
గూగుల్ సింపుల్ టిప్స్ – పార్ట్ 1
గూగుల్ ఇంటర్నెట్లో నెంబర్ వన్ సంస్థ. యాహూ, మైక్రోసాఫ్ట్, ఇతర ప్రముఖ ఆన్లైన్ సంస్థలు పోటీని ఇస్తున్నప్పటికీ గూగుల్ అందిస్తున్న పలు రకాల సర్వీస్‌ల ద్వారా నెంబర్ వన్‌గా కొనసాగుతుంది. గూగుల్ గురించిన అనేక విషయాలు గత సంచికలో తెలుసుకున్నాం. గూగుల్‌కు సంబందించిన తెలియని విషయాలు ఇంకా అనేకం ఉన్నాయి. గూగుల్ వలన మన ప్రైవసీ తగ్గిపోతుందనే అపవాదు ఉన్నప్పటికీ గూగుల్‌ను ఉపయోగించేవారు పెరుగుతున్నారు. గూగుల్ అందించే సర్వీస్‌లు అ విధంగా ఉన్నాయి మరి. నేడు గూగుల్ లేకుండా ఇంటర్నెట్ను ఊహించలేని పరిస్థితి ఉంది. సెర్చింగ్, ఇమెయిల్ నుంచి అనేక రకాల సర్వీస్‌లు అందుబాటులలో ఉన్నాయి.
ఈ విదంగా సెర్చింగ్ చేయవచ్చు …
Google Site Search …
గూగుల్‌లో నేరుగా మనకు కావాల్సిన సమాచారాన్ని వెతకవచ్చు. ఇలా కాకుండా ప్రత్యేకించి ఒక సైట్లో, ఒక అంశానికి సంబందించిన సమాచారం కావాంటే కూడా సెర్చింగ్ చేయవచ్చు. ఈ విదంగా చేయాంటే సైట్పేరుతో పాటుగా సెర్చింగ్ చేయాల్సిన పదాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం ఈ కింది విదంగా చేసి చూడండి.
ఉదాహరణకు how stuff works అనే వెబ్సైట్లో క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోవాంటే ఈ కింది విధంగా గూగుల్‌లో సెర్చింగ్ చేయాల్సి ఉంటుంది.
site:www.houstuffworks.com cloud computing అని ఇచ్చి సెర్చింగ్ చేస్తే కేవం అ వెబ్‌సైట్‌లోని క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబందించిన విషయాలు మాత్రమే మనకు కన్పిస్తాయి. వెంటనే అ లింక్స్‌ను ప్రెస్ చేసి అ సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్లి సమాచారం కోసం వెతకడం కంటే నేరుగా గూగుల్ నుంచే వెబ్సైట్స్లోని డేటా కోసం వెతకవచ్చు. అయితే ముందుగా మనకు పలానా వెబ్సైట్లో డేటా ఉందని తెలిస్తే, వెంటనే అ డేటా కోసం గూగుల్ ద్వారా వెతకవచ్చు. గూగుల్ సెర్చింగ్‌లో ఇటువంటి అనేక టెక్నిక్స్‌ను అందిస్తుంది.
గూగుల్‌లో అనేక రకాల టూల్స్
గూగుల్ సెర్చింగ్ ద్వారా సమాచారాన్ని పొందడమే కాకుండా ఇన్‌స్టాంట్‌గా అనేక రకాలుగా సెర్చింగ్‌ను చేయడం ద్వారా అక్కడే మనకు కావాల్సిన పలితం లబిస్తుంది. సాదారణంగా ఏదేని అవసరం అయినప్పుడు వాటికి సంబందించిన వెబ్సైట్లోకి వెళ్లి కావాల్సిన దాని కోసం వెతుకుతాం. అలా కాకుండా ఒకే ప్లేస్ అదే గూగుల్ సెర్చిబాక్స్ నుంచే అనేక రకాల ఉపయోగాలు పొందవచ్చు. ఇవన్నీ చాలా సింపుల్‌గా అనిపించవచ్చు.. కానీ ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ఇక్కడ గూగులే నేరుగా మనం వెతికే దానికి తగిన పరిష్కారం చూపుతుంది.
