విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలి.. ప్రాక్టికల్ విద్యే అందుకు మార్గం

“జపాన్ స్ఫూర్తికావాలి”

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలి.. ప్రాక్టికల్ విద్యే అందుకు మార్గం మంత్రి కే తారకరామారావు పిలుపు
విశ్వవిద్యాలయాల్లో వినూత్న ప్రయోగాలకు త్వరలో నాందిపలుకుతామని వెల్లడి
కేటీఆర్ సమక్షంలో టీహబ్, ఆర్‌ఈసీ మధ్య ఒప్పందం

IT Minister KTR addressed the gathering at the launch of ‘REC Innovation Platform’ at T-Hub Hyderabad. The program is a joint initiative of T-Hub and Rural Electrification Corporation. REC Innovation Platform to support 30 government institutions across Telangana and Andhra Pradesh.

భారత్‌లో ఉత్పత్తుల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్రల సరసన మొదటిసారిగా తెలంగాణ 5వ స్థానం దక్కించుకోవడం గర్వకారణమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ఆర్థిక సర్వే-2017-18 ఈ విషయాన్ని వెల్లడించిందన్నారు. సోమవారం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ), టీహబ్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఈసీ ఇన్నోవేషన్‌ ఫ్లాట్‌ఫాం ప్రాజెక్టుకు సంబంధించి అవగాహన ఒప్పందం జరిగింది. గచ్చిబౌలిలోని టీహబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ దేశం మొత్తంగా ఉత్పత్తి ఎగుమతుల్లో 70 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే జరుగుతున్నట్లు ఆర్థిక సర్వే నివేదిక చెబుతోందన్నారు.

పరిశ్రమలను, పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చేపట్టిన టీఎస్‌ఐపాస్‌ విధానంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఆర్‌ఈసీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన టీహబ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ, ఏపీలోని 30 విశ్వవిద్యాలయాల్లో 1800 మంది విద్యార్థులతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారన్నారు. దేశానికి అత్యవసరమైన విద్యుత్‌ రంగంలో ముఖ్యంగా సౌర, పవన విద్యుత్‌ ఉత్పాదనలో పలు అవరోధాలు ఉన్నాయన్నారు. వాటిని అధిగమించేందుకు టీహబ్‌తో కలిసి ఆర్‌ఈసీ 1800 మంది విద్యార్థులతో 600 ప్రాజెక్టు నమూనాలను తయారు చేయనుందని తెలిపారు. చివరికి 30 ప్రాజెక్టులను ఎంపిక చేసి, వాటికి టీహబ్‌ మార్గదర్శనం ద్వారా వచ్చే పరిష్కారాలను తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో అన్ని రాష్ట్రాలకు అందిస్తామన్నారు.

About Digital For You 713 Articles
Technology For You (Formerly Computers For You) is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Technology For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*