
నేడు ఆన్లైన్లో అనేక ఉచిత సాఫ్ట్వేర్ లేదా టూల్స్ లబిస్తున్నాయి. పెయిడ్ సాఫ్ట్‌వేర్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సాఫ్ట్వేర్స్ పనిచేస్తాయి. ఓపెన్ సోర్స్ లేదా ఉచిత సాఫ్ట్వేర్స్ ప్రాముఖ్యత గురించి మనం వెబ్సైట్లో రెగ్యులర్‌గా చెప్పకుందాం. ఇక్కడ కొన్ని టూల్స్ గురించి తెలుసుకుందాం. మన దేశంలో అత్యధిక శాతం మంది సాఫ్ట్‌వేర్స్‌ను కొనుగోలు చేయకుండా పైరేటెడ్ సాఫ్ట్‌వేర్స్‌ని ఉపయోగిస్తున్నారు. కానీ ఉచితంగా లబించే సాఫ్ట్‌వేర్స్‌ను ఉపయోగించడానికి ఇష్టపడరు. ఆన్లైన్లో ఉచితంగా లబించే వీటిని ఉపయోగిద్దామనే అలోచనే చేయరు. పెయిడ్ సాఫ్ట్‌వేర్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉచిత సాఫ్ట్వేర్స్ లబిస్తున్నాయి. వీటికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ గురించి రెగ్యులర్‌గా తెలుసకుందాం.
పెయిడ్ సాఫ్ట్వేర్స్ అంటేనే ఇష్టం…!
ఇంటర్నెట్ను సరిగ్గా ఉపయోగించుకుంటే దాని ద్వారా ఎంతగానో లబ్ది పొందగలం.అవసరాన్ని బట్టి అనేక సాఫ్ట్‌వేర్స్‌ని ఉపయోగిస్తూ ఉంటాం. ఆపరిేంగ్ సిస్టమ్స్ నుంచి ఆఫీస్ సూట్స్, డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ వరకు అన్నింటిని పైరేట్ చేసే ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇవ్వన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్. పైగా ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. దాదాపుగా ప్రతి అవసరాన్ని తీర్చడం కోసం నేడు ఉచితంగా అనేక సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి. ఉపయోగపడే బెస్ట్ ఫ్రీ టూల్స్ ఉన్నాయని తెలియకపోవడం ఒక కారణమైతే తెలిసినా ఉపయోగించకపోవడం మరో కారణం. ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి బిజినెస్ అవసరాలకు ఉపయోగపడే సాఫ్ట్వేర్స్ వరకు అనేక ఉచిత టూల్స్ అందుబాటులో ఉన్నాయి. కావున పెయిడ్ వాటిని పైరేట్ చేసి ఉపయోగించడం కంటే కాస్త ఉచితంగా లబించే వాటిని కూడా ఉపయోగించి చూడండి.
పెయిడ్ సాఫ్ట్వేర్స్ వర్సెస్ ఫ్రీ సాఫ్ట్వేర్స్
ఆన్లైన్ ద్వారా ప్రతి పెయిడ్ సాఫ్ట్‌వేర్‌కు ప్రత్యామాయంగా ఉండే ఫ్రీ లేదా ఉచిత సాఫ్ట్‌వేర్స్‌ని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు. పెయిడ్ సాఫ్ట్‌వేర్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ ఫ్రీ సాఫ్ట్వేర్స్ పనిచేస్తున్నాయి. ఈ మాసం డిపి, డ్రాయింగ్ & గ్రాఫిక్స్‌కు సంబందించిన ఉచిత సాఫ్ట్‌వేర్స్‌ను తెలుసుకుంటూనే వీటికి ప్రత్యామాయంగా ఉండే పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఏవో కూడా తెలుసుకుందాం. వీటితో పాటుగా ఆఫీస్ ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఫ్రీ టూల్స్‌ని కూడా ఒకసారి ఉపయోగించి చూస్తే మీకే అర్థమవుతుంది.
పబ్లిషింగ్ సాఫ్ట్వేర్స్ …!
