ఫేస్‌బుక్ ఉప‌యోగించాలి.. కానీ…!

ఫేస్‌బుక్ ఉప‌యోగించాలి.. కానీ…!

వాస్తవ దృశ్యం ఒక‌టి…
జీవితం బిజీ,జిబీ…పొద్దున లేచినప్ప‌టి నుంచి తిరిగి పడుకునేంత వరకు ఏవో అలోచనలు, పనులు. రోడ్డు మీద వెళ్లుతూ వుంటే పూర్తిగా
ట్రాఫిక్‌ జామ్‌ అయి వుంటుంది. తీరా విషయం చూస్తే యాక్సిడెంట్ అయి వుంటుంది. అందరు అ దృశ్యాన్ని చూడటం, వివరాలు తెలుసుకోవడం తప్ప,సహాయ చర్యలు చేస్తామనే ఆలోచనే రాదు.

వాస్తవ దృశ్యం రెండు…
బార్యభర్తలిద్దరు ఉద్యోగం చేసేవారే. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తారు. ఒకవైపు అలిసిపోయినప్పికీ, ఇంటికి వచ్చిన తర్వాత కూడా భర్తకు ఇష్టమైన వంటచేసి భర్తతో ప్రేమగా మ్లాడా లని తపిస్తుంది. కానీ భర్త మాత్రం ఒకవైపు బోజనం చేస్తూ మరో వైపు టివి రిమోట్ ప్రెస్‌ చేస్తూ టివి చూడటంలో నిమగ్నమై ఉంటాడు. మ‌రికొందురు స్మార్ట్ ఫోన్ చూస్తు ఉంటారు. అలాగే భ‌ర్త ఏదైనా చెప్పాల‌ని ద‌గ్గ‌ర‌కి వ‌స్తే బార్య టివి చూస్తూనో లేదా ఫోన్‌లో సోషల్ మీడియా చూస్తూనో బిజిగా ఉంటుంది.

వాస్తవ దృశ్యం మూడు…
పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు ఎంతో ప్రేమతో దగ్గరకు వస్తారు. స్కూల్‌లో చేసిన పనులు గురించి చెప్పాలని లేదా తాము పూర్తి చేసిన హోమ్‌వర్క్‌ గురించి చెప్పాలని, తమకు ఏమి కావాలో అడగాలని, ఏవేని సందేహాలు ఉంటే అడ‌గాల‌ని దగ్గరికి వస్తే పిల్లలను కోపగించుకుంటాం లేదా త‌ర్వాత రండి అని చెప్పుతుంటాం. దీంతో పిల్లలు పక్కకు వెళ్లి, వారిలో వారే బాధపడుతుంటారు.

ఇటువంటి ఎన్నో రియల్‌లైఫ్‌ సంఘటనలు మనకు నిత్యం కన్పిస్తూ ఉంటాయి. నిజజీవితంలో వాస్తవంగా మనం చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వహించకుండా తప్పించుకుంటాం. కానీ ఇదే ప్రజలు ఫేస్‌బుక్‌ అనే మరో ప్రపంచంలో అక్కడ ఏది నిజమో, ఏది భ్రమో తెలియని ఆ వర్చువల్‌ లైఫ్‌లో కావాల్సినంత సమయం వెచ్చిస్తున్నారు. అనేక విలువల గురించి పోస్టింగ్స్‌ నిరంతరం పోస్ట్‌ చేస్తూనే ఉంటారు. సమాజంలోని కుళ్లు గురించి, అవినీతి గురించి, ఇతరుల వ్యక్తిగత వ్యవహారాలను కూడా పోస్ట్‌ చేస్తుంటారు. గంటల కొద్దీ సమయాన్ని అందులో వెచ్చిస్తుంటారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే వాస్తవంగా జీవితంలో మన విలువైన సమయం ఎక్కడ వెచ్చించాలో అక్కడ కేయించకుండా… వాస్తవం కానీ ఫేస్‌బుక్‌లో గంటల కొద్దీ టైమ్‌ను గడుపుతుాంం. ఫేస్‌బుక్‌ అవసరమే కానీ…దాని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. ఇంతకీ ఫేస్‌బుక్‌ను ఎలా వుపయోగించుకోవాలి…? మన విలువైన సమయాన్ని ఎలా వాడుకోవాలి… ముఖ్యంగా యువత ఫేస్‌బుక్‌ పట్ల ఎలా వుండాలో ఈ వ్యాసంలో వివ‌రంగా తెలుసుకుందాం.

