బ్లాగ్ లేదా వెబ్‌సైట్‌ను పాపుల‌ర్ చేసుకోవ‌డం ఎలా..? – Part 3

మీరు ఎంచుకున్న బ్లాగ్ ఏదైనా స‌రే దాన్ని అంకిత బావంతో క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హించ‌డం ద్వారా నెటిజ‌న్స్ నుంచి క్లిక్స్ రావ‌డం, వెంట‌నే మీ బ్లాగుకి ట్రాఫిక్ పెర‌గ‌డం జ‌రుగుతుంది. నిత్యం పోస్ట్‌లు ఉండేలా చూసుకోవాలి. మొద‌టి బాగంలో ప‌లు అంశాల‌ను తెలుసుకున్నాం. రెండం భాగంలో కూడా బ్లాగును పాపుల‌ర్ చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డే ముఖ్య అంశాల‌ను తెలుసుకుందాం.

ఇమేజ్‌ను వాడి చూడండి …

ఆన్‌లైన్‌లో వ్యాసాల‌ను పోస్ట్‌ చేయడం మంచిదే. కానీ ఎప్పుడూ వ్యాసాలే కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఇమేజ్‌తో కూడిన వ్యాసాల‌ను కూడా ఇవ్వాలి. అదే విదంగా వ్యాసాల‌ను బట్టి వాటికి సరిపడే ఇమేజ్‌ల‌ను అర్టికల్‌తో పాటు ఇవ్వాలి. ఇమేజ్‌ల‌ను  చూడగానే నచ్చే విధంగా ఉండాలి. ప్రాక్టికల్‌ గైడ్స్‌, how to guides  … వంటివి ఇచ్చినప్పుడు టెక్స్‌ట్‌ కంటే ఎక్కువగా ఇమేజ్‌ల‌ను ఇచ్చి చూడండి. అవసరం ఉన్న చోట అర్టికల్‌ను బట్టి స్క్రీన్‌షాట్స్‌ని కూడా  ఉపయోగించండి.

కాంటెస్ట్‌లు .. కాన్ఫరెన్స్‌లు …

బ్లాగ్‌కు వస్తున్న స్పందనను బట్టి ఇటువంటి ప్లాన్‌ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాఠకుల‌కు మద్య  కాంటెస్ట్‌ల‌ను నిర్వహించడం .. బహుమతుల‌ను ఇవ్వడం వంటివి చాలా ఆసక్తిగా ఉంటాయి. చాలా మంది బ్లాగులో ఇటువంటి వుండవు. అలాగే బ్లాగ్‌ని పాపుల‌ర్‌ చేయాలంటే ఆఫ్‌లైన్‌లో కూడా సమావేశాలు  నిర్వహించి కంటెంట్‌ను పదిమందికి చేరేలా చూడాలి. సమావేశాల  ద్వారా మన బ్లాగ్‌ చదివే వారు ఒకచోట చేరి వారి సల‌హాలు, సూచనల‌ను  అందిస్తారు. అలాగే బ్లాగుకు సంబందించిన సమావేశాలు  ఉంటే వాటిలో పారిస్టిసిపేట్‌ చేయాలి. ఉదాహరణకు మీరు ఎడ్యుకేషనల్‌ బ్లాగ్‌ని నిర్వహిస్తుంటే ఎడ్యుకేషనల్‌ కాన్ఫరెన్స్‌లో మీరు కూడా పార్టిసిపేట్‌ చేయాలి. ఆన్‌లైన్‌ బ్లాగ్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా ప్రమోట్‌ చేయడం ఎంతైనా అవసరం.
చెప్పాల‌నుకునే దాన్ని బట్టి …బ్లాగ్‌లో పోస్ట్‌ చేయాల‌నుకునే అంశాన్ని బట్టి అర్టికల్‌ను తయారు చేయండి. అర్టికల్‌ మరీ పొడువుగా లేదా మరీ తక్కువగా కాకుండా చెప్పాల‌నుకునే విషయాన్ని నెటిజన్స్‌కు అర్థమయ్యేలా సువుగా చెప్పాలి. అంశాన్ని బట్టి అర్టికల్‌ను ఇచ్చే విదానం మార్చుకోవాలి.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడ్స్‌  ఇమెయిల్‌ న్యూస్‌ లెటర్స్‌ …

