వెబ్‌సైట్ లేదా బ్లాగ్‌ను పాపుల‌ర్ చేసుకోవ‌డం ఎలా..? – Part 1

వెబ్‌సైట్‌ , ఇమెయిల్‌, బ్లాగ్‌, సోషల్‌ మీడియా .. ఇలా పలు రకాల‌ మాధ్యమాలు వస్తూ ఉన్నప్పటికీ ప్రతి అవసరానికి వెబ్‌సైట్‌ ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ వెబ్‌సైట్‌, బ్లాగ్‌ అంటే ఒక అర్థాన్ని ఇస్తాయి. కానీ వాటిని ఉపయోగించే విధానం బట్టి అవి వేరు, వేరుగా ఉంటాయి. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు బ్లాగ్‌ను ఓపెన్‌ చేస్తున్నారు. కానీ బ్లాగ్‌లు మాత్రం నెటిజన్స్‌కు చేరకుండానే, అంతగా ప్రాచుర్యాన్ని పొందకుండానే ఉంటున్నాయి. బ్లాగ్‌ను నిర్వహించడం వల‌న అనేక లాభాలు ఉన్నాయి. అయితే ఈ బ్లాగ్‌ను పాపుల‌ర్‌ చేసుకోవడం ద్వారా డబ్బులు పొందడం కానీ లేదా పేరు పొందడం కానీ జరుగుతుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు మొదు పెట్టిన బ్లాగు అలాగే ఉంటే ప్రయోజనం లేదు. అందుకే కంప్యూట‌ర్స్ ఫ‌ర్ యు పాఠ‌కుల కోసం బ్లాగును పాపుల‌ర్‌ చేసుకోవడం గురించిన ప‌లు విష‌యాల‌ను ఇక్క‌డ అందిస్తున్నాం.

బ్లాగుల‌ పరిస్థితి మరీ ఘోరంగా అవుతుంది. అనేక మంది నెటిజన్స్‌ ఆన్‌లైన్‌లో తమకు తెలిసిన అంశాల‌ను షేర్‌ చేసుకోవాని బ్లాగుల‌ను ప్రారంభిస్తున్నారు. కానీ వీటిలో 80 శాతం మేరకు బ్లాగులు అనతి కాలంలోనే ఎటువంటి డేటా లేదా అప్‌డేట్స్‌ లేకుండానే మూల‌న పడుతున్నాయి. ఆన్‌లైన్‌లో లైవ్‌గా చక్కటి ఉపయోగపడే సమాచారాన్ని అందించే బ్లాగర్స్‌ చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి.

వెబ్‌సైట్‌ బ్లాగు గురించి …
ఒక సంస్థ తమకు సంబందించిన సమాచారాన్ని అందిస్తే అది వెబ్‌సైట్‌ అవుతుంది. ఆన్‌లైన్‌లో పలు రకాల‌ సర్వీస్‌ల‌ను అందించే వాటిని కూడా వెబ్‌సైట్స్‌ అని పిలుస్తాం. ఉదాహరణకు ఫేస్‌బుక్‌ ద్వారా అనేక మంది కనెక్ట్‌ అవుతూ డేటాను ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇది ఆన్‌లైన్‌ సర్వీస్‌ను అందించే ఒక వెబ్‌సైట్‌. అలాగే యుట్యూబ్‌ కూడా ఒక వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌. సెర్చింగ్‌ సౌకర్యాన్ని అందించే గూగుల్‌ కూడా ఒక వెబ్‌సైట్‌. ఇలా అనేక వెబ్‌సైట్స్‌ ఆన్‌లైన్‌లో నెటిజన్స్‌కు కావాల్సిన అనేక రకాల‌ సర్వీస్‌ల‌ను నిత్యం అందిస్తూనే ఉన్నాయి. వెబ్‌సైట్‌లో కూడా నెటిజన్స్‌తో ఇంటరాక్షన్‌ ఉంటుంది. రెండు విదాలుగా కూడా కమూన్యికేషన్‌ ఉంటుంది. వీటినే డైన‌మిక్ వెబ్‌సైట్స్ అని పిలుస్తారు. అదే స్టాటిక్ వెబ్‌సైట్స్‌లో అయితే కేవ‌లం అక్క‌డ ఉన్న పేజీల‌ను చూడ‌టం లేదా చ‌ద‌వ‌డం వ‌ర‌కు మాత్ర‌మే. అంటే ఏదేని స‌మాచారంతో కూడిని పేజీలు ఉంటాయి. ఇటువంటి వెబ్‌సైట్స్‌లో యూజ‌ర్‌తో ఎటువంటి ఇంట‌రాక్ష‌న్ ఉండ‌దు.

