ఉచితంగా ఇ బుక్స్‌ను అందించే అనేక వెబ్‌సైట్స్‌

ఇంటర్నెట్‌లో అనేక పిడిఎఫ్‌ ఫైల్స్‌తో పాటుగా ఇ బుక్స్‌ రూపంలో కూడా అనేక బుక్స్‌ లబిస్తున్నాయి. ఇ బుక్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని నేరుగా ట్యాబ్లెట్ పీసీలో కానీ కిండెల్‌ రీడర్‌లో (ప్రత్యేకంగా కిండెలీ డివైజ్‌లు ఉంటాయి) కానీ చదవగలం. ఇ బుక్స్‌ నేరుగా పిడిఎఫ్ ఫార్మాట్‌లో కూడా ఉండవచ్చు. ఇ బుక్స్‌ సపోర్ట్‌ చేసే ఫార్మాట్స్ వచ్చేసి “epub, kindle, pdf ఫార్మాట్స్‌. ఇ బుక్స్‌ కొనుగోలు చేయాలంటే amazon.com లోకి వెళ్లితే అనేక రకాల బుక్స్‌ లబిస్తాయి. ఉచితంగా కావాలంటే ఇక్కడ చెప్పుకునే ఈ వెబ్‌సైట్స్‌ను ట్రై చేయండి. ఈ వెబ్‌సైట్స్‌ లింక్స్‌ను పక్కనే ఉన్న బాక్స్‌లో లిస్ట్‌ చేశాం గమనించండి.

డిజిటల్‌ బుక్స్‌ లేదా ఇ బుక్స్‌ నేడు ఆన్‌లైన్‌లో ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఇ బుక్‌ హ్యాండ్‌ రీడర్స్‌ వచ్చిన తర్వాత వీటికి మరింత డిమాండ్‌ పెరిగింది. “Amazon Kindle, Apple iPad, Sony PRS eBook reader”… వంటి డివైజ్‌ల ద్వారా మనం ఇ బుక్స్‌ను రీడ్‌ చేస్తాం.
ఇబుక్స్‌ కొన్ని పిడిఎఫ్ ఫార్మాట్‌లో కూడా ఉంటాయి. వీటిని నేరుగా కంప్యూటర్‌లో రీడ్‌ చేయగలం.

Mega Pdf
దాదాపుగా 379 మిలియన్‌కు పైగా ఇబుక్స్‌ను ఇండెక్స్‌ చేసి చూపిస్తుంది. ఇక్కడ లబించే ఇ బుక్స్‌ను మనం పిడిఎఫ్‌ ఫార్మ్‌ాలో డౌన్‌లోడ్‌ చేసుకుని చదవచ్చు. నావల్స్‌, బయోగ్రఫీలు, టెక్నాలజీ బుక్స్‌…ఇలా అనేక రకాల ఇ బుక్స్‌ ఈ వెబ్‌స్‌ై ద్వారా ఉచితంగా లబిస్తాయి.

Pdf geni…
దీని ద్వారా మనం సులువుగా బుక్స్‌, నావల్స్‌, మాన్యువల్స్‌, అర్టికల్స్‌, డాక్యుమెంట్ టెంప్‌లేట్స్, రిపోర్ట్స్‌, డేటా షీట్స్ … తదితర పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్స్‌ అన్నింటిని డౌన్‌లోడ్‌ చేసుకోగలం.

Free e books…
అనేక ఇ బుక్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమే కాకుండా, ఇ బుక్‌ రీసోర్సెస్‌ను కూడా అందిస్తుంది. ఇ బుక్స్‌తో పాటుగా ఉచితంగా మ్యాగజైన్స్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఇందులో డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఉచితంగా రిజిష్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Many books
ఇబుక్స్‌ను పిడిఎ, ఐపాడ్‌, ఇబుక్‌ రీడర్‌…వంటి డివైజ్‌లలో చదువుకునేందుకు వీలుండేలా ఇ బుక్స్‌ను ఈ వెబ్‌సైట్ అందిస్తుంది. ఇందులో అనేక టైటిల్స్‌ లిస్ట్‌చేయబడి ఉంటాయి. ప్రస్తుతం ఇందులో దాదాపుగా 2 లక్షల 70 వేల వరకు ఉంటాయి. వీటిలో మీకు ఇష్టమున్న వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని రీడ్‌ చేయవచ్చు. టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో ఇ బుక్స్‌ ఉదాహరణను చూసి చెప్పవచ్చు.

Search PDF eBooks
ఇ బుక్స్‌ను సెర్చింగ్‌ చేసి అందించే మరో చక్క‌టి టూల్‌. ఇందులో మిలియన్ల కొద్దీ బుక్స్‌ను ఇండెక్స్‌ చేసుకుని ఉంచుతుంది. దీనితో మీరు సెర్చింగ్‌ చేసిన వెంటనే మీకు కావాల్సిన బుక్స్‌ను లిస్ట్‌ చేస్తుంది.

Google Books
గూగుల్‌ డిఫాల్ట్‌గా సెర్చి ఇంజనే. గూగుల్‌ కూడా బుక్స్‌ కోసం ప్రత్యకంగా ఒక సెర్చిఇంజన్‌ను తయారు చేసింది. వారికి అందుబాటులోకి వచ్చే బుక్స్‌ను డిజిటైజ్‌ చేసి గ్లోబల్‌గా అందరికి అందుబాటులో ఉంచుతుంది. ఇందులో కాపీరైటెడ్‌ కానీ వాటిని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం కోసం (పిడిఎఫ్ ఫార్మాట్‌లో) ఉంచుతుంది.

ReadPrint
అనేక ఇ బుక్స్‌ను కలిగిన ఆన్‌లైన్‌ లైబ్రరీగా దీన్ని పిలవచ్చు. ఇప్ప‌టి వరకు విద్యార్థులు,టీచ‌ర్స్‌…తదితరులు అనేక మంది ఈ ఇ లైబ్రరీని ఉపయోగించుకుంటున్నారు. వేల కొద్దీ నావెల్స్‌, పద్యాలు లిస్ట్‌ చేయబడి ఉన్నాయి.

Know Free
నాలెడ్జిని ఎటువంటి ఖర్చులేకుండా షేర్‌ చేసుకోవాలనుకునే వారి కోసం ఈ వెబ్‌సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇ బుక్స్‌, వీడియో ట్రైనింగ్ మెటీరీయల్స్‌ను ఇచ్చి పుచ్చుకునేలా అవకాశం కల్పిస్తుంది. టెక్నాలజీ, వెబ్‌ డెవల‌ప్‌మెంట్‌, ఇంజనీరింగ్‌, బిజినెస్‌ స్కిల్స్‌…తదితర వాటికి సంబందించిన అనేక ఇ బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీడియో ట్యుోరియల్స్‌ కూడా ఇందులో లబిస్తాయి.

Project Gutenberg
ప్రాజెక్ట్‌ గుటెన్‌బర్గ్‌ కింద 30 వేలకు పైగానే ఇ బుక్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. ఇక్కడి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న వాటిని పీసీతోపాటుగా, కిండెల్‌, ఐపోన్‌, సోనీ రీడర్‌… వంటి వాటిలో రీడ్‌ చేసుకునే వీలుంది. ప్రముఖ ఫిక్షన్‌ రచయితల పుస్తకాలు ఇందులో ఉంటాయి. గుటెన్‌బర్గ్ ప్రింటింగ్ రంగానికి పితామహుడు కావున, ఇతని పేరుతో దీన్ని స్థాపించారు.
నోట్ ఇక్కడ చెప్పుకున్నవి కొన్ని ముఖ్యమైన వెబ్‌సైట్స్ మాత్రమే. ఇంకా ఆన్‌లైన్‌లో పలు వెబ్‌సైట్స్ ఉండవచ్చు.

  • ఇంటర్నెట్ ద్వారా ఇ బుక్స్‌ను అందించే పలు వెబ్‌సైట్స్ గురించి తెలుసుకున్నాం. అ వెబ్‌సైట్స్ లింక్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం… ట్రై చేసి చూడండి. వీటిని మన పర్సనల్‌ అవసరం కోసం డౌన్‌లోడ్‌ చేసుకోవాలే తప్ప డిస్ట్రిబ్యూషన్‌ చేయకూడదు.
    books.google.com            mega-pdf.com
    www.pdfgeni.com           gutenberg.org
    free-ebooks.net               knowfree.net
    manybooks.net                search-pdf-books.com
    www.readprint.com
About Digital For You 713 Articles
Technology For You (Formerly Computers For You) is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Technology For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*