బ్లాగును నిర్వహించే ప్రతి ఒక్కరు ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడ్స్‌ను తప్పకుడా ఉపయోగిస్తుంటారు. బ్లాగ్‌లో మనం అందించే ఫీడ్స్‌ రీడర్‌కు అందాలంటే వీటిని బ్లాగులో చేర్చాలి. ఫీడ్‌ బర్నర్‌ వంటి వాటిని ఉపయోగించండి. వీటి ద్వారానే కాకుండా ఇమెయిల్‌ ద్వారా కూడా సబ్‌స్రైబ్‌ చేసుకునే అప్షన్‌ ఇవ్వాలి. బ్లాగ్‌ అప్‌డేట్స్‌ రీడర్‌కు రెగ్యుల‌ర్‌గా వెళ్లుతుంటాయి.

ఇతర బ్లాగుల‌లోని టెక్నికల్‌ విషయాలు …

ఇతర బ్లాగుల‌తో  లేదా బ్లాగ‌ర్స్‌లో స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిది. సాదారణంగా బ్లాగులో నిరంతరం డేటాను ఇస్తూ ఉంటాం. అలాగే రీడర్స్‌ ఎక్కువ మంది లాగిన్‌ అయినప్పుడు లేదా ఇతర టెక్నికల్‌ ప్రాబ్లమ్స్ వల‌న బ్లాగు ఓపెన్‌ కాకుండా ఉండే  వీలుంది.  తరుచుగా “404 problem, page not found  … వంటి సమస్యలు వస్తుంటాయి. వీటితో పాటుగా  బ్రోకెన్‌ లింక్స్‌ సమస్య, ఇతర డిజైన్‌ సమస్య ఏవేని ఉంటే కూడా గుర్తిస్తూ ఉండాలి. ఇటువంటి సమస్యలు ఇతర బ్లాగులో ఉంటే వారి దృష్టికి తీసుకు వెళ్లండి.

ఇమెయిల్‌ పంపే సమయంలో …

చాటింగ్‌, సోషల్‌ మీడియా , వాట్సాప్‌ .. వంటివి వచ్చినప్పటికీ ఇమెయిల్‌ ద్వారానే కమ్యూనికేట్‌ చేయడం సౌకర్యంగా ఉంటుంది. ఇమెయిల్‌ పంపే సమయంలో తప్పకుండా కింద మన పూర్తి వివరాలు తెలియచేయాలి. వీటిని డిఫాల్ట్‌గా ఒకే సారి సేవ్‌ చేసి పెట్టుకుంటే కామన్‌గా ప్రతి మెయిల్‌కు కన్పిస్తూ ఉంటుంది.  ఇక్కడ ముఖ్యంగా మీరు పంపే ప్రతి ఇమెయిల్‌లోను తప్పకుండా కింద బ్లాగ్‌ నేమ్‌, బ్లాగ్‌ వెబ్‌ అడ్రస్‌ ఉండేలా చూడండి.

బ్లాగ్‌ కమ్యూనిటీలో యాడ్‌ చేయండి …

బ్లాగింగ్‌ వరల్డ్‌లో అనేక రకాల‌ బ్లాగు కమ్యూనిటీలు  ఉన్నాయి.  ఇక్కడ మీ బ్లాగుని యాడ్‌ చేసుకోవడం ద్వారా మీ బ్లాగు గురించి  అక్కడకి వచ్చే నెటిజన్స్‌కు  తెలుస్తుంది. సెర్చిఇంజన్‌ సబ్‌మిషన్‌ మాదిరిగానే ఇలా చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

అనేక లింక్స్‌ కాకుండా ..

మీరు ఏ విభాగంలో బ్లాగుని నిర్వహిస్తున్నారో .. అ విభాగానికి సంబందించిన వ్యాసాలు అందిస్తూ ఉండండి. ఎక్కువ రకాల‌ లింక్స్‌ను ఇవ్వకుండా మనం చెప్పాల‌నుకునే దాన్ని సింపుల్‌గా చెప్పాలి. ప్రస్తుతం రీడర్స్‌కు ఏమి అవసరమో గుర్తించి దానికి సంబందించిన వ్యాసాలు మాత్రమే ఇవ్వాలి. అవసరం లేని విషయాల‌ను ఇవ్వడం వల‌న ప్రయోజనం ఉండదు. అలాగే ఇచ్చే అర్టికల్స్‌ రీడర్స్‌ నాలెడ్జిని పెంచేలా ఉండాలి.

