సోష‌ల్ మీడియాను ఇలా ఉప‌యోగించండి..! బేసిక్స్ – పార్ట్ 2

మార్కెటింగ్ చేసుకోవ‌డానికి అనేక మార్గాలు …
ముఖ్యంగా కనిపించే యుట్యూబ్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లస్‌, లింక్‌డ్ ఇన్‌, ట్విట్ట‌ర్‌… వంటి వాటిలో మీరు అక్కౌంట్ క్రియేట్ చేసుకుంటారు. మ‌నం ఈ అక్కౌంట్స్‌ను నిర్వ‌హించే ఓపిక ఉంటే అన్నింటిలోను అక్కౌంట్స్ క్రియేట్ చేసుకోవ‌చ్చు. యుట్యూబ్‌లో అయితే త‌ప్ప‌కుండా మీ వ‌ద్ద వీడియో కంటెంట్ ఉండాలి. మీ సోష‌ల్ మీడియా అక్కౌంట్స్‌ను ఆఫ్‌లైన్‌లో ప్ర‌మోట్ చేసుకోవడంతో పాటుగా ఆన్‌లైన్‌లో కూడా ప్ర‌మోట్ చేసుకోవాలి. సోషల్‌ మీడియా పేజిలతో పాటుగా ప్రతి ఒక్కరు బ్లాగ్‌ లేదా వెబ్‌సైట్‌ను కూడా కలిగి ఉంారు. వీటి ద్వారా కూడా మార్కెటింగ్ చేసుకోవాలి. మీ ఫేస్‌బుక్‌ పేజి లింక్‌ని వెబ్‌సైట్స్‌లో కూడా ఉంచాలి. వెబ్‌సైట్స్‌లో నేరుగా లింక్‌తో పాటుగా మీ ఫేస్‌బుక్‌ పేజిని ఎంతమంది లైక్‌ చేసారో తెలియచేస్తుంది. ఇక్కడ క్లిక్‌ చేస్తూ ఫేస్‌బుక్‌ పేజికి వెళ్లుతుంది. ఈ విధంగా ప్రతి వెబ్‌సైట్‌లోను ఉంచవచ్చు. అలాగే యుట్యూబ్‌లో ఉంచిన వీడియోల లింక్‌ను ఇక్కడ కూడా ఉంచవచ్చు. వీటిని క్లిక్‌చేయడం ద్వారా యుట్యూబ్‌లోని మన చానల్‌కు వెబ్‌సైట్ నుంచి వెళ్లడం జరుగుతుంది.

అయా వెబ్‌సైట్స్‌లోను మార్కెటింగ్ చేసుకోవ‌డం…
ఫేస్‌బుక్‌ లేదా ఇతర వెబ్‌సైట్స్ యూసర్స్‌ అక్కడే ఉంటారు… కావున మనం అయా వెబ్‌సైట్స్‌లో ముందుగా మార్కెట్ చేసుకోవాలి. ఫేస్‌బుక్‌లో అనేక గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీ పేజి గురించి ప్రమోట్ చేసుకోవాలి. ఉదాహరణకు తెవికీ తరుపున ఒక గ్రూప్‌ ఉంది. ఇందులో తెలుగు వికీపీడియాను లైక్‌ చేసేవారు మెంబర్స్‌గా ఉంటారు. ఇందులో పోస్ట్‌ చేయడం ద్వారా మీ పేజి అందులో ఉండేవారికి తెలుస్తుంది. ముఖ్యంగా అప్‌డేట్స్ లేదా పోస్ట్‌లు అనేవి ప్రతి రోజు ఉండాలి. అప్పుడే పేజికి వేల్యూ పెరుగుతుంది. ఫేస్‌బుక్‌లో అనేక గ్రూప్స్‌ ఉన్నాయి. కావున అక్కడకి వెళ్లి మీపేజి గురించి తెలియచేయాలి. ఇష్టమున్న వారు పేజిని చూడటం జరుగుతుంది. నచ్చిన వారు లైక్‌ చేస్తారు.