బ్లాగ్‌ విషయానికొస్తే …
ఒక అంశంపైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇస్తూ .. పది మందిని కూడా బ్లాగ్‌లో ఇంటరాక్ట్‌ అయ్యేలా చేస్తూ ఒక వెబ్‌సైట్‌ని నిర్వహిస్తూ ఉంటే దాన్ని బ్లాగ్‌ అని పిలుస్తాం. ఈ బ్లాగ్‌లు అనేవి 2003 నుంచే ప్రారంభమైన గత 5 సంవత్సరాలుగా బాగా వాడుకలోకి వచ్చాయి. అనేక మంది నెటిజన్స్‌ వారికి అవగాహన ఉన్న వాటిపై ఒక బ్లాగ్‌ను ప్రారంభించి నాలెడ్జిని షేర్‌ చేస్తున్నారు. ఉదాహరణకు మీకు టెక్నాజీపై అవగాహన ఉంటే టెక్నాజీ బ్లాగ్‌ను నిర్వహించండి. ఆన్‌లైన్‌లో టెక్నాజీ బ్లాగ్‌ను నిర్వహిస్తూ అనేక మంది డబ్బులు సంపాదిస్తున్నారు. వీరినే బ్లాగర్స్‌ అని కూడా పిలుస్తారు. ఒక వెబ్‌సైట్‌ రూపంలో చక్కగా నిర్వహించే వాటిని బ్లాగు అని పిలుస్తారు. వీటి కోసం మనం కొంత ఖర్చు చేయాలి. వీటినే పెయిడ్‌ బ్లాగుల‌ని పిలుస్తాం. అంటే వీటి కోసం వెబ్‌సైట్‌ని రిజిష్టర్‌ చేయడం, ఆన్‌లైన్‌లో కొంత స్పేస్‌ను తీసుకోవడం వంటివి చేయాలి.

ఉదాహరణకు టెక్నికల్‌ సమాచారంతో నిర్వహించే “labnol.org” అనేది ఒక టెక్నికల్‌ బ్లాగ్‌. దీని కోసం పెద్ద మొత్తంలో స్పేస్‌ తీసుకోవడం వ్లనే డేటాను పెడుతూ ఉన్నాడు. బ్లాగ్‌ పేరు ఒక వెబ్‌సైట్‌ తరాహాలో ఎటువంటి ఎక్స్‌టెన్షన్‌ లేకుండా ఉంది. అదే ఉచితంగా బ్లాగు కావాలంటే “WordPress, blogspot, blogger” … వంటి వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి క్రియేట్‌ చేసుకోవాలి. వీటినే ఉచిత బ్లాగ్స్‌ అంటారు. ఇవి అయా సంబందిత వెబ్‌సైట్స్‌ పేరును ఎక్స్‌టెన్షన్‌గా కలిగి ఉంటాయి. ఉదాహరణకు computers.word press.com … వంటివి. వెబ్‌సైట్‌, పెయిడ్‌ బ్లాగ్‌, ఉచిత బ్లాగ్‌ .. వంటి వాటి గురించి ఇప్ప‌టికే మీకు అవ‌గాహ‌న ఉండి ఉంటుంది. ఇవి బేసిక్‌ అంశాలు. తెలియని అంశం ఏమిటంటే మనం ఒక బ్లాగ్‌ను తయారు చేసే ముందు దాని ప్రాచుర్యాన్ని పొందేలా చేసుకోవడం ఎలాగో కూడా తెలిసి ఉంటే చాలా మంచిది. దీని కోసం ఇక్కడ అనేక అంశాల‌ను అందిస్తున్నాం. బ్లాగును పాపుల‌ర్‌ చేయాలంటే ఒక కమిట్‌మెంట్‌తో కష్టపడితే సాధించగలం. దీని కోసం ఎక్కువ కాలం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 6 నెల పాటు శ్రమిస్తే సరిపోతుంది.

