సోష‌ల్ మీడియాను ఇలా ఉప‌యోగించండి..! బేసిక్స్ – పార్ట్ 1

ప్రస్తుతం సోషల్‌ మీడియా హవా నడుస్తుంది. నెటిజన్స్‌లో అత్యధిక శాతం మంది తమ బ్రౌజింగ్‌ సమయాన్ని ఇక్కడే గడిపేస్తున్నారు. ఈ క్రమంలో మనం కూడా అక్కడికే వెళ్లి మార్కెట్ చేసుకోవడం ద్వారా అభివృద్ది సాధించగలం. ప్రస్తుతం అనేక (వంద‌కు పైగానే) సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్స్‌ ఉన్నాయి. కానీ వీటిలో ముఖ్యమైనవి మ‌నం త‌రుచుగా వినేవి చాలా త‌క్కువే. వేళ్ల మీద లెక్కించ‌వ‌చ్చు. Facebook, twitter, linkedin, google plus, instagram, youtube, pinterest … మొద‌లైన‌వి.

అందరి దృష్టి సోషల్‌ మీడియాపైనే …
అనితకు స్క్రిప్ట్ రైటింగ్‌లోను, ట్రాన్స్‌లేషన్‌లోను మంచి స్కిల్స్‌ ఉన్నాయి. తనని తాను గ్లోబల్‌గా మార్కెట్ చేసుకోవాలంటే వెంటనే అందుబాటులో ఉన్నది సోషల్‌ మీడియానే. అలాగే రాజేష్‌ తాను ప్రారంబించిన సంస్థకు ప్రచారం చేయాలని తలచాడు… వెంటనే సోషల్‌ మీడియాపై దృష్టి పెట్టాడు. ఇలా ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియా ద్వారా మార్కెట్ చేసుకుంటూ గుర్తింపును పొందాలని అరాటపడుతున్నారు. అనేక వెబ్‌సైట్స్ ఉన్నప్ప‌టికీ మనకు విన్పించే ముఖ్యమైన వెబ్‌సైట్స్ కొన్నే. ముఖ్యంగా విన్పించేవి .. Facebook, twitter, linkedin, google plus, instagram, youtube, pinterest … మొద‌లైన‌వి. వీటి ద్వారానే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మార్కెట్ చేసుకుంటే మంచి ఫలితాలను పొందగలం. సోషల్‌ మీడియా ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నప్పుడు పలు విషయాలను గమనిస్తూ నేర్చుకుంటూ ఉండాలి. ఇటీవల అసోసియేషన్‌ ఆప్‌ నేషనల్‌ అడ్వర్టయిజర్స్‌ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలోని మార్కెటర్స్‌లో 90 శాతం పైగానే సోషల్‌ మీడియాను ఉపయోగించడానికే ఇష్టపడుతున్నారు. ఎటువంటి ఖర్చు లేకుండానే వేగంగా, ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకునే వీలుంది కదా.  ఏడు లేదా ఏనిమిది సంవత్సరాల క్రితం ఈ ఫిగర్‌ కేవలం 20 శాతం మాత్రమే. ఉదాహరణకు ఫేస్‌బుక్‌ని తీసుకుంటే ఇటీవల కాలంలో గ్రామాలలో కూడా ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి రావడంతో అనేక మంది ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు.

సోషల్‌ మీడియానే ఎందుకు …
ఫేస్‌బుక్‌ మొదలుకుని పిన్‌ఇంటరెస్ట్‌ వరకు సోషల్‌ మీడియాలో విహరించే నెటిజన్స్‌ అత్యధికంగా ఉంటున్నారు. సోషల్‌ మీడియా గణాంకాలు తీసుకుంటే కళ్లు తిరిగే వాస్తవాలు కనపడతాయి. అత్యధికంగా ఫేస్‌బుక్‌, యుట్యూబ్, ట్విట్ట‌ర్‌, లింక్‌డ్ఇన్‌ నెటిజన్స్‌కు బాగా చేరువ కావడం జరిగింది. మొత్తం నెటిజన్స్‌లో 90 శాతానికి పైగానే ఈ సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌ను తమ మొబైల్స్‌ ద్వారా యాక్సస్‌ చేస్తున్నారు. 50 శాతంపైగానే మార్కెటర్స్‌ ఈ సోషల్‌ మీడియావైపు చూస్తున్నారు. ఇంతగా నెటిజన్స్‌ సోషల్‌ మీడియా ద్వారానే కమ్యూనికేట్ చేస్తున్న ఈ తరుణంలో మనం కూడా అదే మీడియాను ఉపయోగించి మార్కెట్ చేసుకోవడం ఉత్తమం. అమెరికాలో 90 శాతం మార్కెటర్స్‌ దీనిపై దృష్టి పెట్టినట్టే …ఇండియాలో కూడా ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా ద్వారా మార్కెట్ చేసుకోవడం ప్రారంభించారు.