సోషల్‌ మీడియాలో షేరింగ్‌ …

మీరు నిర్వహించే బ్లాగును నెటిజన్స్‌కు తెలియచేయాలంటే వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్లాలి. నేడు సోషల్‌ మీడియాలో అనేక మంది చేరుతున్నారు. నిత్యం ల‌క్ష‌ల‌ మంది ఫేస్‌బుక్‌లో లాగిన్‌ అవుతున్నారు. ఫేస్‌బుక్‌ లేదా ఇతర సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌లో కూడా మీ వెబ్‌సైట్‌ గురించి ప్రచారం చేసుకోండి. మీరు అనేక విష‌యాల‌ను బ్లాగులో ఇస్తూ ఉంటే వాటిని ఫేస్‌బుక్‌లో కూడా షేర్‌ చేసుకుంటే అక్కడ ఉండే మీ స్నేహితుల‌కు కూడా  మీ బ్లాగు ద్వారా మీరందించే వ్యాసాల గురించి తెలుస్తుంది. ఇలా గూగుల్‌ ప్లస్‌, ట్విట్టర్‌ .. వంటి పలు వెబ్‌సైట్స్‌లలో కూడా మీ బ్లాగు గురించి వివరిస్తూ పోస్ట్‌ చేయండి.

SEO Freindly …

బ్లాగుని డిజైన్‌ చేసే సమయంలోనే  SEO  ఫ్రెండ్లీగా ఉండేలా తయారు చేయాలి. సిఎంఎస్‌ టూల్స్‌లో మనం ఎంచుకునే థీమ్ SEO ఫ్రెండ్లీనా కాదా చూడండి. అనేక థీమ్స్‌ ఆన్‌లైన్‌లో ఉంటున్నాయి. మీరు వాడే సిఎఎంస్‌ థీమ్స్‌ను సరిగ్గా సెలెక్ట్‌ చేసుకుని తర్వాత కస్టమైజ్‌ చేసుకోవాలి.

ముఖ్యమైన లింక్స్‌ను సరిగ్గా …

కొన్ని బ్లాగుల‌లో Contact us page ఎక్కడ ఉందో వెతకాల్సిన అవ‌స‌రం  ఉంటుంది. ఇలా కాకుండా ముఖ్యమైన లింక్స్‌ను అన్నింటిని వెబ్‌సైట్‌లో ఉంచాలి. త‌ప్ప‌కుండా కాంటాక్ట్ పేజీలో క‌నీసం మీ ఇమెయిల్ ఐడీ లేదా ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఉండేలా చూసుకోవాలి. లింక్స్‌ను చక్కగా అర్గనైజ్‌ చేసుకోవాలి. ఆలాగే ఒక మెయిన్ లేదా హోమ్ పేజీ మాత్రమే అందంగా కాకుండా ఇతర పేజీల‌లోకి వెళ్లినప్పుడు కూడా బ్లాగ్‌ పేజీ చక్కగా కన్పించాలి.

టెక్స్‌ట్‌ రీడబుల్‌గా ఉండేలా చూసుకోవాలి …

అర్టికల్‌ను చక్కగా రాయడమే కాకుండా దాన్ని డిజైన్‌ చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి రీడబుల్‌ ఫాంట్‌ని ఉపయోగించాలి. అలాగే ఫాంట్‌ సైజ్‌ మరీ చిన్నగా లేకుండా చూసుకోవాలి. హెడ్డింగ్స్‌ను హైలేట్‌ చేసుకోవాలి. ప్రతి పేరాకు ఒక లైన్‌ గ్యాప్‌ ఇవ్వాలి. అలాగే ఇమేజ్‌ను ఉంచినప్పుడు , ఇమేజ్‌పై టెక్స్‌ట్‌ లేకుండా చూడాలి. ఇమేజ్‌, టెక్స్‌ట్‌ ఉంచినప్పుడు రెండింటిని చక్కగా అలైన్‌మెంట్‌ చేయండి. అవసరమైన చోట పలు ఇతర లింక్స్‌ను కూడా ఇవ్వండి. టెక్స్‌ట్‌ మద్యలో యాడ్స్‌ రాకుండా చూడాలి. యాడ్స్‌ను హారిజాంటల్‌గా లేదా వర్టికల్‌గా ఇచ్చే ప్రయత్న చేయండి. యాడ్స్‌ కన్పించే విదానం కూడా చక్కగా ఉండాలి.