బ్లాగును పాపుర్‌ చేసుకోవడం ఎలా …
ఒక వ్యక్తి లేదా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది తమకు తెలిసిన అంశంపైన డబ్బు సంపాదించాల‌ని లేదా ఆన్‌లైన్‌లో గుర్తింపు పొందాల‌ని ఒక బ్లాగ్‌ను మొదలుపెడతారు. దాన్ని వీలైనంత త్వరగా ప్రాచుర్యాన్ని పొందలే చేయడం కూడా ఒక తెలివితో కూడుకున్న పని. బ్లాగుని మొదలు పెట్టే ముందుగా మనం ఒక వెబ్‌సైట్‌ని రిజిష్టర్‌ చేసుకోవాలి. (ఉచితంగా అందించే బ్లాగింగ్‌ సైట్స్‌లో అక్కౌంట్‌ తీసుకోవద్దు. ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌లాగా ఉంటేనే మంచిది) వెబ్‌సైట్‌ నేమ్‌ని తీసుకున్న తర్వాత, సర్వర్‌ స్పేస్‌ని కూడా తీసుకుంటే మంచిది. ఇవి సాదారణంగా జరిగే పనులు. కంప్యూటర్స్‌ ఫర్‌ యు సంస్థ ద్వారా కూడా వెబ్‌సైట్‌ని రిజిష్టర్‌ చేసుకోవడం, సర్వర్‌ స్పేస్‌ తీసుకోవడం చేయవచ్చు. మీరు ఏదేని ఒక విభాగంలో బ్లాగ్‌ని ప్రారంబించిన తర్వాత మీ బ్లాగ్‌ ప్రాచుర్యాన్ని పొందడానికి అనేక రకాల చర్య‌లు చేపట్టాలి.
ఉదాహరణకు మీరు అట‌ల‌ గురించి ఒక బ్లాగుని ప్రారంభిస్తే, నెటిజన్స్‌లో అనేక మంది ఈ బ్లాగ్‌ని చూసేలా, ఆన్‌లైన్‌లో ఇటువంటి బ్లాగ్ ఉన్న‌ట్టు ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఆన్‌లైన్‌లో మీ బ్లాగ్‌ని ప్రాచుర్యాన్ని పొందేలా చేయడమెలాగో తొసుకుందాం.

బ్లాగింగ్‌ని ప్రారంబించిన తర్వాత …
మీరు ఒక బ్లాగ్‌ని ప్రారంభించిన తర్వాత అనేక విషయాను షేర్‌ చేసుకుంటూ బ్లాగ్‌ పదిమందికి చేరేలా కృషి చేస్తుంటారు. మీరు బ్లాగ్‌ నిర్వహణలో తప్పుడు ట్రాక్‌లో పడేలా చూసుకోకూడదు. ఉదాహరణకు మీరు బ్లాగింగ్‌ చేసే క్రమంలో పోటీని తట్టుకోలేక .. అలాగే సరైన సమాచారాన్ని ఇవ్వలేక పోవడం వల‌న మీ బ్లాగ్‌కు రీడర్‌షిప్‌ తగ్గిపోతుంది. ముఖ్యంగా మార్కెట్‌కు తగ్గ విధంగా మీ బ్లాగ్‌ ఎవరి కోసం ప్రారంభించారో వారికి అవసరమైన అంశాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్‌డేటెడ్‌గా ఉంటూ అనేక విషయాలు నిత్యం పోస్ట్‌ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు రేసులో ముందంజలో ఉంటారు. లేదంటే ఒకసారి వెనుకపడితే అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్లాగింగ్‌ను మొదు పెట్టే ముందే సక్సెస్‌ఫుల్‌ బ్లాగర్‌ మారాంటే పాటించాల్సినవి ఏమిటి …?