డెస్క్‌టాప్ పబ్లిషింగ్ (డిటిపి) కోసం పేజిమేకర్, ఇన్డిజైన్… వంటి వాటిని ఉపయోగిస్తుంటాం. వీటి కోసం కూడా ఇటీవల ఉచిత సాఫ్ట్వేర్స్ వాడుకలోకి వచ్చాయి. ఉదాహరణకు బాగా పాపులరైన స్రైబస్ ఒకటి. పేజీ లేఅవుట్, డిజైనింగ్ కోసం అత్యధిక శాతం క్వార్క్ ఎక్స్‌ప్రెస్, పేజీమేకర్, ఇన్డిజైన్… వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. పత్రికా కార్యాలయాల్లో అయితే క్వార్క్ని ఉపయోగిస్తుండగా, అదే మ్యాగజైన్ డిజైనింగ్ కోసం పేజీమేకర్ని ఉపయోగిస్తున్నారు. విదేశాలలో పేజీ లేఅవుట్ కోసం ఇటీవల బాగా ప్రాచుర్యాన్ని పొందుతున్న ఇన్డిజైన్ను ఉపయోగిస్తున్నారు.
ఇవి పెయిడ్ సాఫ్ట్వేర్స్ అయితే వీటికి ప్రత్యామాయంగా ఉపయోగించే ఉచిత సాఫ్ట్‌వేర్స్‌లో ముఖ్యమైన రెండింటి గురించి తెలుసుకుందాం.
MiKTeX అనే ఈ ఉచిత సాఫ్ట్వేర్ ద్వారా బుక్స్ తయారీ (మ్యాథమేటికల్, సైంటిఫిక్ బుక్స్‌ను కూడా తయారు చేయవచ్చు) సులువుగా చేయగలరు. ఇది విండోస్, మ్యాక్ రెండింటిలోను పనిచేస్తుంది. అయితే ఈ సాఫ్ట్వేర్ తెలుగు సపోర్ట్ చేయదు. ఇక మరో సాఫ్ట్వేర్ స్రైబస్ చాలా చక్కటి సాఫ్ట్వేర్. దీని ద్వారా సులువుగా బుక్ డిజైనింగ్ & లేఅవుట్‌ను చేయగలం. ఓపెన్‌సోర్స్ టూల్స్‌లో దీని గురించి ఇచ్చాం గమనించగలరు. miktex.org నుంచి డౌన్లోడ్ చేసుకొండి.
డ్రాయింగ్ & గ్రాఫిక్స్ టూల్స్ ..!
కోరల్ డ్రా, ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్‌వేర్స్‌ని అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ రెండింటిలో మొదటి స్థానం కోరల్ డ్రాదే. ఇటీవల కాలంలో ఈ సంస్థ కూడా ఎక్కడైనా పైరేటెడ్ ఉపయోగిస్తుంటే కనిపెట్టి దాడులు చేస్తుంది. అప్పటికప్పుడు ఓరిజనల్ కొనేలా ఒత్తిడి తీసుకుని వస్తుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. మరో సాఫ్ట్వేర్ పోటోషాప్ సిఎస్ కూడా బాగా పాపులర్ అయింది. ఇక్కడ చెప్పుకున్న ఈ మూడు టూల్స్‌నే డ్రాయింగ్ లేదా కలర్ వర్క్ డిజైనింగ్ లేదా గ్రాఫిక్స్ డిజైనింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ఈ పెయిడ్ వాటిని అనేక మంది పైరేట్ చేసే ఉపయోగిస్తున్నారు. వీటికి దీటుగా ప్రత్యామాయాలు కూడా ఉన్నాయి. ఉచితంగా లబించే పలు సాఫ్ట్వేర్స్ డ్రాయింగ్ & గ్రాపిక్స్ డిజైనింగ్‌కు ఉపయోగిస్తారు. కానీ వీటిలో బాగా ప్రాచుర్యాన్ని పొందిన వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పైన చెప్పిన పెయిడ్ టూల్స్‌కు ప్రత్యామాయంగా ఇంక్ స్కేప్, జింప్, డయా అనే టూల్స్ బాగా వాడుకలోకి వచ్చాయి.