వ్యక్తిగతంగా క్రియేట్ చేస్తుంటే యాడ్‌ ఫ్రెండ్‌ ఆప్షన్‌ ఉంటుంది. అలా కాకుండా లైక్‌ అప్షన్‌ను (సంస్థ పేజిలకు) ఉంచవచ్చు. అలాగే క్రియేట్ చేసే గ్రూప్స్‌కు జాయిన్‌ గ్రూప్స్‌ అని ఉంచాలి. ఒకసారి వీటిలో మనం జాయిన్‌ అయితే మన టైమ్‌లైన్‌లో వీరి పోస్టింగ్స్‌ కన్పిస్తూ ఉంటాయి.

వీటిలో ఎలా చేసుకోవాలి …
యుట్యూబ్‌లో వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఉండాలి. గూగుల్‌ ప్లస్‌, ఫేస్‌బుక్‌లలో ఏవేని పోస్ట్‌ చేస్తూ ఉండవచ్చు. (వీడియో, ఇమేజ్‌, టెక్స్‌ట్‌…ఇలా ఏదైనా) యుట్యూబ్‌లో సంస్థ పేరు మీద అక్కౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. దీనినే యుట్యూబ్ చాన‌ల్‌ను క్రియేట్ చేయ‌డం అంటారు. యుట్యూబ్‌ చానల్‌ ఎర్పడిన వెంటనే దాని కింద వీడియోలను అప్‌లోడ్‌ చేస్తూ ఉండాలి. వీడియోకు సంబందించిన వివరణను కూడా అక్కడే ఇవ్వవచ్చు. వీడియోలను చూసిన వారు కామెంట్స్‌ను కూడా ఇస్తుంటారు. యుట్యూబ్‌లో రెగ్యులర్‌గా ఉపయోగపడే వీడియోలను పోస్ట్‌ చేయడం వలన అయా వీడియోలకు వచ్చే వ్యూస్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ చానల్‌లను ఇతర సోషల్‌ మీడియా పేజిలలోను, అలాగే వెబ్‌సైట్స్‌, బ్లాగ్‌లలో కూడా మార్కెట్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ పేజి కానీ,యుట్యూబ్‌ చానల్‌కానీ మొదలు పెట్టిన తర్వాత వీటిని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నిరంతరం ప్రచారం చేస్తూ ఉండాలి. మీ సెల్‌నంబర్‌ మీకు తెలిసిన వారందరికి ఇస్తూ ఉంటారు కదా. అలాగే ప్రతి చోట అయా సోషల్‌ మీడియా పేజిల లింక్స్‌ను కూడా అందరికీ తెలిసేలా ప్రమోట్ చేసుకోవాలి. మీరు పబ్లిష్‌ చేసే విజింగ్‌ కార్డులలో కూడా ఇవి ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా ప్రసంగాలలో కూడా మీ పేజి గురించి తెలియ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేసే ముందు మీరు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం పేజిలలో కంటెంట్ ఉండాలి. నిరంతరం కంటెంట్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే యూసర్‌ లైక్‌ చేస్తాడు… దాని వలన మీ సమాచారం అతనికి చేరుతూ ఉంటుంది.

ఈ పదింటింని గుర్తు పెట్టుకొండి …
1. సోషల్‌ మీడియా ద్వారా మీరు మార్కెటింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ చెప్పే ఈ పది విషయాలు మీరు గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే మీ సోషల్‌ మీడియా మార్కెంటింగ్ సక్సెస్‌వైపు దూసుకెళ్ళుతుంది.
2. ముందుగా మీరు గోల్‌ నిర్ణయించుకోవాలి. ఒక నెలలో ఒక ప‌దివేల‌ లైక్‌లు మీ పేజికి రావాలంటే దానికి తగ్గ ప్రణాళిక చేసుకోవాలి. అంటే ఆన్‌లైన్‌ & ఆఫ్‌లైన్‌లో ప్ర‌మోట్ చేయడం. సోషల్‌ మీడియా పేజితో పాటుగా బ్లాగ్‌, వెబ్‌సైట్స్ కూడా తప్పకుండా ఉండాలి.
3. ముఖ్యంగా సోషల్‌ మీడియా పేజిలో రెగ్యులర్‌ అప్‌డేట్స్‌తో పాటుగా మీరిచ్చే కంటెంట్ 100 శాతం తప్పులు లేకుండా ఉండాలి.