పేరు క్యాచీగా ఉండాలి …
బ్లాగ్‌కోసం మీరు రిజిష్టర్‌ చేసే పేరు క్యాచీగా ఉండాలి. సింపుల్‌గా ఉంటూనే సులువుగా ఇతరులు స్పెల్‌ చేసేలా, గుర్తు పెట్టుకునేలా ఉండాలి. పదాలు యూనివర్సల్‌గా ఉంటే మంచిది. పొడగాటి పేర్లు, ఆసక్తి కల్గించని, వాడుకలో లేని పదాల‌ను ఉపయోగించకూడదు. బ్లాగ్‌ పేరు క్యాచీగా ఉండాలి. మీరు దేని కోసం బ్లాగ్‌ని ప్రారంబిస్తున్నారో, అ విభాగానికి సంబందించిన పదాలు అయి ఉంటే బాగుంటుంది. అదే విధంగా అవి కూడా కీల‌కమైన కీవర్డ్‌లుగా ఉంటే మరీ మంచిది. తద్వారా “Search Engine Optimization (SEO) work” కొంతలో కొంత తగ్గుతుంది. క్యాచీ పదాల‌ ద్వారా సెర్చిఇంజన్‌ మీ వెబ్‌సైట్‌ని మొదటి పేజీలోనే డిస్‌ప్లే చేసే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా మీ బ్లాగ్‌ అనేక మందికి చేరేలా ఉంటుందని గ్రహించగరు.

బ్లాగ్‌ లోగో …
మంచి పేరుని నిర్ణయించుకున్న తర్వాత ఏమి చేయాలి. మీ బ్లాగ్‌కు ఒక మంచి లోగో తయారు చేసుకోవాలి. లోగో కూడా మనం చేసే పనిని చాలా ప్రొఫెషనల్‌గా తెలియచేసేలా ఉండాలి. లోగో డిజైన్‌ కోసం ఆన్‌లైన్‌లో పలు రకాల వెబ్‌సైట్స్‌ ఉన్నాయి. లోగో ఇతరుల‌ను కాపీ కొట్టినట్టు కాకుండా కాస్త క్రియేటివ్‌గా ఉండేలా చూసుకోవాలి.

బ్లాగ్‌లో ఉపయోగించే కల‌ర్స్‌ …
మీరు బ్లాగ్‌ని డిజైన్‌ చేయడం మొదలు పెట్టిన తర్వాత పలు రకాల‌ అంశాల‌ను పరిగణలోకి తీసుకోవాలి. పేరు, లోగోతో పాటుగా బ్లాగ్‌ డిజైనింగ్‌లో ఉపయోగించే కల‌ర్స్‌ చూడ చక్కగా ఉండాటి. బ్లాగ్‌ మొత్తం చక్కగా కన్పించేలా ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ కల‌ర్ వల‌న బ్లాగ్‌ సృష్టంగా కన్పించేలా ఉండాలి కానీ కల‌ర్‌ నెటిజన్స్‌ ఇబ్బంది పెట్టకూడదు. మనం ఎంచుకునే కల‌ర్‌ని బట్టే విజువల్‌ అప్పీల్‌ ఉంటుందనేది గ్రహించాలి. స్ట్రైకింగ్ కల‌ర్స్‌ లేకుండా చూడండి. బ్లాగ్ సింపుల్‌గా ఉండాలి. అర్టిక‌ల్‌ను సులువుగా చ‌దివేలా ఉండాలి. ఎక్క‌డి ప‌డితే అక్క‌డ యాడ్స్‌, ఇమేజ్‌లు .. వంటివి వ‌స్తూ చికాకు పెట్ట‌కుండా డిజైన్ చేసుకోవాలి.

సింపుల్‌ కానీ బెస్ట్‌గా ఉండాలి …
మన బ్లాగ్‌ సింపుల్‌గా ఉండాలి .. కానీ బెస్ట్‌గా ఉండాలి. బ్లాగ్‌లోని మొదటి పేజీలోని కొంత మంది అనేక రకాల‌ లింక్స్‌, పోటోలు, వీడియోలు ఇతర లింక్స్‌ , విపరీతంగా యాడ్స్‌ పోస్టింగ్‌ .. ఇలా చూడగానే వెగటు పుట్టేలా ఉంటుంది. ఒకేచోట విపరీతంగా మొత్తం డేటా ఉంచడం వన ఎటువంటి ప్రయోజనం ఉండదు. డిస్‌ప్లే అయ్యే హోమ్ పేజీ చక్కగా ఉండాలి. మనం నెటిజన్స్‌కు బ్లాగ్‌ ద్వారా ఏమి చెప్పానుకున్నామో దాన్నే సూటిగా సుత్తి లేకుండా తెలియచేసేలా మన పేజీలోని లింక్స్‌ ఉండాలి. అ లింక్స్‌ను నావిగేట్‌ చేస్తూ కావాల్సిన సమాచారాన్ని పొందుతూ ఉంటారు.

మ‌రిన్ని అంశాల‌ను రెండో భాగంలో తెలుసుకుందాం.

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*