సబ్జెక్ట్‌ నిపుణుల‌తో కూడా వ్యాసాలు …

బ్లాగు అంటే ఒక్కరు లేదా ఇద్దరే రాయాల‌ని కాదు. మీ బ్లాగులో ఇచ్చే కంటెంట్‌ను సబ్జెక్ట్‌ నిపుణుల‌తో కూడా సంప్రదించి వారితో కూడా రాసే ప్రయత్నం చేయాలి. ఒక అంశం గురించి రాయాలంటే అ అంశంపై పట్టున్న వారిని సంప్రదించి వారి ద్వారా మంచి వ్యాసాలు  రాయండి. వారు బ్లాగుకు స‌హాయంగా ఉన్నారని బ్లాగులో తెలియచేయండి. ఇలా చేస్తే బ్లాగుకు పేరు వస్తుంది. ఎప్పుడు కూడా బ్లాగుకు పేరు రావాలి అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. ఎప్పుడే కానీ వ్యక్తి పూజ పనికిరాదు. అంతా నేనే ఏదో చేస్తున్నాను అనే భ్రమ కల్పించకూడదు. అలా చేయడం ద్వారా భవిష్యత్‌లో రీడర్స్‌ అంచనాను చేరకపోతే ఒకసారిగా బ్లాగు ప్రాచుర్యాన్ని కొల్పోయే పరిస్థితి వస్తుందని గ్రహించండి.ఇక్క‌డ మ‌న‌కు తెలిసిన స‌మాచారాన్ని ఇస్తున్నాం లేదా ఇంట‌ర్నెట్ ద్వారా సేక‌రించిన స‌మాచారాన్ని ఇస్తున్నాం. అంతే కానీ నేను ఏదో చేస్తున్న‌ట్టు, మ‌న బ్లాగు లేదా సోష‌ల్ మీడియా ఉంది క‌దా అని మ‌న గురించి విప‌రీతంగా గొప్ప‌లు చెప్పుకోవ‌డం మంచిది కాదు. దీని వ‌ల‌న‌నెటిజ‌న్స్‌కు మీరంటే అస‌హ్యం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

బ్లాగు డిజైన్‌ను మారుస్తూ ఉండండి …

బ్లాగు డిజైన్‌ ఎప్పుడూ ఒకేలా కాకుండా డిజైన్‌ను కూడా మారుస్తూ ఉండాలి. మీరు సిఎఎంస్‌ టూల్స్‌ను ఉపయోగిస్తుంటే ఎప్పటికప్పుడు కొత్త, కొత్త థీమ్స్‌ వస్తుంటాయి. అ థీమ్స్‌లో యూజర్‌ ఫ్రెండ్లీగా ఉన్న వాటిని ఎంచుకుని బ్లాగు డిజైన్‌ను మారుస్తూ ఉండాలి. మరీ తరుచుగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండటం వల‌న రీడర్స్‌లో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. థీమ్స్‌ను మంచి వాటిని ఎంచుకొండి.  వ‌ర్డ్‌ప్రెస్ థీమ్స్‌లో బాగా ఉన్న వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉచితంగా ల‌బించే వాటిలో కూడా చాలా మంచి థీమ్స్ ఉంటాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకుని క‌స్ట‌మైజ్ చేసుకోవ‌డ‌మే.

గూగుల్‌ ఎనాటిక్స్‌ …

గుగూల్‌ అందించే  “Google Analytics” ద్వారా మీ సైట్‌ని స్టాటిస్టిక్స్‌ను ట్రాక్‌ చేస్తూ ఉండవచ్చు. దీని కోసం “Google Analytics” లో సైనప్‌ కండి. తర్వాత అక్కడ నుంచి బ్లాగ్‌ స్టాటస్‌ను ట్రాక్‌ చేయండి. దీని వన మీ బ్లాగు వీక్‌నెస్‌ ఏమిటో కూడా  తెలుస్తుంది. మీ బ్లాగు ట్రాఫిక్‌ ఎలా ఉందో తెలుసుకోవాంటే అలెక్సా వెబ్‌సైట్‌ని  ఉప‌యోగించి తెలుసుకొండి.