అలాగే సోషల్‌ మీడియాలో ఎవరితోను శత్రుత్వం లేకుండా రిలేషన్‌షిప్స్‌ను పెంచుకుంటూ పోవాలి.అప్పుడే మీరు మంచిగా మార్కెట్‌ చేస్తున్నట్టు.
4. మీ కస్టమర్స్‌, మెంబర్స్‌ ఎక్కడ ఉన్నారో గుర్తించాలి. అక్కడికే మీరు వెళ్లాలి. ఇంటర్నెట్‌ గ్లోబల్‌గా మార్కెట్‌ ఇస్తుంది కావున మీరు ఎక్కడికైనా సులువుగా వెళ్లతారు. ఇందులో బాగంగా మీరు ఇమెయిల్ మార్కెటింగ్ ను కూడా ఉపయోగిస్తూ మీ సోషల్‌ మీడియా పేజిలను ప్ర‌మోట్ చేస్తూ ఉండాలి.
5. యుట్యూబ్‌లోను, ఫేస్‌బుక్‌లోను, గూగుల్‌ ప్లస్‌లోను, ట్విట్ట‌ర్‌లోను… ఇలా ఎందులోనైనా మీరు పేజి క్రియేట్ చేశారు. ఈ సోషల్‌ మీడియా పేజి లింక్‌ను మీ పేరు చెప్పినట్టుగానే మీరు అందరికీ చెబుతూ ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే పోన్ నంబ‌ర్ ఇచ్చిన‌ట్టే దీని గురించి కూడా చెపుతూ ఉండాలి. లేకపోతే లైక్‌లు ఎక్కడినుంచి వస్తాయి చెప్పండి. మీరు పంపే మెయిల్స్‌లో ఇది కూడా మీ సెల్‌ఫోన్‌ నంబర్‌ మాదిరిగానే కింద ఉండాలి. న్యూస్‌లెటర్స్‌లోను విజింగ్‌ కార్డులలోను అలాగే మీ లెటర్‌హెడ్స్‌లోను…ఇలా ప్రతి చోట ఉండాలి. ముఖ్యంగా వెబ్‌సైట్స్ బ్లాగ్‌లను నిర్వహిస్తుంటే వాటిలోకూడా వీటిని ప్రమోట్ చేసుకోండి. అలాగే అ వెబ్‌సైట్‌ను కూడా ఈ సోషల్‌ మీడియా పేజి ద్వారా ప్ర‌మోట్ చేసుకునే వీలుంది.
6. నీవు సోషల్‌ మీడియాలో ఎక్కడ ఉన్నావో పదిమందికి తెలిసేలా ప్రణాళిక చేసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా చేసే కంటే ముందు పేజి చక్కగా ఉండటమే కాకుండా మంచి సమాచారంతో ఉండాలి. లేదా నిరంతరం పోస్ట్‌ చేస్తూ ఉంటే కొంత కాలానికి అ డేటా కూడా ఎక్కువగా ఉంటుంది…కావున విజిటర్స్‌ చూడానికి డేటా (కంటెంట్‌) కన్పిస్తుంది. ఆసక్తికరమైన డేటాను ఉంచే ప్రయత్నం చేయాలి.
7. సోషల్‌ మీడియాలో గ్రూపులు ఉంటాయి. అక్కడి గ్రూపులలో జాయిన్‌ అవుతూ ఉండాలి. అక్కడి పోస్ట్‌లు పోస్ట్ చేస్తూ ఉండాలి. కామెంట్స్ చేస్తూ యాక్టివ్‌గా ఉండాలి. ఎక్స్‌పర్ట్‌లతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. ఆలాగే మీరు ఒకదాని ప్రమోట్ చేయ‌డం కోసం మరొక దాన్ని ఉపయోగిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఫేస్‌బుక్‌లో మీ పేజిలో మీరు పోస్ట్‌ చేసిన దాన్ని ట్విట్ట‌ర్‌లోను షేర్ చేయ‌డం, గూగుల్‌ ప్లస్‌లో ఉంచడం … వంటివి చేయాలి. ఎప్ప‌టికప్పుడు మీ సోషల్‌ మీడియా పేజిలను కాస్త మారుస్తూ ఉండాలి. పోస్టింగ్స్‌లో కూడా కొత్త దనం ఉండాలి. అలాగే బ్లాగ్‌, వెబ్‌సైట్స్‌ను కూడా కాస్త చేంజ్‌ చేస్తూ ఉండాలి.
