
By Rammohan Vedantam :
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తరించడం, ఇంటర్నెట్ వాడకం పెరగడంతో, దొంగలు కూడా కష్టపడకుండా సాఫ్ట్ దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఎటిఎం లు ప్రవేశించిన తర్వాత దొంగల ఆలోచన విధానం కూడా మారింది. కొడితే జాక్పాట్ కొట్టాలనే అత్యాశతో ఈ మధ్య దొంగలు ఎటిఎం ల పై పడుతున్నారు.మీ ఎటిఎం కార్డ్ మీ చేతులలో ఉన్నప్పటికీ సొమ్ము మాత్రమే వేరే వారి చేతుల్లోకి వెళ్లుతుంది. కాలం మారిందని అంటూ వుంటాం కదా… కాలంతో పాటు మనుషులు,టెక్నాలజీ…దొంగతనాల తీరు కూడా మారుతున్నది.
దొంగతనాలు చేయడం పోలీసులకు చిక్కడం జైలు జీవితం గడిపి మళ్లీ అవే దొంగతనాలు చేసి పట్టు పడటం … ఇలా వీటి వల్ల దొంగలకు విసుగు పుట్టిందో ఏమో ఇప్పుడు వీరు కొడితే జాక్పాట్ కొట్టాలనే అత్యాశతో ఎటిఎంలపై పడుతున్నారు.మీ ఎటిఎం కార్డు మీ చేతులలో ఉన్నప్పటికీ మీ సొమ్ము మాత్రం వేరే వారి చేతుల్లోకి వెళ్లుతుంది.
ఇదెలా సాధ్యమవుతుంది …?
ఎటిఎంల లోని Swiping slot కు అమరిపోయి గుర్తించలేని విధంగా ఉండే Skimmers ని అమర్చి కార్డులోని సమాచారాన్ని తస్కరిస్తారు. పిన్ నంబర్ని తెలుసుకోవడానికి Hidden Camera లేదా కీ ప్యాడ్ కు పైన మరో కీప్యాడ్ ను అమరుస్తారు ఇవి పిన్ నెంబర్ ను రికార్డు చేస్తాయి
ఇలా హైటెక్ పద్దతిలో తస్కరించిన కార్డు సమాచారాన్ని వినియోగించి మరొక కార్డును(డూప్లికేట్) తయారు చేసి డబ్బును ఎటిఎం నుంచి తస్కరిస్తారు. ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ను గమనించండి…ఎలా ఎటిఎం నుంచి మీ సమాచారాన్ని సేకరిస్తారో అర్థమవుతుంది.
బ్యాంక్ ఖాతాదారులకు మన సైబర్ చట్టాలపై అలాగే సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో అవగాహన లేకపోవడం వలన తమ విలువైన సొమ్మును కొల్పోవలసి వస్తుంది. చాలా మందికి బ్యాంకు ఉద్యోగులకు టెక్నాలజీపైన పూర్తి స్తాయిలో అవగాహన లేకపోవడం కూడా కొంత సమస్యగా ఉంటుంది. ఖాతాదారులు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయమని చేతులు దులుపుకుంటున్నారు. వీరు పోలీసులకు దొరికినా దొంగలించిన సొమ్మును రికవరీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మనకు ఉన్న ఇతర చట్టాల ప్రకారం నేరస్తులను శిక్షించినా ఖాతాదారులకు మాత్రం న్యాయం జరుగడం లేదు. సమాచార సాంకేతిక చట్టము 2000 (Information Technology Act 2000) ప్రకారం ఖాతాదారుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచవలసిన బాధ్యత బ్యాంకులపైనే ఉంది. అదే విధంగా ఎటిఎం లకు తగిన రక్షణ కల్పించవలసిన బాధ్యత బ్యాంకులపై ఉంది. రక్షణ లేని ఎటిఎం లకు నేరగాళ్ళు స్కిమ్మర్స్ను, కెమెరాలు అమర్చటం ద్వారా…ఖాతాదారులు ఎటిఎం ద్వారా డబ్బును డ్రా చేసేటప్పుడు వారి ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించి ఆ సమాచారం ద్వారా డూప్లికేట్ ఎటిఎం కార్డులు తయారు చేసి షాపింగ్ చెయ్యడం లేక ఆ సమాచారంతో Online Tracking లేదా Internet banking ద్వారా ఖాతాదారుల అక్కౌంట్ నుంచి నగదు బదిలి చేస్తున్నారు. దీని వలన ఖాతాదారులు తమ సొమ్మును తమ తప్పు లేకుండానే కొల్పోతున్నారు.
బ్యాంకులకు బాధ్యత ఉంది…
సమాచార సాంకేతిక చట్టం 2000లో సెక్షన్ 85 ప్రకారం ఖాతాదారుల సమాచారానికి భద్రత బ్యాంకులే కల్పించాల్సి ఉటుంది. అలా తగిన భద్రత కల్పించని పక్షంలో ఖాతాదారులు నష్టపోయిన సొమ్ముతో పాటు నష్ట పరిహరాన్ని కూడా సంబందిత బ్యాంకులే చెల్లించవలసి ఉంటుంది. బ్యాంకు ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతాకు చెందిన వ్యక్తి గత సమాచారం మరియు అక్కౌంట్కు సంబంధించిన సమాచారాన్ని (Pin Numbers-Passwords) బ్యాంకు System Hacking చెయడం ద్వారా తస్కరించి అక్కౌంట్లోని డబ్బుని Online Trading ద్వారాగాని, నకిలీ కార్డుల (Credit Card Skimming) ద్వారా గాని తస్కరించి నట్లయితే ఖాతాదారునికి నష్టపరిహారాన్ని చెల్లించే బాధ్యత బ్యాంకులపైనే ఉంటుంది.
బ్యాంకులు గాని ఏ ఇతర సంస్థలు గాని ఖాతాదారుల వ్యక్తిగత మరియు అక్కౌంట్కు సంబంధించిన రహస్య సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంది. దీనికి విరుద్ధంగా సమాచారానికి భద్రత కల్పించలేని పక్షంలో బ్యాంకులు ఖాతాదారుల కొల్పోయిన డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారులే కాదు ఈ సమస్య ఎవరికైనా రావచ్చు. కావున సైబర్ నేరాలు, సైబర్ నేరగాళ్లను శిక్షించే సైబర్ చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి.
సైబర్ నేరగాళ్ల వలను అనేక మంది డబ్బులు పొగొట్టకుంటూ ఉంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే…
Sri Thomas Raju Vs The Branch Manger
ICICI Bank Annanagar, Chennai
థామస్ రాజు అనే ఖాతాదారుడు 1,62,800 రూపాయలు బ్యాంకు బాధ్యతరాహిత్యం వలన కొల్పోయినందున అన్ని ఖర్చులు కలుపుకొని 2,37,850 రూపాయలు చెల్లించాలని, న్యాయాధికారి “Cyber Appellate Tribunal, Chennai” 2011 ను ఆదేశించడమైనది.
Sri Uma Shankar Siva Subramaniam Vs ICICI Tuticorn Branch, Chennai
బాధితుడు కొల్పోయిన రూ.4,95,829 కి,మొత్తం ఖర్చులు కలుపుకొని 12,85,000 చెల్లించాలని న్యాయాధికారి, “Cyber Appellate Tribunal, Chennai” వారిని 12 th April 2010 న ఆదేశించడమైనది.
Leave a Reply