Computers For You has been changed to Technology For You. Please log into new website : www.technologyforyou.org
వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో ట్యుటోరియ‌ల్స్

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఒకసారి గమనించి చూడండి. ట్రెడిషనల్‌ జరిగే ప్రతిదీ కూడా నేడు సమాంతరంగా ఆన్‌లైన్‌లో కూడా జరిగి తీరుతుంది. ఒక విధంగా సమస్థం … ఆన్‌లైనే అనే పద్దతిలో నేడు పనులు సాగుతున్నాయి… మనిషి దైనందిన జీవితం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌కు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఆన్‌లైన్‌లో కీలకమైన వెబ్‌సైట్స్‌లో… వెబ్‌ డెవలప్‌మెంట్ ముఖ్యమైనది. వెబ్‌సైట్ డెవ‌ల‌ప్‌మెంట్ అనేది నేడు చాలా మంచి కెరీర్‌గా చెప్పవచ్చు. వెబ్‌సైట్ తయారీలో మీరు మంచి ప్రావీణ్యాన్ని పొందాలంటే డిజైనింగ్‌ .. లేటెస్ట్‌ వెబ్‌ టెక్నాలజీల వినియోగం… కోడింగ్‌ను ప్రేమించడం… వంటివన్నీ ఉండాల్సిందే. ఇటీవ‌ల సిఎంఎస్‌ టూల్స్‌ వినియోగంలోకి రావడంతో కాస్త టెక్నికల్‌ పరిజ్ఞానం ఉంటే వెబ్‌సైట్స్‌ను సులువుగా డెవలప్‌ చేసే వీలుంది. వెబ్‌డెవలప్‌మెంట్‌లోకి వెళ్లాలంటే … సిఎంఎస్‌ టూల్స్‌ గురించి తెలిసి ఉండటం , html ,css, Asp.Net, PHP, Java, Jquery.. వంటి వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ టూల్స్‌లో మంచి పరిజ్ఞానం ఉండాలి. వీితో పాటుగా ఫోటోషాప్ వంటి ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఆన్‌లైన్‌లో అనేక రకాల ట్యుటోరియల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ గురించి కూడా మంచి వెబ్‌సైట్స్ అనేక‌ ఉపయోగపడే ట్యుటోరియల్స్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. పూర్తిగా బిగినర్‌గా కాకుండా కాస్త కంప్యూటర్‌ పరిజ్ఞానం, డిజైనింగ్‌పై అసక్తి, క్రియేటివిటీ ఉంటే … మీరు మంచి వెబ్‌ డెవలపర్‌గా మారే వీలుంది. దీని కోసం ఉపయోగపడే పలు రకాల వెబ్‌సైట్స్ గురించి…

W3SCHOOLS.COM
ప్రొగ్రామర్స్‌ , నాన్‌ ప్రొగ్రామర్స్‌కు ఉపయోగపడే చక్కి వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్ ద్వారా html ,html5, css, Asp.Net, PHP, Java script, MVC, Jquery .. వంటి లాంగ్వేజీలను నేర్చుకోవచ్చు. వెబ్‌ డెవలప్‌మెంట్ కొత్తగా వస్తుంటే ఈ వెబ్‌సైట్ ద్వారా వెబ్‌ ప్రొగ్రామింగ్‌ను సులువుగా నేర్చుకునే వీలుంది.
LYNDA.COM
మీరు బిగినర్‌, ఇంటర్మీడియ్‌ యూసర్‌, అడ్వాన్స్‌డ్‌ ప్రొగ్రామర్స్‌… ఇలా ఎవరైనా కానీ వెబ్‌ప్రొగ్రామింగ్‌ నేర్చుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌ ఉపయోగపడుతుంది. అన్ని రకాల ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజీలకు చెందిన ట్యుటోరియల్స్‌ ఇందులో లబిస్తాయి. గేమ్స్‌ను డెవలప్‌ చేయడం, అండ్రాయిడ్‌, ఐఓఎస్‌ అప్లికేషన్‌ను డెవలప్‌ చేయడం…వంటివి కూడా ఇక్కడే నేర్చుకునే వీలుంది. ఇందులో కొంత వరకే ఉచితం. చాలా వరకు కోర్సులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
TEAMTREEHOUSE.COM
వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌కు సంబందించిన కంటెంట్‌ ఇందులో పెద్ద మొత్తంలో లబిస్తుంది. కోడింగ్‌ ట్యుోరియల్స్‌తో పాటుగా క్వశ్చన్‌ & అన్సర్స్‌తో కూడిన ఫోరమ్స్‌ కూడా ఉంటాయి. ట్యుటోరియల్స్‌ కోసం కొంత డబ్బులు చెల్లించాలి. బిగినర్స్‌ కోసం ఉచితంగా కూడా సమాచారం అందిస్తున్నారు. వెబ్‌డిజైనింగ్‌,వెబ్‌ డెవలప్‌మెంట్‌, ఐఓఎస్‌ & అండ్రాయిడ్‌ యాప్స్‌ డెవలప్‌మెంట్‌కు సంబందించిన ట్యుటోరియల్స్‌ అన్నీ కూడా ఇందులో లబిస్తాయి.
CODESCHOOL.COM
వెబ్‌సైట్ తయారీలో ముఖ్యమైన కోడింగ్‌ను నేర్పించే అనేక కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వెబ్‌డెవలప్‌మెంట్‌కు సంబందించిన వీడియో ట్యుోరియల్స్‌, స్క్రీన్‌షాట్స్‌, కోడింగ్‌ చాలెంజెస్‌…వంటివన్నీ కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా నేర్చుకునే వీలుంది.
CODEACADEMY.COM
ఈ వెబ్‌సైట్ ద్వారా వెబ్‌డెవలప్‌మెంట్‌ నేర్చుకోవడమే కాకుండా వెబ్‌ అప్లికేషన్స్‌ను డెవలప్‌ చేయడం కూడా నేర్చుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ మాధ్యమంగా మనం కూడా ఇతరులకు వెబ్‌డెవలప్‌మెంట్‌ను నేర్పించే వీలు ఉంది. వెబ్‌ ప్రొగ్రామింగ్‌ను అందించే బెస్ట్ వెబ్‌సైట్స్‌లో ఇది ఒక‌టి.
PLURALSIGHT.COM
వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌కు సంబందించిన ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజీలను నేర్చుకోవడంలో ఈ వెబ్‌సైట్ సహకరిస్తుంది. ఈ సైట్ ద్వారా మనం కూడా శిక్షణను ఇవ్వాలనుకుంటే ఇచ్చే వీలుంది. వెబ్‌కు సంబందించిన సైట్‌ డెవలప్‌మెంట్ అలాగే యాప్‌ డెవలప్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్ .. వంటి వాటిని ఇక్కడ సులువుగా నేర్చుకోగలం. ఇక్కడ శిక్షణను తీసుకోవడం ద్వారా వెబ్‌ & మొబైల్‌ డెవలపర్స్‌కూడా తయారు కాగలరు.