8. మీరు నిర్వహించే పేజికి సంబదించిన సమాచారమే ఉండేలా చూసుకోవాలి. కాస్త వాటికి సంబందం ఉన్న విష‌యాల‌ను కూడా పోస్ట్ చేస్తూ ఉండ‌వ‌చ్చు. కానీ సంబందం లేనివి ఉండకుండా చూసుకోవాలి. మీ పేజి సక్సెస్‌ కావాలంటే తప్పకుండా మీరు సోషల్‌ మీడియా యూసర్స్‌ను కలిసే మార్గాలు వెతకాలి. వారిని నిరంతరం మీ పేజి ద్వారా కలుస్తూ ఉండాలి. అప్పుడే ట్రాఫిక్‌ పెరుగుతుంది. ఒక పద్దతి ప్రకారం పనిచేస్తే పేజికి అనేక మంది ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకోవడం కష్టం కాదు. సచిన్‌కు ఉన్న ఫేమ్‌ కారణంగా లక్షల మంది అయన పేజిలో చేరారు. కానీ అప్‌డేట్స్‌ ఉండటం లేదు. అలాగే సినిమా యాక్ట‌ర్స్ కు అనేక మంది ఫాలోవ‌ర్స్ ఉంటారు. కానీ సినిమా యాక్ట‌ర్స్ నుంచి ఒక్క‌టి కూడా ఉప‌యోగ‌ప‌డే విష‌యం ఉండ‌దు. కానీ అదో పిచ్చితో అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు. సోషల్‌ మీడియా పేజిలను క్రియ్‌ట్ చేసిన తర్వాత ఇలా ప్రమోషన్‌ మార్గాలు వెతికేవారు తక్కువ. క్రియేట్ చేసి వదిలేస్తే ఎవరు లైక్‌ చేస్తారు. అందులో విషయం ఉండాలి కదా మరి.
9. మీ పేజి ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మీ పేజికి వచ్చే యూసర్స్‌ పలు కామెంట్స్ చేయడం, మేసేజ్‌లు పెట్టడం చేస్తుంటారు. కావున వాటికి తప్పకుండా రెస్పాన్స్‌ ఇస్తూ ఉండాలి. అభ్యంత‌ర‌క‌రంగా ఉన్న వాటిని తొల‌గిస్తూ ఉండాలి. అలాగే మీ మెంబర్స్‌కు కూడా న్యూస్‌లెటర్స్‌ పంపిస్తూ వారిని ప్ర‌మోట్ చేయమని రిక్వెస్ట్‌ చేయవచ్చు. దీంతో వారు కూడా వారి స్నేహితులకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా మనం నిర్వహించే పేజిలో మంచి కంటెంట్ ఉన్న‌ప్పుడే.
10. సోషల్‌ మీడియాలో కొన్ని లక్షల మంది పలు సోషల్‌ మీడియా పేజిలను ఫాలో అవుతూ ఉంటారు. ఇలా మీరు కూడా మీ బిజినెస్‌ను పెంచుకోవాలంటే యూసర్స్‌ లేదా ఫాలోవర్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీని కోసం ఉన్న కొన్ని మార్గాలను ఇక్కడ తెలుసుకున్నాం. అయితే వీటిని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితమైన పలితాలు వస్తాయి.
అన్నింటి కంటే ముందు పేజిని మీరు నిర్వహించగలిగే సత్తా ఉంటేనే క్రియేట్ చేసుకోవాలి. అందుకే సోషల్‌ మీడియాలో ఒక సామెత ఉంది… పేజిని క్రియేట్ చేయడం కాదు… దాని అడ్మిన్‌గా ఉంటూ నిర్వహించడం చాలా కష్టం. ఎందుకంటే మనం సరిగ్గా నిర్వహించకపోతే తప్పకుండా పేజి పాపులారిటి రాదు… ఒక వేళ వ‌చ్చినా స‌రిగ్గా నిర్వ‌హించ‌క‌పోతే త్వ‌రగా కొల్పోతుంది.

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*