ఇంక్స్కేప్… ఈ సాఫ్ట్వేర్ పైన చెప్పుకున్న కోరల్డ్రా, ఇల్లస్ట్రేటర్ ఎటువంటి టూల్స్‌ని కలిగి ఉందో అవే టూల్స్‌ను అందిస్తూ ఇంక్స్కేప్ ఎంతో సమర్దవంతంగా పనిచేస్తుంది. అన్ని రకాల కామన్ ఫార్మాట్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులోను కోరల్ డ్రాలో మాదిరిగానే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. విండోస్,మ్యాక్, లినక్స్…ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పనిచేస్తుంది. దీన్ని www.inkscape.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించగలరు.
జింప్ సాఫ్ట్వేర్…ఇది ఉచితంగా లబిస్తుంది. దీనికి ప్రత్యామాయంగా లబించే పెయిడ్ సాఫ్ట్వేర్ పోటోషాప్. ఉచితంగా లబించే జింప్లో అనేక శక్తివంతమైన ఫీచర్స్ ఉన్నాయి.
డయా టూల్ ఉచితంగా లబిస్తుంది. దీని ద్వారా డయాగ్రామ్స్, ఫ్లోచార్ట్స్, గ్రాఫిక్స్..వంటి వాటిని క్రియేట్ చేయగలం. దీనికి ప్రత్యామాయంగా ఉండే పెయిడ్ సాఫ్ట్వేర్ విసియో ప్రొఫెషనల్. డయా సాఫ్ట్వేర్ విసియో మాదిరిగా అన్ని రకాల ఫీచర్స్ లేనప్పటికీ పైన చెప్పుకున్న వరకు డయాగ్రామ్స్ డిజైనింగ్‌లో చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని live.gnome.org/dia వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలం.
ఉచిత టూల్స్‌ను వాడటంలో సమస్య ఏమిటి…?
కంప్యూటర్ యూసర్స్ దృష్టిలో అన్ని చోట్ల పెయిడ్ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు కదా…మన ఫైల్స్ ఉచిత సాఫ్ట్‌వేర్స్‌లో డిజైన్ చేస్తే ఓపెన్ అవుతాయో లేదో అని సందేహం. ఇప్పుడు అ సందేహం అవసరం లేదు. ప్రస్తుతం వచ్చే అన్ని రకాల సాఫ్ట్వేర్స్ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్లోను పనిచేస్తాయి. అదే విధంగా మీరు ఉచితంగా లబించే సాఫ్ట్‌వేర్స్‌లో తయారు చేసిన ఫైల్స్‌ను పిడిఎఫ్‌గా మార్చవచ్చు లేదా వేరే ఫార్మాట్లో సేవ్ చేసినా వాటిని ఇతర సిస్టమ్‌లో కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది.
ఉచితంగా లభించే ఆఫీస్ సూట్స్ గురించి..?
ఆఫీస్ సూట్స్ విషయానికొస్తే చాలా మంది ఇటీవల కాస్త ఉచిత ఆఫీస్ సూట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉచితంగా లబించే వాటిలో libre office, open office, neo office, calligra … …వంటివి చాలా చక్కగా పనిచేస్తాయి. ఇక పెయిడ్ విషయానికొస్తే…అత్యంత ప్రజాదరణ పొందిన ఎమ్ఎస్ ఆఫీస్ సూట్. ఈ సూట్‌కు ప్రత్యామాయంగానే పై టూల్స్ ఉచితంగా లబిస్తున్నాయి. ప్రస్తుతం ఇందులోనే ఆఫీస్ 365 అనే క్లౌడ్ ఆఫీస్ వచ్చింది. చాలా తక్కువ ధరలో సమర్ధవంతంగా పనిచేసుకోవచ్చు. దీనికంటే ముందున్న ఆపీస్ 2013ని కూడా ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఎమ్ఎస్ ఆఫీస్‌కు దీటుగా పైన చెప్పిన ఆఫీస్ సూట్స్ కూడా లబిస్తున్నాయి. వీటిని అయా వెబ్‌సైట్స్ నుంచి (libreoffice.org, openoffice.org, neooffice.org, calligra-suite.org) డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించగలరు.
Leave a Reply