అర్టికల్‌లో ఉపయోగించే పదాలు కూడా …

బ్లాగుల‌లో ఇచ్చే వ్యాసంలో హెడ్డింగ్స్‌, సబ్‌ హెడ్డింగ్స్‌ .. అర్టికల్‌లో ఉండే పదాల‌ను చక్కగా ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా మన అర్టికల్‌లో ఉండే పదాల‌ను ఎవరేని కీవర్డ్స్‌గా ఉపయోగించి సెర్చింగ్‌ చేస్తుంటే మన బ్లాగే సెర్చి పేజీలో మొదటగా కన్పిస్తుంది.  Search engine optimizaiton (SEO) లో ఇటువంటి టెక్నిక్స్‌ అన్నీ వస్తాయి. కావున బ్లాగర్‌ SEO గురించి కూడా  తెలుసుకుని ఉండటం ద్వారా SEO టెక్నిక్స్‌ తన బ్లాగుకు అప్లై చేసుకుంటాడు.

ఇతర బ్లాగుల‌ను కూడా గమనించాలి…

ఆన్‌లైన్‌లో ఉండే అనేక ఇతర బ్లాగుల‌ను కూడా  నిరంత‌రం గమనించాలి. బాగా ట్రాఫిక్‌ వస్తున్న బ్లాగును గమనించి .. అక్కడ ఏమి జరుగుతుందో చూడాలి. అక్క‌డ వ‌చ్చే వ్యాసాల‌ను అలాగే అక్క‌డి కంటే బిన్నంగా మ‌న బ్లాగు ఉండేలా చూసుకోవాలి. అప్ప‌డే నెటిజ‌న్స్ నుంచి అలాగే కొత్త ట్రాఫిక్ వ‌చ్చే వీలు ఉంటుంది.

బ్లాగర్‌ నెటిజన్స్‌తో కలిసిపోవాలి …

అనేక మంది బ్లాగర్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా తమకు తెలిసిన విషయాను షేర్‌ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బ్లాగర్స్‌ నెటిజన్స్‌తో టచ్‌లో ఉండాలి. వారితో ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ బ్లాగ్‌ని మరింత గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. మనం నిరంతరం మ‌న చేతిలో బ్లాగ్ ఉంది క‌దా అని  మన గొప్ప‌లు చెప్ప‌కుంటూ  నేనొక్కొడినే బ్లాగ్‌ ద్వారా సమాచారాన్ని ఇస్తున్నాను అంటూ … పోస్ట్‌లు  పెట్టడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. నెటిజన్స్‌తో కలిసిపోవాలి .. వారి సందేహాల‌కు సమాధానాలు చెప్పాలి. మన గురించిన పోస్ట్‌లు  తగ్గించుకోవాలి. బ్లాగ్‌ ద్వారా మనం ఏమి చేస్తున్నామో .. మన ప్రొఫైల్‌లో ఉంచితే సరిపోతుంది.మన బ్లాగ్‌ మన చేతిలో ఉంది కదా అని ఎప్పుడూ మన గురించి గొప్పు పోస్ట్‌ చేయడం వల‌న నెటిజన్స్‌కు అసహ్యం వేస్తుంది. కొంత కాలానికి మన బ్లాగ్‌ మీదే విరక్తి వస్తుంది. మన బ్లాగ్‌ ఒక శక్తివంతమైన టూల్‌గా ఉండాలి. పది మందికి ఉపయోగపడేలా ఉండాలి. నెటిజన్స్‌ కామెంట్స్‌ను పాజిటివ్‌గా తీసుకోవాలే కానీ వారిని మనం తిరిగి నీవెంత అంటూ కామెంట్‌ చేయకూడదు. మన చేతిలో మాధ్యమాన్ని పిచ్చోడి చేతిలో రాయిలా చేసుకోకుండా ఉంటే మరీ మంచిది.