సోషల్‌ మీడియా గురించి…
ఇంటర్నెట్‌లో అనేక సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్స్‌ అందుబాటులో ఉన్నాయి. కానీ అత్య‌దిక శాతం పైన చెప్ప‌కున్న ఒక‌టి లేదా అంత‌క‌న్నా ఎక్క‌వ వాటినే ఉప‌యోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇవే ప్రాచుర్యాన్ని పొందాయి. ఇండియాలో కూడా మార్కెటర్స్ వీటి ద్వారానే మార్కెటింగ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూస్తే కేవలం యుట్యూబ్‌, ఫేస్‌బుక్‌ పేజీలు మాత్రమే మన ఇండియన్‌ మార్కెటర్స్‌ తయారు చేసుకుంటున్నారు. ఈ వెబ్‌సైట్స్ ద్వారా యూసర్స్‌ నిత్యం పలు రకాల పోస్టింగ్స్‌ను, డేటాను షేర్‌ చేసుకుంటూ ఉంటారు. డేటా
ఏ రూపంలో ఉన్నా కూడా (వీడియో, అడియో, ఇమేజ్‌, యానిమేషన్‌…మొదలైనవి) వీటి ద్వారానే షేర్‌ చేసుకుంటూ ఉంటారు. అందుకే వీటినే సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్ లేదా సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్‌ అని పిలుస్తారు. ఇక్కడంతా డేటాను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం, పరిచయాలు పెంచుకోవడం, అలాగే ఒకరికి తెలిసినది వేరొకరికి తెలిసేలా పోస్ట్‌ చేయడం, ఈవెంట్స్ గురించి, ప్రొడక్ట్‌ల గురించి…ఇలా ఏదైనా నిత్యం సోషల్‌ మీడియాలో జరుగుతూనే ఉంటుంది.