ఇలా ఉపయోగించి చూడండి…
సమాచారాన్ని రియల్‌ టైమ్‌లో వేగంగా ఎటువంటి ఖర్చు లేకుండా షేరింగ్‌ చేసుకోవడంలో ఫేస్‌బుక్‌ వుపయోగపడుతుంది. వీటితో పాటు ఈవెంట్‌,మేసేజింగ్‌,చాటింగ్‌, స‌మాచారాన్ని పోస్ట్ చేయ‌డం…వంటి పలు ఇతర పనులను కూడా ఫేస్‌బుక్‌ ద్వారా నిర్వహించవచ్చు. ఇంతవరకు ఒకే. ఈ శక్తివంతమైన మీడియా టూల్‌ను ఒక పద్దతి ప్రకారం వుపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. గేమింగ్‌కు అలవాటు పడి నిత్యం దానికే ప్రాధాన్యత ఇచ్చే యువతను అనేకమందిని చూశాం. అదే విధంగా ఇటీవల కాలంలో ఫేస్‌బుక్‌కు ఇండియాలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మన అవసరం ఉన్నంతవరకు ఉపయోగించాలి. సాదారణంగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత స్నేహితులు పంపే పోస్టింగ్స్‌కు, మేసేజ్‌లకు సమాదానం ఇచ్చిన తర్వాత మీరు షేరింగ్‌ చేసుకోవాలనుకునే పోస్టింగ్‌ను షేర్‌ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్‌కు ఉపయోగపడే మేసేజ్‌ను షేర్‌ చేసుకోవాలి. ఫ్రెండ్స్‌ పోస్ట్‌ చేసిన మేసేజ్‌లలో మంచి మేసేజ్‌లను షేర్‌ చేసుకోవడం వలన మీ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లోని ఇతర ఫ్రెండ్స్‌ కూడా అ పోస్టింగ్‌ను చూస్తారు. ఇలా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వరకు ఫేస్‌బుక్‌ను వుపయోగించడ ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. దీనికి బిన్నంగా అనేక మంది అనవసర పోస్టింగ్స్‌ను ఎంకరైజ్‌ చేయడం, నిత్యం చాటింగ్‌ చేయడం లేదా మొత్తం సమయాన్ని ఇతరుల పోస్టింగ్స్‌, ప్రొఫైల్స్‌, పోటోలు, వీడియోలు లేదా ఇతర సమాచారాన్ని చూడానికే వెచ్చిస్తుంటారు. ఈ విధంగా చేయడం ద్వారా మన సమయం వృదా కావడం తప్ప మనకు ఎటువిం విజ్ఞానం పెరగదు. ఇలా కాకుండా ఫ్రెండ్స్‌ మద్యనే కమ్యూనికేట్ చేస్తూ, అలాగే కొత్తగా మీ అబిరుచులకు తగ్గట్టు వుండే స్నేహితులు అన్పిస్తేనే వారిని యాడ్‌ చేస్తూ సర్ఫింగ్‌ చేస్తే మంచిది. కానీ ఈ విధంగా చేసే వారు చాలా తక్కువమందే. కొంత మంది నిత్యం ఫ్రెండ్స్‌ను యాడ్ చేస్తుంటారు. కొన్ని ప్రొఫైల్స్‌ను చూస్తే స్నేహితుల సంఖ్య 4000కు పైగానే వుంటుంది. కానీ వీరు పోస్ట్‌ చేసేది ఏమీ వుండదు. ఎంతసేపు ఇతరుల పర్సనల్‌ మ్యాటర్స్‌ ఏమేని వున్నాయో లేదా ఇతర అనవసర వ్యాపాకాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఫేస్‌బుక్‌ను ఉపయోగించండి, అయితే దాన్ని విజ్ఞానం పెంచుకోవడం కోసం, ఖాలీగా వున్న సమయంలో కొంత మేరకు మీ స్నేహితులతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కోసం ఉపయోగించాలి. రియల్‌గా వుండే రిలేషనషిప్స్‌ను పక్కన పెట్టి వర్చువల్‌ లైఫ్‌లో 24 గంటలు ఇలా వుండటం ద్వారా ప్రయోజనం వుండదు.