సమాచారం  గూగుల్‌ సెర్చ్‌ కాకూడదు …

మనం ఒక అంశంపైన బ్లాగ్‌ని మొదలు  పెట్టాం. దానికి సంబందించిన అనేక విషయాల‌ను డెప్త్‌గా అందించే ప్రయత్నం చేయాలి. మన టార్గెట్‌ నెటిజన్స్‌కు అవసరమైన సమాచారం పూర్తిస్థాయిలో మన బ్లాగ్‌లో ఉండేలా చూసుకోవాలి. ఇంటర్నెట్‌ను ఒక సోర్స్‌గా మాత్రమే వాడుకోవాలి. అంతే కానీ మొత్తం ఇంటర్నెట్‌ ద్వారానే సమాచారాన్ని కాపీ చేసి మన బ్లాగ్‌ ద్వారా అందిస్తే, మనం కాపీ కొడుతున్నట్టు సులువుగా అర్థమవుతుంది. తద్వారా ట్రాఫిక్‌ ఉండదు. అలా ఎప్పటికీ చేయకూడదు. గూగుల్‌ సెర్చింగ్‌ ద్వారా దొరికే సమాచారాన్ని మనం ఇస్తే పెద్దగా  విలువ ఉండదు కదా. మనం  ఏ అంశంపై బ్లాగ్‌ని నిర్వహిస్తున్నామో  దాని గురించిన సమాచారం

చాలా అప్‌డేటెడ్‌గా ఉండాలి …

చాలా ప్రత్యేకంగా ఉండాలి. నెటిజన్స్‌కి 100 శాతం ఉపయోగపడేలా ఉండాలి. సమాచారాన్ని సంబందిత ప్రొఫెషనల్స్‌తో మాట్లాడి బ్లాగర్స్‌ సేకరించి పోస్ట్‌ చేయాలి. మనం అందించే సమాచారం కొంతంలో కొంత ఉపయోగపడే విధంగా ఉండాలి. మిస్‌గైడ్‌ చేసేలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు నెట్‌ ద్వారానే సమాచారాన్ని అటు, ఇటుగా  మారుస్తూ అందిస్తూ ఉండటం వన ప్రయోజనం ఏమి ఉంటుంది. అందుకే ఆఫ్‌లైన్‌లో హార్డ్‌వర్క్‌ చేయాలి .. సమాచారం సోర్స్‌ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్లి దాని లోతును చూసి పూర్తి స్థాయిలో అందించే ప్రయత్నం చేయాలి. అప్పుడే బ్లాగ్‌కు విపరీతమైన క్రేజీ వస్తుంది. మంచి బ్లాగర్‌గా గుర్తింపును పొందుతారు.

చివరగా కొన్ని ముఖ్య అంశాలు…

బ్లాగుని ప్రారంబించిన తర్వాత ముందుగా డిజైన్‌ను చక్కగా  ఉండాలి. చెప్పాల‌నుకునే విషయాలు సూటిగా చెప్పాలి. అనేక రకాల‌ లింక్స్‌ కాకుండా ఉపయోగపడే విధంగా ముఖ్యమైన లింక్స్‌ను మాత్రమే బ్లాగులో ఉంచాలి. అందించే సమాచారం ఎక్సిక్లూజివ్‌గా ఉండాలి. కాపీ పేస్ట్‌ చేయకుండా ఉండాలి. రెగ్యుల‌ర్‌గా అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. కనీసం ఒక రోజు కూడా  ఐడియల్‌గా ఉంచకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా బ్లాగును  ప్రమోట్‌ చేస్తూ ఉండాలి. ఉన్న పరిస్థితుకు తగ్గ విధంగా ప్రమోట్‌ చేసుకోవాలి. ప్రస్తుతం సోషల్‌ మీడియా హవా నడుస్తున్న కారణంగా ఈ వెబ్‌సైట్స్‌లో ప్రమోట్‌ చేసుకోవడం మంచిది. కాలం మారే కొద్దీ మీరు కూడా మారుతూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో యాప్స్‌ వస్తున్నాయి కావున .. మీరు మీ వెబ్‌సైట్‌ను యాప్‌గా కూడా మార్చండి. తద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కూడా  నెటిజ‌న్స్  మీరిచ్చే సమాచారం పొందవచ్చు. వెబ్‌సైట్‌ మొబైల్‌లో కూడా సులువుగా ఓపెన్‌ అయ్యేలా ఉండాలి.

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*