నోట్ : నేడు వెబ్‌సైట్స్‌తో పాటు మొబైల్స్ కంప్యూంటింగ్‌ ను (స్మార్ట్‌ఫోన్స్‌,ట్యాబ్లెట్స్‌) దృష్టిలో పెట్టుకుని కూడా మనం శిక్షణను తీసుకోవాలి. అనేక యాప్స్‌ అలాగే మొబైల్‌ కంపాటబులిటీ వుండే విధంగా వెబ్‌సైట్స్‌ను తయారు చేయడం చాలా ముఖ్యం.రానున్న రోజులో దీనికి మంచి డిమాండ్‌ ఉన్న కారణంగా దీనిపై దృష్టి పెట్టగలరు.
MOZILLA DEVELOPER NETWORK.COM
ఓపెన్‌సోర్స్‌లో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన బ్రౌజర్‌ మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌. ఒక వెబ్‌సైట్‌ను పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేది ఫైర్‌ఫాక్స్‌ మాత్రమే. వెబ్‌లో మన అవసరాలకు తగ్గ విధంగా శిక్షణను ఇవ్వడంలో మోజిల్లా డెవలపర్ నెట్‌వ‌ర్క్‌ ఉపయోగపడుతుంది. వెబ్‌డెవలప్‌మెంట్‌కు సంబందించిన పెద్ద మొత్తంలో డాక్యుమెంట్స్‌, డెమోలు, పలు రకాల టాపిక్స్‌ ద్వారా సులువుగా వెబ్‌సైట్‌ను డెవలప్‌ చేయగలరు. వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌తో పాటుగా … ఒక వెబ్‌సైట్‌ను ఎలా బ్రౌజర్‌ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దగలమో కూడా నేర్చుకోగలం.
NET.TUTSPLUS.COM
వెబ్‌డిజైనింగ్‌లో ఉపయోగపడే పలు రకాల ట్యుటోరియల్స్‌ ఇందులో అందుబాటులో ఉన్నాయి. php, jquery, wordpress … వంటి ట్యుటోరియల్స్‌ను ఈ వెబ్‌సైట్ ద్వారా పొందగలం. వెబ్‌డిజైనింగ్‌లో ఉపయోగపడ సమాచారం పెద్ద మొత్తంలో ఇందులో లబిస్తుంది. ప్రత్యేకంగా php, jquery నేర్చుకోవాలనుకునే వారికి ఈ వెబ్‌సైట్ బాగా ఉపకరిస్తుంది. వెబ్‌డెవలప్‌మెంట్‌లో పిహెచ్‌పి చాలా కీలకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
SITEPOINT.COM
వెబ్‌ డెవలప్‌మెంట్‌కు సంబందించిన ట్యుటోరియల్స్‌ ఈ వెబ్‌సైట్ ద్వారా సులువుగా పొందగలరు. ఇందులో వీడియో ట్యుటోరియల్స్‌తో కూడిన లైబ్రరీ ఉంటుంది. HTML5, CSS3, WordPress, PHP, Ruby on Rail (ROR) … వంటి వెబ్‌డెవల‌ప్‌మెంట్ టూల్స్‌ను ఈ సైట్‌ ద్వారా సులువుగా నేర్చుకోగలం.
Tutorials Point
పేరులో ఉన్నట్టుగానే వెబ్‌డెవలప్‌మ్‌ెంతో పలు ఇతర సాఫ్ట్‌వేర్స్‌కు సంబందించిన సమాచారం పెద్ద మొత్తంలో ఈ వెబ్‌సైట్ ద్వారా పొందగలం. Asp.net, php, jsp, spring, jquery, python,ruby, ajax, mysql, struts, unix, javascript, sigma, soap, uddi, html5, css … వంటి వాటితో పాటుగా 20 రకాల ఇతర లాంగ్వేజీలకు సంబందించిన ట్యుోరియల్స్‌ కూడా ఇందులో లబిస్తాయి. సింపుల్‌గా, సులువుగా ట్యుటోరియల్స్‌ నేర్పించడంలో ఈ వెబ్‌సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వెబ్‌ డెవలప్‌మెంట్‌కు సంబందించిన మాన్యువల్స్‌, రెఫరెన్స్‌లను కూడా పొందగలం.

News Reporter
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out this magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *