటి ఖర్చు లేకుండానే సంపాదించే వీలుంది. మీకు ఉండవల్సిందల్లా… బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్ క‌నెక్చ‌న్‌, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్ పై తగినంత పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సొంతంగా వెబ్‌సైట్ (ఇది అన్ని ప‌ద్ద‌తుల‌కు అవ‌సరం ఉండ‌దు) … వంటివి తప్పకుండా ఉండాలి. అంతే కానీ ఈజీగా డబ్బులు సంపాదించవచ్చుని భ్రమపడి డబ్బులు వృధాగా ఇతరులకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్‌లో అవుట్ సోర్సింగ్‌ కింద ప్రాజెక్ట్‌లు ఇచ్చే పలు వెబ్‌సైట్స్ ఉన్నాయి. వీటి ద్వారా మనం ప్రాజెక్ట్‌లు తీసుకుని పూర్తి చేసి ఇవ్వడం ద్వారా (ఫ్రీలాన్సింగ్‌ పనులు) డబ్బులు సంపాదించవచ్చు. ఇక్కడ మనకు తప్పనిసరిగా పలు స్కిల్స్‌ ఉండాలి. అవుట్ సోర్సింగ్‌తో పాటుగా, మీ వెబ్‌సైట్‌, బ్లాగ్‌ పాపులర్‌ అయి వుంటే…అందులో యాడ్‌సెన్స్‌, అఫ్లియేట్ మార్గాల ద్వారా యాడ్స్‌ తెచ్చుకుంటూ సంపాదించవచ్చు. ప్రైవేట్ యాడ్స్‌ను కూడా తెచ్చుకుని మీ వెబ్‌సైట్‌లో ఉంచుకోవచ్చు. దీనితో పాటుగా ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌, ఇబే, అమెజాన్‌…వంటి వెబ్‌సైట్స్‌లో స్టోర్స్ పెట్టి సంపాదించడం, కంటెంట్‌, లోగో డిజైన్స్‌ చేసి సంపాదించడం, యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఎర్నింగ్‌ చేయడం…ఇలా పలు మార్గాలు ఉన్నాయి.

గమనించాల్సిన ముఖ్య విషయం మీ స్కిలే మీ పెట్టుబడి.. నాలెడ్జి ఉందా… డబ్బులు సంపాదించవచ్చు. నాలెడ్జి లేకపోతే ముందుగా వెబ్‌పై పూర్తిగా పట్టు సాధించు. డబ్బులు సంపాదించడానికి షార్ట్‌కట్ అంటూ ఏమీ లేదు. మన తెలివి తేటలతో ఆన్‌లైన్ ద్వారా మ‌న స్కిల్స్‌నే మార్కెట్ చేసుకుంటూ సంపాదించుకోవడమే.

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*