1. ఉదాహరణకు మనం ఏదేని క్యాలికులేషన్ చేయాలంటే విండోస్‌లోని క్యాలికులేటర్కు బదులుగా నేరుగా గూగుల్ సెర్చి బాక్స్ ద్వారా క్యాలికులేటర్‌ను పొందవచ్చు. ఇటువంటి అనేక టూల్స్ గూగుల్‌లో అందుబాటులో ఉన్నాయి.
2. ఉదాహరణకు ప్రస్తుతం క్రికెట్ వస్తుంది. ఒకవైపు పని చేస్తుంటారు. మరో వైపు స్కోర్ తొసుకోవాంటే చాలా సులువు. దీని కోసం క్రికెట్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లకుండానే నేరుగా గూగుల్ సెర్చ్ బాక్స్‌లో మ్యాచ్ గురించి డిటైల్స్ ఇస్తే కింద స్కోర్ డిస్ప్లే అవుతుంది.
3. అలాగే వాతవరణ వివరాల కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. నేరుగా సెర్చ్ బాక్స్‌లో టైప్ చేస్తే వాతవరణానికి సంబందించిన వివరాలు డిస్ప్లే అవుతాయి.
4. నేరుగా వేరు, వేరు దేశాలోని టైమ్ జోన్స్‌ను చూడాలంటే చూడవచ్చు. ప్రస్తుతం మీ సిటీలో ఉండే మూవీ షోస్ వాటి టైమ్స్‌ను చూడాలంటే చూడవచ్చు. దీని కోసం నేరుగా దానికి సంబందించిన సెర్చ్టర్మ్ను గూగుల్ సెర్చింగ్ బాక్స్‌లో టైప్ చేయాలి. ఉదాహరణకు Now time in london అని టైప్ చేస్తే లండన్‌లోని టైమ్ నేరుగా డిస్ప్లే అవుతుంది.
5. కేలరీస్‌ను తెలుసుకోవాంటే హెల్త్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లడం లేదా న్యూట్రిషన్‌ను కాంటాక్టు చేయడం.. వంటివి చేయకుండానే సులువుగా ప్రతి పుడ్ ఐటెమ్‌కు ఎంత కేలరీస్ ఉంటాయో సులువుగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు howmany calories in apple అని టైప్ చేయడం ద్వారా నేరుగా అక్కడే యాపిల్‌లో ఉండే కేలరీస్ డిస్ప్లే అవుతాయి. ఇలా ప్రతి పుడ్‌కు సంబందించిన వివరాలు పొందవచ్చు.
6. కేలరీస్‌ను కంపేర్ కూడా చేయవచ్చు. ఉదాహరణకు అరెంజ్, యాపిల్ మద్య కేరీస్ను కంపేర్ చేయాంటే , గూగుల్‌లో ఈ విధంగా calories apple vs orange టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయాలి.
7. యూనిట్ కన్వర్సన్స్ను కూడా సులువుగా చేయవచ్చు. దేని నుంచి దేనికైనా కన్వర్షన్ చేయవచ్చు. వాటి వేల్యూ కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక గజానికి ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంటుందో తెలుసుకోవాలంటే దానికి తగ్గ విధంగా సెర్చింగ్ చేయాలి. మనం సెర్చింగ్ చేయాలనుకున్న దానికి కరెక్ట్‌గా సరిపోయే పదాన్ని టైప్ చేసి ఎంటర్ చేయాలి. మైళ్లును , కిలోమీటర్స్గా కన్వర్ట్ చేయడం, కప్స్‌ను ఔన్స్‌గా కన్వర్ట్ చేయడం .. వంటివన్నీ కూడా సులువుగా చేయగలం. ప్రతి కన్వర్షన్‌ను చాలా సులువుగా వేగంగా గూగుల్ ద్వారా చేయవచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఇటువంటి అనేక పనులను సులువుగా గూగుల్ ద్వారానే చేయగలం.
గూగుల్ అంటేనే కేవలం సెర్చింగ్ చేయడమే కాకుండా అనేక రకాలు పనులు నిర్వహించవచ్చు. చాలా మందికి ఇటువంటి సింపుల్ టిప్స్ తెలియకపోవడం ద్వారా వాటి గురించి తెలుసుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంటారు.
మరికొన్ని గుగూల్ సింపుల్ టిప్స్ గురించి రెండవ పార్ట్‌లో తెలుసుకుందాం.
Leave a Reply