సెక్యూరిటీని గమనిస్తున్నారా…
ఫేస్‌బుక్‌లో స్నేహితులను యాడ్‌ చేయడం మొదలుకుని, డేటా షేరింగ్‌ చేయడం, పోటోలను, వీడియోలను షేర్‌ చేయడం వరకు ప్రతిదీ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ముఖ్యమైన పోటోలను ప్రతి ఒక్కరు చూసేలా పబ్లిక్‌ పోస్టింగ్‌ చేయడం మంచిది కాదు. పోస్ట్‌లో వుంచే వాటిని కేవలం మీ స్నేహితుల వరకు చూసేలా కూడా ప్రైవసీ సెట్టింగ్స్‌లో చేయవచ్చు. మీకు తెలియకుండా మీ ఫ్యామిలీ పోటోలను ట్యాగ్ చేయడం, వాటిని షేర్‌ చేసుకోవడం…వంటివి జరగకుండా చూసుకోవాలి. వాస్తవంగా మీకు పరిచయం వున్న స్నేహితులు వేరు, ఫేస్‌బుక్‌ స్నేహితులు (ఓఔ ఓజీరిలిదీఖిరీ) వేరు. కావున ప్రతి ఒక్కరిని నమ్మడం, వారికి మీ సమాచారం (ఫోన్‌నంబర్‌, అడ్రస్‌…వంటివి) ఇవ్వడం చేయవద్దు. ఫేస్‌బుక్‌లో అక్కౌంట్ ఓపన్‌ చేయడమే కాదు, దాన్ని ఉపయోగించడం తెలిసి వుండాలి. అక్కౌంట్ సెట్టింగ్స్ , ప్రైవసీ సెట్టింగ్స్ … తదితర వాటిని గమనిస్తూ మీకు కావాల్సిన విధంగా పూర్తి సెక్యూరిటీ వుండేలా సెట్టింగ్స్‌ చేసుకోవాలి. ప్రతి వారం పాస్‌వర్డ్‌ మార్చుకోవడానికి ప్రయత్నం చేయగలరు. పాస్‌వర్డ్‌ ఇతరులకు తెలియడం ద్వారా మీ ప్రొఫైల్‌లో మీకు సంబందం లేని వాటిని పోస్ట్‌ చేయడం జరుగుతుంది. కావున పాస్‌వర్డ్‌ను తరుచుగా మార్చడం, సెట్ చేసే పాస్‌వర్డ్‌ కూడా లెటర్స్‌, అంకెల కాంబినేషన్‌ను కలిగి వుండాలి. ఉదాహరణకు ఆబిరీఐగీంజీఈట18659 … ఇలా వుంచడం ద్వారా పాస్‌వర్డ్‌ను ఇతరులు తెలుసుకోవడం కష్టమవుతుంది. పాస్‌వ‌ర్డ్ క‌ఠినంగా ఉండాలి. ఉదాహ‌ర‌ణ‌కు న్యూమ‌రిక్స్‌, స్పెష‌ల్ క్యారెక్ట‌ర్స్ కూడా క‌లిసి ఉండాలి.

షేరింగ్‌ విషయంలో జాగ్రత్త…
ఫేస్‌బుక్‌లో సమాచారం షేరింగ్‌ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుని షేర్‌ చేసుకొండి లేదంటే సమస్యలు వస్తుంటాయి. ప్రతిదీ షేర్ చేయ‌వ‌ద్దు… ఏదైతే సమాచారం పదిమందికి వుపయోగపడుతుంది అనుకుంటేనే షేర్‌ చేయగలరు. పోటోలు, వీడియోల విషయంలో కూడా జాగ్రత్తగా షేర్‌ చేసుకోవాలి. ఒకవేల పొరపాటున షేర్‌ చేసుకున్నా వాటిని వెంటనే రిమూవ్‌ చేసే వీలుంది. అలాగే మీ పోస్ట్టింగ్స్‌ను ఎడింగ్‌ చేసే వీలుంది. ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవరేని ఫ్రెండ్స్‌ ద్వారా ఇబ్బందికరమైన పోస్టింగ్స్‌ వస్తుంటే అ ఫ్రెండ్‌ను బ్లాక్‌ చేయవచ్చు. మీ చిన్ననాటి ఫ్రెండ్స్‌ ఫేస్‌బుక్‌లో వుంటే వారి పేరుతో వెతకండి. మీకు ఎవరితోనైనా స్నేహం చేయాలంటే ముందుగా మీ గురించి మేసేజ్‌ పంపి తర్వాత ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపండి. ఫేస్‌బుక్‌లో అనేక ఫేక్ అక్కౌంట్స్ ఉన్న‌ట్టు గుర్తించారు. కావున ప్రతి ఒక్కరితో స్నేహం వద్దు. నిరంతంరం ఫేస్‌బుక్‌ను ఉపయోగించడమే జీవితం కాకుండా కాస్త రియల్‌లైఫ్‌ రిలేషన్‌షిప్స్‌కు కూడా విలువ ఇస్తే మంచిది.

Note :  ”ఫేస్‌బుక్‌ శక్తివంతమైన మీడియా టూలే. వేగంగా ఖర్చు లేకుండా రియ‌ల్ టైమ్‌లో సమాచారాన్ని షేర్‌ చేసుకోవచ్చు. నాలెడ్జిని పెంచే పోస్టింగ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతే కానీ ఫేస్‌బుక్‌ను ఉపయోగించడమే పూర్తి దినచర్యగా మారడం వలన అదో వ్యసనం తప్ప ప్రయోజనమేమి వుండదు.”

“A fool with a tool is still a fool”

About Digital For You 713 Articles
Technology For You (Formerly Computers For You) is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Technology For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*