సోష‌ల్ మీడియాలో మీరు సేఫేనా..!

సోష‌ల్ మీడియాలో మీరు సేఫేనా..!

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్‌లో ముఖ్యంగా ఫేస్‌బుక్‌ను ఉపయోగించేవారు… పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇటీవల కాలంలో చాలా మంది సున్నిత స్వభావం కలవారు, ఈ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్‌ ద్వారా ఇబ్బందుల పడి, అక్కౌంట్‌ను డిలీట్ చేసుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి.

‘సైబర్‌’ నేరాలకు పాల్పడితే జైలే…!
సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్ లో ఇబ్బంది పెట్టే వాటిని క్లిక్‌ చేయకుండా ఉండాలి. మన అవసరం ఎంతవరకు ఉంటే అంతవరకే ఆన్‌లైన్‌ను ఉపయోగించుకోవాలి. ఆన్‌లైన్‌లో తప్పు చేస్తే.. వారిని కనిపెట్టడం కష్టం కాదు ఎందుకంటే మొత్తం నెట్‌వ‌ర్క్‌డ్ కాబ‌ట్టి సులువుగా ఎక్క‌డి నుంచి ఈ మోసాలు జ‌రుగుతున్నాయో క‌నిపెడుతుంటారు. సైబర్‌ నిపుణుల ద్వారా సైబర్‌ నేరగాళ్లను పట్టేయడం చాలా సులువు. సోషల్ నెట్‌వర్కింగ్‌ యూసర్స్‌ తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం.

అంతర్జాలం, సెల్‌ఫోన్‌లు ఉపయోగించి అసభ్య మెయిల్స్‌, బెదిరింపు లేఖలు పంపడం, ఎదుటి వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం, అభ్యంతరకర సంక్షిప్త సందేశాలు పోస్ట్‌ చేయడం, ఎదుట వారి మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడటం… ఏది చేసినా నేరాన్ని అంగీకరించినట్లే..! అదేంటి నేరం చేయడమే అనకుండా అంగీకరించినట్లే అంటున్నారు అనుకోకండి.. కంప్యూటర్‌లో అయినా, సెల్‌ఫోన్లో అయినా ఇంట‌ర్నెట్‌ను వినియోగిస్తే ఐటీ చట్టం పరిధిలో పనిచేస్తున్నట్లు. ఖ‌చ్చితంగా ఆధారాలు వంద శాతం లభ్యంగా ఉంచినట్లే, ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చాలామంది ఆకతాయిలు, అంతర్జాలమే ఆయుధంగా మోసాలకు పాల్పడుతున్నవారు జైలుపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘అంతర్జాలాన్ని’ ఎలా వినియోగించుకుంటే మనకు భద్రత ఉంటుందో నిపుణులు, యువత విశ్లేషణలతో కూడిన ప్రత్యేక వ్యాసాన్ని అందిస్తున్నాం గమనించగలరు.

ఇవన్నీ కూడా సైబర్‌ నేరాలే…
1. అసభ్యకర బెదిరింపులు, ఎదుటి వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే సంక్షిప్త సందేశాలను పంపడం, మెయిల్స్‌ను పంపడం.
2. ఫేస్‌బుక్‌లో ఇతరుల ఫోటోలతో ఖాతాలను తెరవడం. అభ్యంతరకరంగా కామెంట్లను పోస్ట్‌ చేయడం.
3. ఫోటోలను మార్ఫింగ్‌ చేయడం, వాటిని ఇతరులకు బదలాయించడం.
4. ఎదుటి వారిని ప్రలోభపెట్టి, బెదిరించి వారి నుంచి నగదు రాబట్టడానికి ప్రయత్నించడం.
5. తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించేలా సమాచారాన్ని వ్యాప్తి చేయడం.
6. అశ్లీల చిత్రాలు, వీడియో దృశ్యాలు ఇతరులకు పంపడం. ఇటువంటి పలు ఇబ్బందికర పనులకు దూరంగా వుంటే మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ …
1. మెయిల్స్‌ ద్వారా సమాచారం పంపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
2. అసభ్య, అభ్యంతరకర సమాచారాన్ని సందేశాల్ని పంపితే ఏమాత్రం సందేహం లేకుండా పట్టుబడిపోతారన్న విషయాన్ని యువత మరవొద్దు.
3. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌ చేసేవాళ్ళు పాస్‌వర్డ్‌లు ఎప్ప‌టికప్పుడు మార్చుకోవాలి. పాస్‌వర్డ్‌ను టైప్‌ చేసేటప్పుడు వర్చువల్‌ కీబోర్డును ఉపయోగించాలి. లావాదేవీ జరిగిన వెంటనే ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
4. ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్ళి మెయిల్స్‌ తెరవడం, నెట్ బ్యాంకింగ్‌ చేయడం ఏమాత్రం సురక్షితం కాదు. కోట్ల రూపాయల లాటరీ తగిలిందని.. కొద్దిమొత్తం చెల్లిస్తే ఆ నగదును సొంతం చేసుకోవచ్చని నిత్యం ఎస్‌ఎంఎస్‌లు, ఇమెయిల్స్ వస్తుంటాయి. ఇండియా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వ‌చ్చే ఇటువంటి బూటకపు సమాచారాన్ని నమ్మితే నిలుపునా మునిగినట్టే. కావున ఆన్‌లైన్‌లోను అందునా ముఖ్యంగా సోష‌ల్ మీడియాలోను చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి సుమా..!

About Digital For You 713 Articles
Technology For You (Formerly Computers For You) is a Leading Technology & Career Magazine Publishing from Hyderabad since 1999. In addition to this Web version, We have been bringing out Technology For You magazine for over 19 years (Since 1999) continuously and this is the Largest Circulated magazine in both the Andhra Pradesh and Telangana States and in addition to these States, this is being circulated in other cities like Bangalore, Chennai, New Delhi, Mumbai & Pune...etc.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*