చదువుతో పాటు నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు

August 25, 2018 Digital For You 0

డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో అపార ఉద్యోగ అవకాశాలు చదువుతో పాటు నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు స్కిల్ తో పాటు విల్ కూడా ఉండాలి రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ఉండబోతున్నాయని అమెరికాలోని ప్రముఖ సంస్థ  సామా టెక్నాలజీస్ వ్యవస్థాపక సిఈవో సురేష్ కట్టా చెప్పారు, విఐటీ-ఎపి యూనివర్సిటీలో […]

డ్రోన్ల సేవలను ఉపయోగించుకునేలా నూతన డ్రోన్లవిధానం ప్రకటిం‍చనున్నకేంద్ర ప్రభుత్వం

August 25, 2018 Digital For You 0

వ్యాపార, వాణిజ్యరంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ వినూత్న పంథాలో డ్రోన్ల సేవలను ఉపయోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ’నూతన డ్రోన్లవిధానం’ రూపొందిస్తోంది..వివిధ వ్యాపారాల్లో  వీటిని ఉపయోగించుకునేలా నూతన సాంకేతికను సిద్ధం చేసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, సైనిక వ్యవస్థలు, ప్రాముఖ్యత కలిగిన ఇతర ప్రాంతాల్లో భద్రతాపరమైన అంశాల పర్యవేక్షణ, క్రమబద్ధీకరణకే పరిమితం కాకుండా భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు […]

ఆపిల్ నుంచి త్వ‌ర‌లో లాంచ్ కానున్న మ‌రో మూడు ర‌కాల ఐఫోన్లు

August 25, 2018 Digital For You 0

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది(2018లో) మూడు రకాల ఐఫోన్లను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఎంట్రీ లెవల్‌ డివైజ్‌ను 6.1 అంగుళాల స్క్రీన్‌లో తీసుకొస్తుండగా.. ఇతర వేరియంట్లను 5.8 అంగుళాలు, 6.46 అంగుళాలలో లాంచ్‌ చేయబోతుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్లను ఆపిల్‌ ఎప్పుడు లాంచ్‌ చేస్తుందో […]

డిజిలాక‌ర్ ద్వారా మీ డాక్యుమెంట్స్‌, స‌మాచారం సుర‌క్షితంగా…!

August 19, 2018 Digital For You 0

• డిజిలాక‌ర్ కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న క్లౌడ్ స్టోరేజి. దీని యాప్ కూడా అందుబాటులోకి వ‌చ్చింది. దీని ద్వారా మీ ముఖ్య‌మైన డేటాను మొత్తం ఉచితంగా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చ‌. డిజిలాక‌ర్ గురించిన కొన్ని విష‌యాలు ఇక్క‌డ తెలుసుకుందాం. డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, ఓటర్‌ ఐడీ, పాన్, ఆధార్, విద్యా సర్టిఫికెట్లు…ఇలా ఏ గుర్తింపు కార్డు లేదా ధ్రువీకరణ పత్రానికైనా సరే మీరు ఇక […]

యూట్యూబ్‌, వాట్సాప్ … వంటి యాప్స్ ఇక జియో ఫీచ‌ర్‌పోన్‌లో కూడా ల‌బిస్తాయి.

August 19, 2018 Digital For You 0

జియో.. ఒక సంచ‌ల‌నం.. మొద‌ట‌గా ఉచితంగా అన్‌లిమిటెడ్ ఇంట‌ర్నెట్‌, కాల్స్ ..త‌ర్వాత‌ త‌క్కువ ధ‌ర‌లోనే ఇంట‌ర్నెట్ కూడా అందిస్తుంది. నెట్ స్పీడ్‌లోను కూడా ఎంతో వేగంగా జియో త‌న‌ సేవ‌ల‌ను అందిస్తుంది. జియో ఫీచ‌ర్ ఫోన్స్ కూడా అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందాయ‌ని చెప్పాలి. జియో పోన్‌లో యూట్యూబ్‌, వాట్సాప్ వంటి యాప్స్ కూడా ల‌బించ‌నున్నాయి. జియోఫోన్‌.. ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఇదో అద్భుతం. స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ యాప్స్‌ […]

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)లో కొత్త వెర్షన్‌ ‘పై’ వచ్చేసింది

August 8, 2018 Digital For You 0

టెక్నాలజీ ప్రియులకు గూగుల్‌ తీపి కబురు తెచ్చింది. తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)లో కొత్త వెర్షన్‌ ‘పై’ను మంగళవారం ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ సిరీస్‌లో ఇది తొమ్మిదవది. ప్రస్తుతం ‘ఓరియో’ ఓఎస్‌ను ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగిస్తున్నారు. సమాచార గోప్యత(ప్రైవసీ)కు సంబంధించి మరిన్ని మెరుగైన ఫీచర్లతో పాటు పలు అధునాతన అంశాలను కొత్త ఓఎస్‌లో జతచేసినట్లు గూగుల్‌ పేర్కొంది. ముఖ్యంగా ‘పై’ ఓఎస్‌లో ఆర్టిఫీషియల్‌ […]

ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌

August 7, 2018 Digital For You 0

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌ వాయిస్‌, వీడియో రెండింటికీ సపోర్ట్‌ చేస్తూ ఎట్టకేలకు లైవ్‌గా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై యూజర్లు గ్రూప్ వీడియో, వాయిస్‌ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ గతేడాది అక్టోబర్‌లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో […]

అమెజాన్‌కు పోటీగా ది బిగ్‌ ఫ్రీడం సేల్‌ ను ప్ర‌కంటించిన‌ ఫ్లిప్‌కార్ట్‌

August 7, 2018 Digital For You 0

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌కు, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ పోటీకి వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ సైతం ‘ది బిగ్‌ ఫ్రీడం సేల్‌’ను ప్రకటించింది. 72వ స్వాతంత్య్రం సందర్భంగా ఈ బిగ్‌ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ రివీల్‌ చేసింది. 2018 ఆగస్టు 10 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అయితే ఈ సేల్‌లో భాగంగా అందించే ఆఫర్లను మాత్రం […]

వివో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌ : రూ.1947కే వివో స్మార్ట్‌ఫోన్లు

August 6, 2018 Digital For You 0

వివో నెక్స్‌.. చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి వివో ఇటీవల లాంచ్‌ చేసిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటు అభిమానుల నుంచి, అటు విమర్శకుల నుంచి మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా వివో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలో భాగంగా వివో భలే ఆఫర్‌ను ప్రకటించింది. 72 గంటల పాటు అద్భుతమైన ఆఫర్లతో.. వివో ఫ్రీడం కార్నివల్‌ ఆన్‌లైన్‌ సేల్‌ను నిర్వహించనున్నట్టు […]

బ్లాక్‌చైన్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు : మంత్రి కేటీ రామారావు

August 6, 2018 Digital For You 0

టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్  :   పారిశ్రామిక విప్లవంలో డిజిటల్ విప్లవం కూడా కీలకమని  మంత్రి కేటీఆర్  చెప్పారు. సమాజానికి ఉపయోగపడని టెక్నాలజీ వ్యర్థమన్న కేటీఆర్‌.. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఐటీ పాలసీని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ పాలసీ ప్రకారం 10 రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఐటీ ఆధారిత సేవలను రోజు […]