సోషల్‌ మీడియా మార్కెటింగ్ …
ఇక్కడ చెప్పుకున్న సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌లో ముందుగా అక్కౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్ర‌మోట్ చేసుకోవడానికి లేదా మీ సంస్థను ప్ర‌మోట్ చేసుకోవడానికి మీకంటూ కొన్ని పద్దతులు పాటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలి. ఇక్కడ వ్యక్తిగతంగా మనం ప్ర‌మోట్‌ కావాలంటే… మనం ఏ వెబ్‌సైట్స్‌లో అక్కౌంట్‌లో కలిగినప్పిటికీ మనకు ఎందులో స్కిల్‌ ఉందో దాని ద్వారానే ఫోకస్‌ కావాలి. మీరు సైన్స్‌లో ప్రావీణ్యం ఉంటే సైన్స్‌ పేరుతో ఒక పేజిని క్రియేట్ చేసి అందులో మీరిచ్చే డేటా లేదా పోస్ట్‌ల‌ ద్వారా మీ పేజి పాపులారిటీ పెరుగుతుంది. అప్‌డేట్స్ లేకుండా ఉంటే కూడా మన ప్రొఫైల్‌కు విజిటర్స్‌ ఉండరు. రెగ్యులర్ అప్‌డేట్స్ ఉండాలి. సోషల్‌ మీడియా అనేక భాషలను సపోర్ట్‌ చేస్తుంది. కనీసం మీరు తెలుగు, ఇంగ్లీషు, హిందీలలో పోస్టింగ్స్‌ చేసేలా రెడీగా ఉంటే మీరు మరింత వేగంగా సోషల్‌ మీడియా యూసర్స్‌కు చేరుకుంటార‌. వ్యక్తిగతంగా ఉండే యూసర్స్‌ కూడా అనేక పద్దతులు పాటించడం ద్వారా సోషల్‌ మీడియాలో ప్రాచుర్యాన్ని పొందుతారు. ఆఫ్‌లైన్‌లో కూడా ఏవేని కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ కూడా సోషల్‌ మీడియాలోని మీ ప్రొఫైల్‌ గురించి చెప్పడం ద్వారా అనేక మంది ఫ్రెండ్స్‌ జాయిన్‌ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా కాకుండా ఒక సంస్థను దృష్టిలో పెట్టుకుని మార్కెటింగ్ లో దూసుకొని పోవడం గురించి తెలుసుకుందాం. దీన్నే వ్యక్తిగతంగా కూడా అన్వయించుకోవచ్చు. కంపెనీ పేజీ స్థానంలో మీ పేజీ ఉంటుంది అంతే తేడా.
ఇక్కడ చెప్పుకున్న వాటిలో ముందుగా ఫేస్‌బుక్‌ని తీసుకుని మార్కెటింగ్ గురించి ఎలా చేసుకోవాలో చెప్పుకుందాం. మిగతా వెబ్‌సైట్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. ఫేస్‌బుక్‌ కన్పించే విదానం బాగుండటం, యూసర్‌ ఉపయోగించడానికి చాలా తేలికగా అన్పించడంతో బాగా పాపులర్ అయింది. నేడు గ్రామాల‌లో ఉన్న వారు కూడా ఫేస్‌బుక్‌లో అక్కౌంట్‌ను క్రియేట్ చేసుకుని పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ప్ర‌మోట్ చేసుకోవాలంటే అక్కౌంట్ క్రియేట్ చేసుకుని మన సంస్థ పేరు మీద పేజీని క్రియేట్ చేసుకోవాలి. ఇందులో ఉంచే డేటాను ఎప్ప‌టికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అవసరమున్న చోట ఇమేజ్‌లు వాడటం, వీడియోలు పోస్ట్‌ చేయడం…వంటి వాటి ద్వారా ఎక్కువ మంది మీ పేజిని లైక్‌ చేయడం జరుగుతుంది. అలాగే కంటెంట్‌లో కూడా మంచి నాణ్యత ఉండేలా చూసుకోవాలి. పేజిలోని ప్రొఫైల్‌ పిక్షర్‌ను మారుస్తూ ఉండటం, నిత్యం పది మందికి తెలిసేలానే ఫేస్‌బుక్‌లోనే ప్ర‌మోట్ చేస్తూ ఉండాలి. పేజిని లైక్‌ చేయడం కోసం నిరంతరం రిక్వెస్ట్‌లు పంపుతూ ఉండాలి. ఇవి చేయడానికి ముందే పేజిలో ఎప్పుడూ డేటాను చక్కగా అప్‌డేట్ చేస్తూ ఉండాలి…అప్పుడే పేజీ మంచిగా కన్పిస్తుంది. డేటాను కూడా తప్పులు లేకుండా టైప్‌ చేయడం, పోస్ట్‌ చేసే ఇమేజ్‌లు, వీడియోలలో నాణ్యత ఉండేలా చూడటం చేయాలి. ఫేస్‌బుక్‌ పేజి లోనే మార్పులు, చేర్పులు చేస్తూ పేజిని మరింత అందంగా తీర్చిదిద్దుతూ ఉండాలి. మీ పోస్ట్‌ల‌ను ఇత‌ర గ్రూప్స్‌ల‌లో పోస్ట్ చేయ‌డం అలాగే ఇత‌రుల‌కు ఇబ్బంది లేదు అనుకుంటే వారికి ట్యాగ్ చేయ‌డం వంటివి చేస్తూ ఉండాలి.
ఇవే పోస్ట్‌ల‌ను మీ వెబ్‌సైట్‌లోను పెడుతూ అక్క‌డి నుంచి సోష‌ల్ మీడియాకు కూడా షేర్ చేయాలి. ఇలాంటి అనేక బేసిక్ అంశాల‌ను తెలుసుకోవ‌డం ద్వారా సోష‌ల్ మీడియాను స‌మ‌ర్ద‌వంతంగా ఉప‌యోగించుకోగ‌ల‌రు.

About Digital For You 773 Articles
Computers For You is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Computers For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*